Bigg Boss Telugu 8 Promo: బిగ్ బాస్‌లో తొలి రోజే ఎలిమినేషన్- ఫస్ట్ వీక్ నుంచే ట్విస్టులు- టాస్క్ ఆడితేనే ఎంట్రీ- ప్రోమో
Bigg Boss Telugu 8 Elimination: బిగ్ బాస్ తెలుగు 8 ప్రోమోను తాజాగా విడుదల చేశారు. ఇందులో హౌజ్‌లోకి వెళ్లిన డైరెక్టర్ అనిల్ రావిపూడి బిగ్ బాస్‌లో ఫస్ట్ వీక్ నుంచే ట్విస్టులు ఉన్నట్లుగా చెప్పారు. తను ఒకరిని బయటకు తీసుకెళ్తున్నట్లు వారి ప్లేసులో మరొకరు లక్కీ డ్రా ద్వారా ఎంట్రీ ఇస్తారని తెలిపారు.
Bigg Boss Telugu 8 Promo: బిగ్ బాస్ తెలుగు 8 సీజన్ ప్రోమోను తాజాగా విడుదల చేశారు మేకర్స్. గృహ ప్రవేశం అంటూ ప్రారంభమైన ఈ ప్రోమోలో నాగార్జున సూపర్ స్టైలిష్ లుక్‌తో ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత బిగ్ బాస్ హౌజ్ మొత్తం చూపించారు. అనంతరం కంటెస్టెంట్ల ఎంట్రీని ఇచ్చారు. కాకపోతే వారి మొహాలు మాత్రం రివీల్ చేయలేదు.
కళ్లలోకి చూస్తే కొట్టుకుపోతాను
వారిలో ఒక లేడి కంటెస్టెంట్ నాగార్జున కళ్లలోకి చూస్తూ మాట్లాడలేనని, దాంట్లో కొట్టుకుపోతానని చెప్పింది. మరొకరితో ఈ అమ్మాయి చూడటానికి ఫ్లవర్‌లా ఉంది. కానీ ఆమెలో ఫైర్ ఉంది అని నాగార్జున కాంప్లిమెంట్ ఇచ్చారు. హౌజ్‌లో ఎవరినైనా పార్టనర్‌ని వెతుక్కుందామనుకుంటున్నావా అని ఒక మేల్ కంటెస్టెంట్‌ను నాగార్జున అడిగితే.. లేదు లేదు అని అతను చెప్పాడు.
అయితే, గ్రాండ్ లాంచ్ రోజే బిగ్ బాస్ ట్విస్టులు పెట్టినట్లు తెలుస్తోంది. సాధారణంగా హౌజ్‌లోకి కంటెస్టెంట్స్ సోలో ఎంట్రీ ఉంటుంది. కానీ, ఈ సారి సోలో ఎంట్రీ లేదని నాగార్జున చెప్పారు. టాస్క్ ఆడిన తర్వాతే ఇద్దరు కంటెస్టెంట్స్‌ను హౌజ్‌లోకి పంపించారు. అయితే, అది అమ్మాయి, అబ్బాయి జోడీగా ఉంది. ఇద్దరిని జోడీగా హౌజ్‌లోకి పంపించారు.
నానికి ఎన్ని మార్కులు
బిగ్ బాస్ ఫుల్ ఆఫ్ ట్విస్ట్ అని చూపించారు. ఇక తర్వాత నేచురల్ స్టార్ నాని, హీరోయిన్ ప్రియాంక మోహన్ అడుగుపెట్టారు. నాని నటనకు ఎన్ని మార్కులు ఇస్తావ్ అని ప్రియాంకను నాగార్జున అడిగితే.. వందకు వంద అని చెప్పింది. దానికి మరి ఎస్‌జే సూర్య గారికి ఎన్ని మార్కులు ఇస్తావ్ అని నాని అడిగితే.. హండ్రడ్ అండ్ వన్ అని ప్రియాంక చెప్పింది.
తర్వాత 29 సినిమాల్లో చాలామంది హీరోయిన్స్‌తో యాక్ట్ చేశావ్ కదా. మరి ఈ అమ్మాయికి (ప్రియాంక మోహన్) ఎన్ని మార్కులు ఇస్తావ్ అని నానిని నాగార్జున అడుగుతాడు. హమ్మా.. మీరు ఇరికిస్తున్నారు అని నాని అన్నాడు. నైస్ క్వశ్చన్ అని ప్రియాంక అంది. నాకోసం ఒక పని చేసిపెట్టాలి. నాలుగు వారాలు హాలీడేకు వెళ్తున్నాను. హోస్ట్‌గా చేసి పెట్టాలి అని నాగార్జున అడుగుతాడు.
ట్విస్ట్ అంట-టర్న్ అంట
దాంతో వద్దు వద్దు.. అదొక్కటి తప్పా ఇంకేమైనా అడగండి అని నాని అన్నాడు. అనంతరం డైరెక్టర్ అనిల్ రావిపూడి హౌజ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. "లిమిట్‌లెస్ అంట, ట్విస్ట్ అంట, టర్న్ అంట.. ఆ పని ఫస్ట్ వీక్ నుంచే మొదలుపెడుతున్నారు. సో ఇప్పుడు నేను ఒకరిని బయటకు తీసుకెళ్లాలి. లక్కీ డ్రాప్‌లో వాళ్ల ప్లేసులో స్వాప్ అయి మరొకరు వస్తారు" అని షాక్ ఇచ్చాడు అనిల్ రావిపూడి.
అనిల్ రావిపూడి మాటలను బట్టి అది ఎలిమినేషన్ అనిపిస్తుంది. అదే నిజమైతే మొదటి రోజే ఎలిమినేషన్ ఉండటం అనేది పెద్ద ట్విస్ట్ అవుతుంది. మరి నిజంగా అది ఎలిమినేషనా ఇంకేమైనాన అనేది ఎపిసోడ్‌లో తెలుసుకోవాల్సిందే.