Bigg Boss Telugu 8: ఓజీపై విరుచుకుపడిన జబర్దస్త్ కమెడియన్ టేస్టీ తేజ.. చిచ్చు పెట్టిన బ్రెయిన్ టాస్క్ (వీడియో)
Bigg Boss Telugu 8 October 25 Episode Highlights: బిగ్ బాస్ తెలుగు 8 అక్టోబర్ 25 ఎపిసోడ్‌లో ఓజీ క్లాన్‌పై జబర్దస్త్ కమెడయిన్ టేస్టీ తేజ తెగ సీరియల్ అయ్యాడు. అంతేకాకుండా ఏం మాట్లాడకు అంటూ విరుచుకుపడిపోయాడు. బిగ్ బాస్ పెట్టిన 'మీలో ఎవరు తెలివైనవారు?' అనే బ్రెయిన్ టాస్క్‌లో ఈ గొడవ జరిగింది.
Bigg Boss Telugu 8 Today Episode Highlights: బిగ్ బాస్ తెలుగు 8లో ప్రస్తుతం మెగా చీఫ్ టాస్క్ నడుస్తోంది. తొమ్మిదోవారం మెగా చీఫ్ అవడం కోసం ఓజీ క్లాన్, రాయల్ క్లాన్ సభ్యులు పోటీ పడుతున్నారు. ఇప్పటికే బీబీ రాజ్యం ఛాలెంజ్‌లోని మూడు టాస్క్‌లు గెలిచిన ఓజీ క్లాన్ లీడింగ్‌లో ఉంది. తాజాగా బిగ్ బాస్ తెలుగు 8 అక్టోబర్ 25వ ఎపిసోడ్‌లో మరొ కొత్త టాస్క్ ఆడారు.
బీబీ రాజ్యం టాస్క్
బిగ్ బాస్ 8 తెలుగు అక్టోబర్ 25 ఎపిసోడ్ ప్రోమో వీడియోలోకి వెళితే.. "బీబీ రాజ్యంలోని స్కూల్, న్యాయ వ్యవస్థని పొందడానికి బిగ్ బాస్ ఇస్తున్న టాస్క్ మీలో ఎవరు తెలివైన వారు. బిగ్ బాస్ అడిగే ప్రశ్నలను ఎదుర్కొని వాటికి వీలైనన్ని ఎక్కువ సమాధానాలు తక్కువ సమయంలో చెప్పడం" అని బ్రెయిన్‌కు సంబంధించిన టాస్క్ ఇస్తున్నట్లుగా బిగ్ బాస్ అనౌన్స్ చేశాడు.
ఈ టాస్క్‌లో రెండు గ్రూపుల నుంచి ఒకరి చొప్పున వచ్చి నిలబడతారు. బిగ్ బాస్ ప్రశ్న చదవగానే ఆన్సర్ తెలిసివారు ముందుగా బజర్ కొట్టాలి. పేకాటకు సంబంధించి అడిగిన ప్రశ్నకు జబర్దస్త్ కమెడియన్, ఫుడ్ బ్లాగర్ టేస్టీ తేజ కరెక్ట్ సమాధానం ఇచ్చినట్లు తెలుస్తోంది. అదే విషయాన్ని తన అపోనెంట్ టీమ్ సభ్యుడు నిఖిల్‌ను అడిగితే కరెక్టే అన్నట్లుగా చెప్పాడు.
దాంతో నబీల్ "ఏయ్.. ఆయనకు సపోర్టా" అని అన్నాడు. దాంతో క్వశ్చన్ మార్క్ ఫేస్ పెట్టాడు నిఖిల్. ఇలా వరుసగా కొన్ని ప్రశ్నలు అడిగితే ఇరు క్లాన్స్ టీమ్ మెంబర్స్ వచ్చి సమాధానాలు చెప్పారు. వాటికి తిరిగి కొన్ని ప్రశ్నలు వేసి బిగ్ బాస్ నవ్వించే ప్రయత్నం చేశాడు. అక్కడక్కడ కామెడీ చేశాడు.
నలుగురు ఉండాలి
తర్వాత "ఒక గదిలో ఇద్దరు తండ్రులు ఇద్దరు కొడుకులు ఉన్నారు. ఆ లెక్కన ఆ గదిలో నలుగురు ఉండాలి. కానీ, అక్కడ ముగ్గురే ఉన్నారు" అని బిగ్ బాస్ అడిగాడు. దీనికి నిఖిల్, టేస్టీ తేజ వెళ్లారు. వారిలో తేజ బజర్ కొట్టి తాత.. తండ్రి.. కొడుకు ముగ్గురు అని సమాధానం ఇచ్చాడు. దాంతో "అవినాష్ మీరేం అనుకుంటున్నారు" అని బిగ్ బాస్ అడిగాడు.
"వాళ్ల ఫ్యామిలీ అంతా కలిసి ఉంటే బాగుంటుందని అనుకుంటున్నాను" అని అవినాష్ అన్నాడు. దాంతో అంతా నవ్వేశారు. తర్వాత తేజ, ప్రేరణ బజర్ వద్ద నిల్చున్నారు. "ఒక కోతి ఒక ఉడత ఒక పక్షి రేస్ పెట్టుకుని కొబ్బరి చెట్టుమీదకు వెళ్తే.. అందులోనుంచి ముందుగా ఎవరు అరటి పండును కోయగలుగుతారు" అని బిగ్ బాస్ అడిగాడు. అయితే, ప్రస్న పూర్తి కాకముందే ప్రేరణ బజర్ కొట్టింది.
"బిగ్ బాస్ ముందే కొట్టారు. ఇది మూడోసారి" అని హరితేజ కంప్లైంట్ చేసింది. "ఏ అరటి పండు" అంటూ నిఖిల్ మరోసారి ప్రశ్నను వినిపించే ప్రయత్నం చేశాడు. దాంతో "క్వశ్చన్ రిపీట్ చేయకండి" అని హరితేజ అంటే.. "బ్రో బ్రో.. స్టాప్. నువ్వేం మాట్లాడకు అసలు. క్వశ్చన్ కూడా చెప్పకు. వాళ్లతో ఏం మాట్లాడకు" అని ఒక్కసారిగా సీరియస్ అయ్యాడు తేజ.
బ్రెయిన్ టాస్క్ చిచ్చు
సంచాలక్.. సంచాలక్ అంటూ యష్మీ అరిచింది. ఆమెతోపాటు నబీల్, పృథ్వీ కూడా అన్నారు. ఏంటీ.. అంటూ వెటకారంగా విరుచుకుపడ్డాడు తేజ. అలా ఓజీ క్లాన్‌పై ఒక్కసారిగా సీరియస్ అయ్యాడు తేజ. అయితే, ప్రశ్నలోనే సమాధానం ఉండటంతో అది రిపీట్ చేయకుండా అడ్డుపడ్డాడు తేజ. ఇలా బ్రెయిన్ టాస్క్ పెట్టిన చిచ్చు మరోసారి ఇరు క్లాన్స్ మధ్య గొడవకు దారితీసినట్లు అయింది.
టాపిక్