Bigg Boss Winner: బిగ్ బాస్ విన్నర్ ఎవరో చెప్పిన నాగ మణికంఠ- అతనికి నామినేషన్ కాదు మోటివేషన్- సత్తా లేకపోతే బయటకు రా!
Bigg Boss Telugu 8 Nominations 12th Week: బిగ్ బాస్ తెలుగు 8లో 12వ వారం నామినేషన్స్ రెండో రోజు కూడా జోరుగా సాగాయి. ఈ వారం నామినేషన్స్‌లో రెండో రోజున ఆదిత్య ఓం, కిర్రాక్ సీత, నాగ మణికంఠ వచ్చి నామినేట్ చేశారు. వీరిలో హౌజ్ నుంచి వెళ్తూ బిగ్ బాస్ విన్నర్ రేస్‌లో ఎవరున్నారో చెప్పాడు నాగ మణికంఠ.
Bigg Boss 8 Telugu Nominations This Week: బిగ్ బాస్ తెలుగు 8 సీజన్‌లో ఊహించని ట్విస్ట్ ఎలిమినేటెడ్ కంటెస్టెంట్స్‌తో నామినేట్ చేయించడం. బిగ్ బాస్ తెలుగు 8 పన్నెండో వారం నామినేషన్స్ ప్రక్రియ సోమవారం (నవంబర్ 18) ప్రారంభమైంది. ఆరోజు సోనియా, బేబక్క, శేఖర్ బాషా వచ్చి నామినేట్ చేశారు.
పెద్ద మోటివేషన్
బిగ్ బాస్ 8 తెలుగు 12వ వారం నామినేషన్స్ రెండో రోజు కూడా జరిగాయి. మంగళవారం (నవంబర్ 19) నాడు జరిగిన నామినేషన్స్ ప్రక్రియలో ఆదిత్య ఓం, కిర్రాక్ సీత, నాగ మణికంఠ వచ్చి నామినేట్ చేశారు. నాగ మణికంఠ వచ్చి మొదట నిఖిల్‌ను తర్వాత నబీల్‌ను నామినేట్ చేశాడు. పేరుకే నబీల్‌ను నాగ మణికంఠ నామినేట్ చేశాడు కానీ, ఊహించని విధంగా పెద్ద మోటివేషన్ ఇచ్చాడు.
నబీల్‌ను నామినేట్ చేసిన నాగ మణికంఠ "నువ్ స్ట్రాంగ్ ప్లేయర్‌వి కానీ, ఎక్కడ నామినేషన్స్‌లోకి వస్తావో అన్న భయం నీలో కనిపిస్తుంది. ఆ భయం వద్దు. అలాగే, నువ్వు ఎవరికోసం త్యాగాలు చేయకు. మొదటి నుంచి షేర్ లెక్క ఆడావ్. షేర్ లెక్కే ఉండు. లైట్స్ అన్నీ ఆఫ్ అయిన తర్వాత ట్రోఫీ పట్టుకుని బయటకురా. అదే నాకు కావాలి" అని చెప్పాడు.
గేమ్ బయటకు తీయ్
"ఈక్వేషన్స్ గురించి ఆలోచించకు. జరిగేది జరుగుతుంది. నీకు ఉన్న బలం గట్టిగా ఆడటం. అస్సలు తగ్గకు. నీకు పోటీగా ఎవరున్నారని భయపడకు ఇచ్చిపడేయ్. టాస్క్‌లు ఆడి పడేయ్. నువ్ టాస్క్‌లు ఆడకుండా త్యాగాలు చేస్తే ఎలా కుదురుతుంది. ఆడియెన్స్ నీ నుంచి చాలా ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. వాళ్ల అంచనాలకు దగ్గరిగా రా. నిన్ను చాలా మంది ఇష్టపడుతున్నారు. నువ్ ఆడాల్సింది వాళ్లకోసం. నీ గేమ్ బయటకు తీయ్" అని నాగ మణికంఠ అన్నాడు.
"నీ మనసులో ఉంది బయటకు తీయ్. నీకంటూ ఒపీనియన్ ఉంది. దాన్ని రైజ్ చేయు. ఎవడు అడ్డు చెప్పిన వినకు. నువ్వు ఎవరికి తల వంచాల్సిన అవసరం లేదు. త్యాగాలు ఎందుకు చేస్తున్నావ్. నీ గురించి ఎవరైనా మాట్లాడుతుంటే ముందు వాళ్లను ఆపు. నాది నేను చూసుకోగలనని చెప్పు. నీకు ఇబ్బంది అయితే పక్కకి పో అని చెప్పు. లేదు నాకూ అంత సత్తా లేదంటే బయటకు వచ్చేయ్. నువ్ హౌజ్‌లో ఉన్నావంటే నీ గురించే మాట్లాడుకోవాలి. టాస్క్ పేపర్ చదవడం కూడా యాడ్ అవుతుంది" అని నబీల్‌తో నాగ మణికంఠ చెప్పాడు.
నామినేషన్ ఒప్పుకుంటా
అదంతా విన్న నబీల్ "సేఫ్ గేమ్ ఏం లేదు. నన్ను ఎవరు నామినేట్ చేయడం లేదు. హౌజ్‌లో ఉంటా. బిగ్ బాస్ హౌజ్ లైట్స్ బంద్ అయినప్పుడు బయటకు అడుగుపెడతా. నాలో ఆ సత్తా ఉంది. నా వాయిస్ వినిపిస్తా. నీ నామినేషన్ యాక్సెప్ట్ చేస్తా. ఆ బస్తా టాస్క్ ఒక్కటే ఆడలేదు. నువ్ చెప్పినవన్నీ తీసుకుంటా" అని నాగ మణికంఠతో అన్నాడు.
దీని తర్వాత నిఖిల్ మధ్యలో "అమ్మతోడు.. ఇది నామినేషనో లేదంటే మోటివేషనో తెలియడం లేదు. అసలు డిఫెండింగ్ రావడం లేదు అవతల నుంచి" అని అన్నాడు. దాంతో "ఇదేరా నీతో వచ్చిందీ. నీ వరకూ వస్తే అది నామినేషన్స్.. ఎదుటి వాళ్లకి మోటివేషన్. మీ ఇద్దరు ముందు రావాలనే నామినేట్ చేశాను" అని నాగ మణికంఠ అన్నాడు.
టైటిల్ విన్నర్ రేస్‌లో ఉన్నది
అనంతరం నాగ మణికంఠ హౌజ్ నుంచి వెళ్లడంతో ఇంటి సభ్యులకు టైటిల్ విన్నర్ రేస్‌లో ఎవరు ఉన్నారో క్లారిటీ వచ్చేసింది. హౌజ్ నుంచి వెళ్తూ కంటెస్టెంట్స్‌కు విన్నర్ రేస్‌లో ఎవరున్నారే విషయం చెప్పాడు. గౌతమ్, నిఖిల్, నబీల్ ముగ్గురు విన్నర్ రేస్‌లో ఉన్నారని నాగ మణికంఠ చెప్పాడు. నాగ మణికంఠ అలా చెప్పినట్లు నబీల్‌తో నిఖిల్ చెప్పాడు. దాంతో బిగ్ బాస్ తెలుగు 8 టైటిల్ విన్నర్ ఎవరో కాస్తా క్లారిటీ వచ్చేసినట్లు అయింది.