Bigg Boss Telugu 8: పోట్లగిత్తల్లా గొడవ పడ్డ నబీల్, పృథ్వీ.. ఏమాత్రం ఆపలేకపోయిన నిఖిల్, అవినాష్.. గంగవ్వతో అలా! (వీడియో)
Bigg Boss Telugu 8 November 8th Episode Highlights: బిగ్ బాస్ తెలుగు 8 నవంబర్ 8 ఎపిసోడ్‌లో పదో వారం మెగా చీఫ్ అయ్యేందుకు టాస్క్ నిర్వహించారు. ఈ టాస్క్‌లో పృథ్వీ, నబీల్ మధ్య పెద్ద గొడవ జరిగింది. పోట్ల గిత్తల్లా మరి గొడవ పడ్డారు. వాళ్లను ఆపేందుకు నిఖిల్, అవినాష్, మిగతా హౌజ్‌మేట్స్ వల్ల కూడా కాలేదు.
Bigg Boss 8 Telugu Today Episode Highlights: బిగ్ బాస్ తెలుగు 8 హౌజ్‌లో ప్రస్తుతం పదో వారానికి సంబంధించి మెగా చీఫ్ టాస్క్ నడుస్తోంది. ఇందులో భాగంగా మెగా చీఫ్ అయ్యేందుకు కంటెండర్స్ అందరూ వివిధ టాస్క్‌ల్లో పాల్గొంటారన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మూట ముఖ్యం అనే టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్.
నబీల్ ఎలిమినేట్
ఒక కేజ్‌లో మెగా చీఫ్ కంటెండర్స్ ఉంటే వారిలో ఎక్కువ మూటలు ఉన్నవాళ్లు ఎలిమినేట్ అవుతూ ఉంటారు. సపోర్ట్ చేయాలనుకున్న హౌజ్ మేట్స్ ఇతర కంటెండర్స్ ఉన్న కేజ్‌లో మూటలు పడేస్తూ ఉండాలి. ఈ మూట ముఖ్యం టాస్క్ నవంబర్ 7 ఎపిసోడ్‌లో ప్రారంభమైంది. అందులో నబీల్ మెగా చీఫ్ టాస్క్ నుంచి ఎలిమినేట్ అయ్యాడు.
బిగ్ బాస్ తెలుగు 8 నవంబర్ 8వ తేది ఎపిసోడ్‌లో కూడా మూట ముఖ్యం టాస్క్ కంటిన్యూ అయింది. దీనికి సంబంధించిన ప్రోమో వీడియోను తాజాగా విడుదల చేశారు. ఇందులో మొదట నబీల్, పృథ్వీ మాట్లాడుకున్నారు. "నాకు సపోర్ట్ చేసినవాళ్లు సపోర్ట్ అడుగుతున్నారు. అటు వెళ్తున్నా నేను" అని పృథ్వీతో నబీల్ చెప్పాడు.
నో వర్రీస్ అంటూ
"సపోర్ట్ అడుగు. నువ్ మాటిచ్చావ్. అది నీ డిపెండ్. తర్వాత వాళ్లు నా మీద డిపెండ్ అవుతారు" అని పృథ్వీ బదులిచ్చాడు. "నో వర్రీస్" అని నబీల్ అంటే.. "నో వర్సీస్. ష్యూర్" అని పృథ్వీ అన్నాడు. "ఐయామ్ సారీ" అని నబీల్ వెళ్లిపోయాడు. తర్వాత గౌతమ్, అవినాష్, రోహిణి, తేజ వాళ్లతో నబీల్ మాట్లాడటం చూపించారు.
"బుస కొడత ఇప్పుడు. కొడత అన్నందుకైనా కొడత బుస. చూడు ఆ బుస కొట్టుడు" అంటూ అచ్చం నాగు పాము బుస కొట్టినట్లు నాలుకను బయటకు లోపలకు అంటూ నబీల్ ఇమిటేట్ చేశాడు. అది చూసి రోహిణి వాళ్లు అంతా నవ్వేశారు. తర్వాత బజర్ మోగింది. దాంతో అంతా అలర్ట్ అయి మూటలు పట్టుకుని తమకు మెగా చీఫ్ అవ్వాలని లేని కంటెండర్స్ కేజ్‌లో వేసేందుకు ప్రయత్నాలు చేశారు.
చూసుకోని పెట్టు
ఈ క్రమంలోనే చాలా వరకు మూటలు పృథ్వీ కేజ్‌లో నబీల్ వేశాడు. అది చూసి నబీల్ అని పృథ్వీ అరిచాడు. ఈయన బ్లాక్ చేశాడు అని నిఖిల్ గురించి చెప్పాడు నబీల్. "చూసుకోని పెట్టు.. చూసుకోని పెట్టు.. నా మీద పెట్టొద్దు" అంటూ తెగ ఫైర్ అయ్యాడు పృథ్వీ. తర్వాత గంగవ్వను అలా తీసుకురావొద్దు అంటూ హరితేజ, యష్మీ, విష్ణుప్రియ ఆపేందుకు ప్రయత్నించారు.
"ఏవండి ఈవిడ గారు తీసుకొచ్చారు కదండీ" అని టేస్టీ తేజ అన్నాడు. తర్వాత "బజర్‌కు ముందు బుట్టను వెనుక అంటాడు" అని నబీల్ (వరంగల్ యూట్యూబర్) కెమెరాకు చెప్పాడు. దాంతో "అప్పుడెందుకు చెప్పలే.. నోరు రాలేదా.. నోరు రాలేదా" అంటూ చేతులతో సైగలు చేస్తూ పృథ్వీ దూసుకొచ్చాడు. దాంతో పృథ్వీ చెస్ట్‌పై చేయి వేసి ఆపుతూ నిఖిల్‌కు వివరణ ఇస్తున్నాడు నబీల్.
పోట్లగిత్తల్లా తలపడి
అది చూసి మరింత రెచ్చిపోయిన పృథ్వీ నబీల్‌ను తోసేసాడు. "టచ్ ఎత్తేందుకు చేస్తున్నావ్.. టచ్ ఎందుకు చేస్తున్నావ్" అంటూ పృథ్వీ అరిచాడు. అప్పుడే ఇద్దరు తలలను పోట్లగిత్తల్లా పెట్టుకుని మరి గొడవ పడ్డారు. మధ్యలో వచ్చిన అవినాష్‌ను జరుగు అని పక్కకు తోసేశాడు నబీల్. అటు నుంచి పృథ్వీని ఆపేందుకు ప్రయత్నించాడు నిఖిల్.
తర్వాత యష్మీ కూడా పృథ్వీని ఆపేందుకు ట్రై చేసింది. కానీ, ఇద్దరు మాత్రం తగ్గేదే లే అన్నట్లు గొడవ పడ్డారు. ఒకరికొకరు అరుచుకుంటూ ఉన్నారు. వీళ్లేకాకుండా హౌజ్‌మేట్స్ ఆపేందుకు ప్రయత్నించిన నబీల్, పృథ్వీ ఆగలేదు. దాంతో వారిద్దరిని పక్కనే ఉండి చూస్తూ ఉండిపోయాడు నిఖిల్.