Bigg Boss Telugu 8: గౌతమ్‌కు అసలైన శత్రువు బిగ్ బాస్- ఎలివేషన్ సీన్స్ లేపేస్తున్న బీబీ టీమ్- టైటిల్ విన్నర్ కాకుడదనేనా?-bigg boss telugu 8 gautham krishna best scenes removed by bb team in bigg boss 8 telugu december 5th episode highlights ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Bigg Boss Telugu 8: గౌతమ్‌కు అసలైన శత్రువు బిగ్ బాస్- ఎలివేషన్ సీన్స్ లేపేస్తున్న బీబీ టీమ్- టైటిల్ విన్నర్ కాకుడదనేనా?

Bigg Boss Telugu 8: గౌతమ్‌కు అసలైన శత్రువు బిగ్ బాస్- ఎలివేషన్ సీన్స్ లేపేస్తున్న బీబీ టీమ్- టైటిల్ విన్నర్ కాకుడదనేనా?

Sanjiv Kumar HT Telugu
Dec 06, 2024 08:01 AM IST

Bigg Boss Telugu 8 December 5th Episode Highlights: బిగ్ బాస్ తెలుగు 8 టైటిల్ విన్నర్ రేస్‌లో నిఖిల్‌తోపాటు గౌతమ్ కూడా ఉన్నాడు. అయితే, మొదటి నుంచి గౌతమ్ విషయంలో బిగ్ బాస్ 8 తెలుగు టీమ్ అన్యాయం చేస్తోందని నెటిజన్స్ మండిపతున్నారు. గౌతమ్‌కు అసలైన శత్రువుగా బీబీ టీమ్ ఉన్నట్లుగా కనిపిస్తోందని అంటున్నారు.

గౌతమ్‌కు అసలైన శత్రువు బిగ్ బాస్- ఎలివేషన్ సీన్స్ లేపేస్తున్న బీబీ టీమ్- టైటిల్ విన్నర్ కాకుడదనేనా?
గౌతమ్‌కు అసలైన శత్రువు బిగ్ బాస్- ఎలివేషన్ సీన్స్ లేపేస్తున్న బీబీ టీమ్- టైటిల్ విన్నర్ కాకుడదనేనా? (Instagram)

Bigg Boss 8 Telugu December 5th Episode Highlights: బిగ్ బాస్ తెలుగు 8 సీజన్ మరో వారంలో ముగిసిపోనుంది. బిగ్ బాస్ 8 తెలుగు గ్రాండ్ ఫినాలే డిసెంబర్ 15న నిర్వహించనున్నట్లు సమాచారం అందిన విషయం తెలిసిందే. అంటే, ఇంకా కొన్ని రోజుల్లో బిగ్ బాస్ తెలుగు 8 టైటిల్ విన్నర్ ఎవరో తేలిపోనుంది.

మంచి పర్ఫామెన్స్ ఇచ్చినా

ప్రస్తుతం బిగ్ బాస్ 8 తెలుగు టైటిల్ విజేత రేసులో నిఖిల్, గౌతమ్ ఉన్నారు. వీరిలో టాప్ 2 కంటెస్టెంట్స్ ఉండనున్నారని స్పష్టంగా తెలిసిపోతుంది. అయితే, ఈ బిగ్ బాస్ అనేవాడు కొందరి కంటెస్టెంట్లు ఎన్ని తప్పులు చేసిన చూపించకపోడవంతోపాటు మరికొందరు హౌజ్‌మేట్స్ ఎంత మంచి పర్ఫామెన్స్ ఇచ్చిన వాటిని చూపించడని ఆరోపణలు ఉన్నాయి.

ఈ విషయం బిగ్ బాస్ తెలుగు 8 సీజన్‌లో చాలా క్లియర్‌గా తెలిసిపోతుందని నెట్టింట్లో నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మొదటి నుంచి కన్నడ నుంచి వచ్చిన కంటెస్టెంట్స్ ను సపోర్ట్ చేస్తూ వస్తోందని, వారికి వంతపాడుతూ వీకెండ్‌లో హోస్ట్ నాగార్జున రోస్టింగ్ ఉంటుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కన్నడ బ్యాచ్ (నిఖిల్, పృథ్వీ, ప్రేరణ, యష్మీ) ఏం చేసిన కరెక్ట్, ఇతరులు ఏం చేసిన తప్పు అన్నట్లుగా నాగార్జున మాటలు, ఎపిసోడ్‌లో టెలీకాస్ట్ అయ్యే సీన్స్ ఉంటున్నట్లు ఆరోపిస్తున్నారు.

ఎలిమినేట్ కావాల్సినవాడు

అయితే, వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చి రెండో వారమే ఎలిమినేట్ కావాల్సిన గౌతమ్ కృష్ణ కన్నడ కంటెస్టెంట్స్ తో పాటు బీబీ టీమ్‌కు పెద్ద షాక్ ఇచ్చాడు. ఊహించని స్థాయిలో ఫ్యాన్ బేస్ సంపాదించుకుని టైటిల్ విన్నర్ రేస్‌లో నిలిచాడు. బిగ్ బాస్ తెలుగు 8 విన్నర్ ట్రోఫీని ఎత్తే క్వాలిటీస్‌ గౌతమ్ లేదా నిఖిల్‌లో మాత్రమే ఉన్నాయంతగా పేరు తెచ్చుకున్నాడు.

ఇక గౌతమ్ ఎంత బెస్ట్ పర్ఫామెన్స్ ఇచ్చిన, తనకు ప్లస్ అయ్యే చాలా సన్నివేశాలను బీబీ టీమ్ ఎపిసోడ్‌లో ఎత్తేస్తోందని ఆయన అభిమానులు ఆవేదన తెలియజేస్తున్నారు. లైవ్‌లో వచ్చే చాలా వరకు గౌతమ్ కృష్ణ ఎలివేషన్ సీన్స్‌ రాత్రి ప్రసారం అయ్యే గంట ఎపిసోడ్‌లో మాయం అవుతున్నాయట. అయితే, ఇదివరకు ఎలిమినేట్ కంటెస్టెంట్స్‌తో నామినేషన్స్ నిర్వహించిన విషయం తెలిసిందే.

సోషల్ మీడియాలో

ఈ క్రమంలో వచ్చిన శేఖర్ బాషా గౌతమ్ ఆటను పొగుడుతూ అదిరిపోయే ఎలివేషన్ ఇచ్చారు. కానీ, ఆ సీన్‌ను ఎపిసోడ్‌లో లేపేసారన్నది అభిమానుల ఆరోపణ. అయితే, దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో మాత్రం వైరల్ అయింది. అలాగే, నిఖిల్ వర్సెస్ గౌతమ్ విషయంలో ఎన్నోసార్లు గౌతమ్‌దే తప్పు అన్నట్లుగా చిత్రీకరించే ప్రయత్నం చేశారని ఫ్యాన్స్ మండిపడుతున్నారు.

పానిపట్టు టాస్క్‌లో గౌతమ్ బూతు మాట అనకున్న అన్నట్లుగా వీకెండ్‌లో షోకి వచ్చే పెయిడ్ ఆడియెన్స్‌తో నాగార్జున చెప్పించేలా బీబీ టీమ్ చేసిందని ఆరోపిస్తున్నారు. అలాగే, రోలింగ్ డైస్ టాస్క్‌లో గౌతమ్‌ను సంచాలక్‌గా పెట్టి అతనికే ఛాలెంజ్ విసిరాడట బిగ్ బాస్. గౌతమ్ ఎక్కడైనా తప్పు చేసి దొరికిపోతే దాన్ని హైలెట్ చేద్దామని. కానీ, బిగ్ బాస్ ప్లాన్‌ను తిప్పికొడుతూ తెలివిగా డైస్‌పై పేర్లు రాసి ఎవరిపట్ల ఫేవరిజం చూపించకుండా న్యాయంగా సంచాలక్‌గా చేశాడని తమ ఫేవరేట్ కంటెస్టెంట్ గురించి గొప్పగా చెబుతున్నారు అభిమానులు.

మెచ్చుకున్న నిఖిల్

అయితే, అక్కడ కూడా డైస్‌పై గౌతమ్ పేర్లు రాసిన దాన్ని ఎత్తేసి, గౌతమ్ ఏదో తూ తూ మంత్రంగా సంచాలక్‌గా చేశాడు అన్నట్లుగా ఎపిసోడ్‌లో చూపించారన్నది ఫ్యాన్స్ ఆవేదన. ఇక బిగ్ బాస్ తెలుగు 8 డిసెంబర్ 5 ఎపిసోడ్‌లో ఫ్లాగ్ టాస్క్‌లో ఉడుం పట్టు పడుతూ మరి జెండాను అందుకున్నాడు. గౌతమ్ ఆట చూసి అతని బిగ్గెస్ట్ అపొనెంట్ అయిన నిఖిల్ సైతం మెచ్చుకున్నాడట.

గౌతమ్ ఆడుతుంటే నిఖిల్, ప్రేరణ మంచి ఎలివేషన్ ఇచ్చారని, ఆ సీన్‌ను ఎపిసోడ్‌లో బీబీ టీమ్ ఎత్తేసిందని అంటున్నారు రివ్యూవర్స్. ఇలా గౌతమ్‌ ఆడిన బెస్ట్ పర్ఫామెన్స్, అతనికి ప్లస్ అయ్యే చాలా వరకు సన్నివేశాలను ఎపిసోడ్‌లో ఎత్తేస్తున్నారని అభిమానులు ఆగ్రహిస్తున్నారు. ఇదంతా చూసిన నెటిజన్స్ గౌతమ్‌కు అసలైన శత్రువు బిగ్ బాస్ అని, అతన్ని టైటిల్ విన్నర్‌గా చేయకూడదని, నిఖిల్‌కే ఓటింగ్ ఎక్కువ వచ్చేలా ఎపిసోడ్స్ ప్లాన్ చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.

Whats_app_banner