Bigg Boss: ఉప్పు ప్యాకెట్‌కు 50 వేలు.. ఫుడ్ మొత్తం లాక్కున్న బిగ్ బాస్.. పుణ్యముంటదని మొక్కిన మెగా చీఫ్ నబీల్ (వీడియో)
Bigg Boss Telugu 8 October 8th Episode Highlights: బిగ్ బాస్ తెలుగు 8 అక్టోబర్ 8వ తేది ఎపిసోడ్‌లో బిగ్ బాస్ మరో పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు. హౌజ్‌మేట్స్ దగ్గరున్న ఫుడ్ మొత్తం లాగేసుకున్నాడు. మరోవైపు తన పెళ్లి గురించిటాపిక్ తీసింది విష్ణుప్రియ. బిగ్ బాస్ 8 తెలుగు నేటి ఎపిసోడ్ హైలెట్స్ చూస్తే..
Bigg Boss 8 Telugu Today Episode Highlights: బిగ్ బాస్ తెలుగు 8 సీజన్‌లో గేమ్ మరింత రసవత్తరంగా మారినట్లు తెలుస్తోంది. తాజాగా బిగ్ బాస్ హౌజ్‌మేట్స్‌కు పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు. దీనికి సంబంధించిన బిగ్ బాస్ తెలుగు 8 అక్టోబర్ 8వ తేది ఎపిసోడ్ రెండో ప్రోమోను రిలీజ్ చేశారు.
నాకు తగిన వీరుడు శూరుడు
బిగ్ బాస్ 8 తెలుగు నేటి ఎపిసోడ్ ప్రోమోలోకి వెళితే.. మామ లడ్డు గాని పెళ్లి.. చూసుకో లొల్లి లొల్లి అనే పాటకు హౌజ్‌మేట్స్ డ్యాన్స్ చేశారు. దాంతో తన పెళ్లి గురించి టాపిక్ తీసింది విష్ణుప్రియ. "మా నానమ్మ నా పెళ్లికోసం ఎన్ని పూజలు చేస్తుందో" అని విష్ణుప్రియ అంది. మరి చేసుకోవత్తలేదా అని గంగవ్వ అంది. "నాకు తగిన వీరుడు, శూరుడు దిగాలి కదా" అని విష్ణుప్రియ అంది.
"నేను వీరుడు, శూరుడులా లేనా" అని టేస్టీ తేజ అన్నాడు. ధీరుడు, శూరుడు.. సున్నుండా అని తేజను ఎగతాళి చేశారు విష్ణుప్రియ, నయని. తర్వాత తన ఫిజిక్ నిరూపించుకోడానికి పుషప్స్ చేయబోయి అలాగే పడుకున్నాడు తేజ. గౌతమ్ వచ్చి హెల్ప్ చేస్తే కష్టంగా పుషప్స్ చేశాడు. "చూశావా ఇతను చేయాలంటే ఒకరు రావాలి హెల్ప్‌కు" అని గంగవ్వతో విష్ణుప్రియ చెప్పింది.
బీబీ సూపర్ మార్కెట్
తర్వాత తేజ ఆయాసపడటం చూసి అంతా నవ్వుకున్నారు. అనంతరం బిగ్ బాస్ నుంచి అనౌన్స్‌మెంట్‌ను గౌతమ్ చదివాడు. "మీ దగ్గర ఉన్న రేషన్ మొత్తాన్ని స్టోర్ రూమ్‌లో పెట్టేయండి" అని గౌతమ్ చదివాడు. దాంతో ఫుడ్, రేషన్ మొత్తం స్టోర్ రూమ్‌లో పెట్టారు హౌజ్‌మేట్స్. తర్వాత బీబీ సూపర్ మార్కెట్ ఇప్పుడు ఓపెన్ కాబోతుందని బిగ్ బాస్ చెప్పాడు.
బీబీ సూపర్ మార్కెట్‌ను స్క్రీన్‌లో చూపించారు. అందులో కూరగాయలు, నిత్యావసర సరుకులతోపాటు డంబెల్స్ కూడా ఉన్నాయి. అది చూసి మెహబూబ్, ఇతర హౌజ్‌మేట్స్ షాక్ అయ్యారు. డంబెల్స్ ఏందీ బిగ్ బాస్ అని మెహబూబ్ అన్నాడు. కట్ చేస్తే.. వారికి టాస్క్ ఇచ్చినట్లు ఉన్నాడు. హౌజ్‌మేట్స్ అందరికీ సరుకులు తీసుకొచ్చే బాధ్యత మెగా చీఫ్ అయిన నబీల్, క్లాన్ మెంబర్ నిఖిల్‌కు ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఏ క్లాన్‌కు ఎంతివ్వాలి
బజర్ మోగగానే నబీల్, నిఖిల్ బీబీ సూపర్ మార్కెట్‌లోకి వెళ్లారు. ఇద్దరు కలిసి రేషన్, కూరగాయలు, వంటకు కావాల్సిన సరుకులు తీసుకొచ్చారు. బజర్ మోగగానే.. ఏ క్లాన్‌కు ఏ వస్తువులు ఇవ్వాలి, ఎంత ఇవ్వాలి అనేది మీరే నిర్ణయించి ఇవ్వాల్సి ఉంటుందని ఆ అధికారం మెగా చీఫ్ నబీల్‌కు చెప్పాడు బిగ్ బాస్.
తర్వాత బిగ్ బాస్‌కు చేతులతో మొక్కి రిక్వెస్ట్ పెట్టుకున్నాడు నబీల్. "ఒక్క రిక్వెస్ట్ బిగ్ బాస్. ఒక్క ఉప్పు ప్యాకెట్ కావాలి. ప్లీజ్ బిగ్ బాస్. ప్లీజ్ మీకు పుణ్యం ఉంటది బిగ్ బాస్" అని నబీల్ చేతులెత్తి వేడుకున్నాడు. దాంతో మిగతా కంటెస్టెంట్స్ నవ్వారు. "మీరు కూడా రిక్వెస్ట్ చేయండి" అని నబీల్ అన్నాడు. దాంతో ఏదో మొక్కుబడిగా రిక్వెస్ట్ చేసినట్లు చూపించారు.
ఉప్పుకు 50 వేలు
అనంతరం కెమెరా దగ్గరికి వెళ్లి నబీల్, నిఖిల్ రిక్వెస్ట్ చేసుకున్నారు. కావాలంటే చికెన్ వంటి లగ్జరీ బడ్జెట్ పెట్టేస్తాం ప్లీజ్ అని వేడుకున్నారు నబీల్, నిఖిల్. దాంతో "ఉప్పును పొందడానికి మీకొక అవకాశం ఇస్తున్నాను. ఒక ఉప్పు ప్యాకెట్ ధర 50 వేల రూపాయలు. ఆ డబ్బును విన్నర్స్ ప్రైజ్‌మనీ నుంచి తీసుకోబడుతుంది" అని బిగ్ బాస్ పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు.
దాంతో హౌజ్‌మేట్స్ అంతా షాక్ అయ్యారు. ఉప్పు ప్యాకెటా.. లేక విన్నర్ ప్రైజ్ మనీనా అని కన్‌ఫ్యూజన్‌లో పడిపోయారు. ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్స్ ఫన్నీగా స్పందిస్తున్నారు. ఉప్పు ప్యాకెట్ 50 వేలు ఏంటీ బిగ్ బాక్స్ అంటూ కామెంట్స్, మీమ్స్ పెడుతున్నారు.
టాపిక్