Bigg Boss Elimination: ఒక్కరోజులో తారుమారైన బిగ్ బాస్ ఓటింగ్.. ఇవాళే ఎలిమినేషన్.. మారిపోయిన ఎలిమినేట్ కంటెస్టెంట్!
Bigg Boss Telugu 8 Elimination Ninth Week: బిగ్ బాస్ తెలుగు 8 తొమ్మిదో వారం ఓటింగ్ ఫలితాలు ఒక్కరోజులో మారిపోయాయి. గురువారం వరకు టాప్‌లో యష్మీ ఉంటే.. శుక్రవారం వచ్చేసరికి ఒక్కసారిగా గౌతమ్ మొదటి స్థానంలో దూసుకుపోతున్నాడు. అలాగే, ఈ వారం ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ కూడా మారిపోయినట్లుగా తెలుస్తోంది.
Bigg Boss 8 Telugu Elimination This Week: బిగ్ బాస్ తెలుగు 8 సీజన్‌లో ఊహించని సంఘటనలు జరుగుతున్నాయి. ఒక్కరోజులో బిగ్ బాస్ తెలుగు 8 తొమ్మిదో వారం ఓటింగ్ ఫలితాలు మారిపోయాయి. మొన్నటి వరకు అంటే గురువారం (అక్టోబర్ 31) దాకా టాప్‌లో ఉన్న యష్మీ రెండో స్థానానికి పడిపోయింది. రెండో స్థానంలో ఉన్న గౌతమ్ టాప్‌లోకి దూసుకొచ్చేశాడు.
నామినేషన్స్‌లో ఐదుగురు
అలాగే, డేంజర్ జోన్‌లో ఉన్న కంటెస్టెంట్స్ చేంజ్ అవడమే కాకుండా ఎలిమినేట్ కంటెస్టెంట్ పూర్తిగా మారిపోయినట్లు తెలుస్తోంది. దాంతో బిగ్ బాస్ తెలుగు 8 ఈ వారం ఎలిమినేట్ కానున్న కంటెస్టెంట్ ఎవరా అనే కన్ఫ్యూజన్, ఆసక్తి నెలకొంది. ఇదిలా ఉంటే, బిగ్ బాస్ తెలుగు 8 తొమ్మిదో వారం నామినేషన్స్‌లో యష్మీ, గౌతమ్, నయని పావని, టేస్టీ తేజ, హరితేజ ఐదుగురు ఉన్న విషయం తెలిసిందే.
రాకెట్‌లా దూసుకొచ్చి
వీరిలో 36.73 శాతం ఓటింగ్, 5,782 ఓట్లతో గౌతమ్ టాప్‌లోకి ఎగబాగితే.. 27.78 శాతం ఓటింగ్, 4,373 ఓట్లతో యష్మీ రెండో స్థానానికి పడిపోయింది. ఇక మొన్నటి వరకు డేంజర్ జోన్‌లో అది కూడా ఐదో స్థానంలో ఆఖరున ఉన్న నయని పావని ఒక్కసారిగా మూడో స్థానంలోకి రాకెట్‌లా దూసుకొచ్చింది. ఆమెకు 2,308 ఓట్లతో 14.66 శాతం ఓటింగ్ నమోదు అయింది.
ఓటింగ్ లెక్కలు తారుమారు
ఇక టేస్టీ తేజ నాలుగో స్థానానికి పడిపోయాడు. ఈ జబర్దస్త్ కమెడియన్‌కు 1,830 ఓట్లతో 11.62 శాతం ఓటింగ్ వచ్చింది. ఇక అట్టడుగున ఆఖరి స్థానంలో 1,451 ఓట్లతో, 9.22 శాతం ఓటింగ్‌తో హరితేజ నిలిచింది. దీంతో డేంజర్ జోన్‌లో ఇప్పుడు టేస్టీ తేజ, హరితేజ ఉన్నారు. మొన్నటి వరకు హరితేజ, నయని పావని ఉండేవారు. కానీ, ఒక్కసారిగా ఓటింగ్ లెక్కలు తారుమారు అయ్యాయి.
హరితేజ ఎలిమినేట్
ఈ ఓటింగ్ ప్రకారం చూస్తే.. చివరి రెండు స్థానాల్లో ఉన్నవారు ఎలిమినేషన్‌కు దగ్గరిలో ఉన్నట్లు. అంటే, టేస్టీ తేజ, హరితేజ ఎలిమినేట్ అయ్యేందుకు అవకాశాలు ఉన్నాయి. చివరిగా ఉన్న హరితేజనే ఈ వారం ఎలిమినేట్ కానుందని తెలుస్తోంది. అయితే, మొన్నటివరకు ఐదో స్థానంలో ఉన్న నయని కూడా ఎలిమినేట్ అయ్యేందుకు ఛాన్స్ ఉందని టాక్ వినిపిస్తోంది.
ఇవాళే ఎలిమినేషన్ షూటింగ్
మొత్తంగా చూసుకుంటే బిగ్ బాస్ 8 తెలుగు ఈ వారం టేస్టీ తేజ, నయని పావని, హరితేజ ముగ్గురిలో ఒకరు ఎలిమినేట్ కానున్నారు. వీరిలో ఎవరు ఎలిమినేట్ కానున్నారనేది ఇవాళ తేలిపోనుంది. అంటే, బిగ్ బాస్ 8 తెలుగు 9వ వారం ఎలిమినేషన్ షూటింగ్ ఇవాళ (నవంబర్ 2) జరుగుతుంది. ఈ ఎపిసోడ్‌లో ఆదివారం (నవంబర్ 3) ప్రసారం చేస్తారు.
ఎలిమినేట్ కంటెస్టెంట్
మొత్తానికి శుక్రవారం వచ్చేసరికి ఒక్కరోజులో బిగ్ బాస్ ఓటింగ్ తారుమారు అయిపోయింది. దాంతో గౌతమ్ టాప్‌లోకి రాగా.. డేంజర్ జోన్‌లోకి హరితేజతోపాటు టేస్టీ తేజ ఎంటర్ అయ్యాడు. ఎలిమినేట్ అవుతుందనుకున్న నయని పావని మూడో స్థానంలోకి వెళ్లిపోయింది. దాంతో ఈ వారం అది కూడా ఇవాళ జరిగే ఎలిమినేషన్ కంటెస్టెంట్ మారిపోయారు. మరి చూడాలి ఇవాళ జరిగే ఎలిమినేట్ ఎపిసోడ్ షూటింగ్‌లో ఎవరు హౌజ్‌ను వీడనున్నారనేది.
టాపిక్