Bigg Boss Manikanta: ఒక్క ఈగ కూడా వాలనివ్వను.. ఢీ షో డ్యాన్సర్ నైనికకు నాగ మణికంఠ ప్రతిజ్ఞ
Bigg Boss Telugu 8 Manikanta Nainika: బిగ్ బాస్ తెలుగు 8 సెప్టెంబర్ 12వ తేది ఎపిసోడ్‌లో కంటెస్టెంట్ల మధ్య కాస్తా ఫిజికల్ అయింది. హౌజ్‌లో పూల్ టాస్క్ అయిన తర్వాత ఢీ షో డ్యాన్సర్ నైనికను ఓదార్చాడు నాగ మణికంఠ. ఒక్క ఈగ కూడా వాలనివ్వను అంటూ ప్రామిస్ చేశాడు. బిగ్ బాస్ 8 తెలుగు డే 11 హైలెట్స్ చూస్తే..
Bigg Boss Telugu 8 Day 11 Highlights: బిగ్ బాస్ తెలుగు 8లో ఇప్పటివరకు అరుపులు, కేకలు, గొడవలు అయ్యాయి. కానీ, బిగ్ బాస్ 8 తెలుగు సెప్టెంబర్ 12వ తేది ఎపిసోడ్‌లో కంటెస్టెంట్స్ కాస్తా ఫిజికల్‌గా బిహేవ్ చేశారు. గత శనివారం వచ్చిన హోస్ట్ నాగార్జున అప్పటివరకు వారం రోజుల్లో కంటెస్టెంట్ల ప్రవర్తనకు రూ. 5 లక్షలు ప్రైజ్ మనీని అనౌన్స్ చేశాడు.
అందులో నుంచి రెండు లక్షలు కట్ చేసి మూడు లక్షలు మాత్రమే బిగ్ బాస్ ఇచ్చాడు. ఈ సీజన్‌లో ఇన్ఫినిటీ ప్రైజ్ మనీ కాబట్టి కంటెస్టెంట్స్ ఏ రోజుకు ఆరోజు సంపాదించుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో కట్ అయిన రెండు లక్షల రూపాయలను టాస్కులు ఆడి గెలుచుకునే అవకాశం ఇచ్చాడు బిగ్ బాస్. ఈ క్రమంలోనే పూల్ టాస్క్ పెట్టాడు.
మణికంఠను ఆపి
పూల్ టాస్క్‌లో నాగ మణికంఠ, సోనియా, విష్ణుప్రియ పాల్గొనాల్సిందిగా ప్లాస్మా టీవీ స్క్రీన్‌లో చూపించారు. దాంతో ముగ్గురు పరిగెత్తారు. కానీ, నాగ మణికంఠను పృథ్వీ అడ్డుకుని ఫౌల్ గేమ్ ఆడాడు. పృథ్వీకి తగిలి అన్‌బ్యాలెన్స్ అయిన సోనియా కిందపడిపోయింది. దాంతో విష్ణు వెళ్లి స్విమ్మింగ్ పూల్‌లో మొదటగా దూకి గెలిచింది.
అనంతరం పృథ్వీ ఆపడంపై నిఖిల్ కూల్‌గా ఫిజికల్ వద్దని చెప్పాడు. కానీ, యశ్మీ వినలేదు. మేము ఇలాగే ఆడతాం, నచ్చినట్లు చేస్తాం అని చెప్పింది. ఇద్దరం చీఫ్స్ మాట్లాడుతున్నాం కదా అని నైనికను కూడా పిలిచాడు నిఖిల్. ఫిజికల్ వద్దని నిఖిల్, నైనికి చెప్పారు. కానీ, అలా కావాలని చేయడం కాదని, సమయాన్ని బట్టి అలా జరుగుతుందన్నట్లుగా యశ్మీ చెప్పింది. అనంతరం బిగ్ బాస్ రూల్స్ బుక్‌లో కూడా ఫిజికల్ చేస్తే హౌజ్ నుంచి పంపిస్తామని ఉందని ఆదిత్యం ఓం చెప్పేందుకు ప్రయత్నించాడు.
తామే గెలుస్తామని
అయినా కానీ, పృథ్వీ, యశ్మీ ఏమాత్రం వినలేదు. అయితే, నిఖిల్ క్లాన్‌లో మణికంఠ ఒక్కడే ఉన్నాడు. ఢీ షోలో డ్యాన్సర్‌గా పాపులర్ అయిన నైనికి క్లాన్‌లో విష్ణు, సీత, నబీల్ ఉన్నారు. ఇక యశ్మీ క్లాన్‌లో ఎక్కువ మెంబర్స్, అది కూడా స్ట్రాంగ్‌గా ఉన్నారు. దాంతో ఫిజికల్‌గా ఆడితే తామే గెలుస్తామన్న ధైర్యంతో వయెలెన్స్ వద్దంటే యశ్మీ ఒప్పుకోలేదు.
ఇదంతా చూసిన నైనిక.. తన టీమ్ వీక్‌గా ఉందనో.. వాళ్లు కావాలని ఫిజికల్ చేస్తే ఎలా అన్న ఆలోచనతోనేమో గానీ డల్‌గా ఒంటరిగా కూర్చుంది. అది చూసిన మణికంఠ దగ్గరికి వెళ్లాడు. స్పేస్ కావాల, తర్వాత రావన్న అని అడిగాడు. నాకు కూడా మూడ్ సెట్ కాలేదు అని చెప్పాడు. అనంతరం నైనికను హగ్ చేసుకుని "ఒక్క ఈగ కూడా వాలనివ్వను" అని హామీ ఇస్తూ సర్దిచెప్పాడు.
ఫిజికల్‌గా మీదకు రానివ్వను
తనపైకి ఫిజికల్‌గా ఎవరిని మీదకు రానివ్వను అన్న అర్థంలో నాగ మణికంఠ ప్రామిస్ చేసినట్లుగా తెలుస్తోంది. అయితే, అంతకంటే ముందు తాను ఫిజికల్‌గా బలంగా లేకపోవడం వల్లే పృథ్వీని అడ్డు తప్పించలేకపోయాని అని ఆదిత్యం ఓంకు చెబుతూ ఫీల్ అయ్యాడు. ఫిజికల్ స్ట్రెంత్ ఉంటే బాగుండేదన్నాడు.
అలాగే, ఎపిసోడ్ ఎండింగ్‌లో పెట్టిన సాక్స్ టాస్క్‌లో సంచాలక్ ప్రేరణపైకి పృథ్వీ అడ్డదిడ్డంగా వాదిస్తూ పైకి వెళ్లాడు. ఆ సమయంలో మణికంఠ స్టాండ్ తీసుకుని పృథ్వీ అలా పైకి వెళ్లకు అని చెప్పాడు. తన టీమ్ మెంబర్ అయిన అభయ్ కూడా అది కరెక్ట్ కాదని చెప్పడంతో పృథ్వీ వెనక్కి తగ్గాడు. ఇది ఎపిసోడ్‌లో టెలీకాస్ట్ చేయలేదు. కానీ, లైవ్‌లో మాత్రం వచ్చింది.