Bigg Boss Telugu 8 Gangavva: అర్ధరాత్రి చంద్రముఖిలా మారి అందరినీ వణికించిన గంగవ్వ.. భయపెడుతున్న వీడియో వైరల్
Bigg Boss Telugu 8 Gangavva: బిగ్ బాస్ తెలుగు 8 హౌజ్ లోకి అర్ధరాత్రి ఓ చంద్రముఖి వచ్చింది. ఆ చంద్రముఖి మరెవరో కాదు గంగవ్వే. ఆమె చేసిన పని కంటెస్టెంట్లందరినీ వణికించింది. వాళ్లకు నిద్ర లేకుండా చేసింది. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
Bigg Boss Telugu 8 Gangavva: బిగ్ బాస్ తెలుగు 8లో గంగవ్వ చంద్రముఖిగా మారింది. అర్ధరాత్రి వేళ బయటకు వచ్చి వింత శబ్దాలు చేస్తూ హౌజ్ మేట్స్ అందరినీ నిద్ర లేపింది. తన దగ్గరికి వచ్చిన వాళ్లను కొట్టబోతూ వాళ్లను వణికించింది. బిగ్ బాస్ బుధవారం (అక్టోబర్ 23) ఎపిసోడ్ కు సంబంధించి రిలీజ్ చేసిన లేటెస్ట్ ప్రోమోలో చంద్రముఖిలా మారిన గంగవ్వను చూడొచ్చు.
చంద్రముఖిలా మారిన గంగవ్వ
బిగ్ బాస్ తెలుగు 8 హౌజ్ లో కంటెస్టెంట్లకు గంగవ్వ ఓ కొత్త ట్విస్టు ఇచ్చింది. అర్ధరాత్రి సమయంలో అందరూ గాఢ నిద్రలో ఉండగా.. ఆమె బయటకు వచ్చి దెయ్యంలా వింత వింత శబ్దాలు చేసింది. అది విని ఒక్కొక్కొరుగా హౌజ్ మేట్స్ అందరూ లేచి వెళ్లి చూశారు. అవ్వ ఏమైందంటూ తన దగ్గరికి వచ్చిన వాళ్లను ఆమెను కొట్టబోవడంతో వాళ్ల భయం మరింత పెరిగింది.
టేస్టీ తేజ, రోహిణిలాంటి వాళ్లు వణికిపోయారు. కాళ్లు వణికిపోతున్నాయి.. ఎలా పడుకోవాలో అంటూ హరితేజ అనడం వీడియోలో చూడొచ్చు. ఈ తాజా వీడియోను హాట్‌స్టార్ తన ఎక్స్ అకౌంట్లో షేర్ చేసింది. అయితే ఇదో ప్రాంక్ వీడియో కావడం విశేషం.
"అర్ధరాత్రి దెయ్యం అంటూ చేసిన ఓ చిలిపి పని. ఈ దెయ్యం దెబ్బకు బిగ్ బాస్ హౌజ్ కంటెస్టెంట్లు వణికిపోయారు. ఓ హారర్ షోని తలపించింది. ఎవరు ఎక్కువగా భయపడ్డారు?" అనే క్యాప్షన్ తో హాట్‌స్టార్ ఈ వీడియోను షేర్ చేసింది.
గంగవ్వ, అవినాష్, టేస్టీ తేజ ప్రాంక్
నిజానికి కంటెస్టెంట్లను భయపెట్టడానికి గంగవ్వ, అవినాష్, టేస్టీ తేజ కలిసి ఆడిన ఆట ఇది. గంగవ్వ దెయ్యంలా ప్రవర్తించడంతో మిగిలిన కంటెస్టెంట్లు భయపడిపోయినట్లు వీడియో మొదట్లో చూపించారు. ఆ తర్వాత ఇదొక ప్రాంక్ అని.. గంగవ్వతో కలిసి అవినాష్, టేస్టీ తేజ ఇలా దెయ్యం నాటకం ఆడినట్లు అసలు సీక్రెట్ రివీల్ చేశారు.
ఇంటి సభ్యుల మీద ముగ్గురం కలిసి ఓ ఘోస్ట్ ప్రాంక్ ప్లాన్ చేస్తున్నామని టేస్టీ తేజ బిగ్ బాస్ కు చెప్పడం.. ఆ తర్వాత ఇద్దరూ కలిసి ఎలాంటి శబ్దాలు చేయాలో గంగవ్వకు ట్రైనింగ్ ఇవ్వడం ఈ వీడియోలో చూడొచ్చు. బుధవారం (అక్టోబర్ 23) టెలికాస్ట్ కానున్న ఎపిసోడ్ లో ఈ దెయ్యం ప్రాంక్ మొత్తం కథేంటో తేలనుంది.
అయితే గంగవ్వ యాక్టింగ్ మాత్రం అదుర్స్ అని చెప్పాలి. ఆమెకు నిజంగానే దెయ్యం పట్టిందేమో అనుకొని కంటెస్టెంట్లదరూ హడలెత్తిపోయారు. వెంటనే రెస్పాండ్ కావాలంటూ వాళ్లు కెమెరా ముందుకు వచ్చి బిగ్ బాస్ ను వేడుకున్నారు. మరి ఈ ప్రాంక్ తర్వాత ఏం జరిగింది? కంటెస్టెంట్ల రియాక్షన్ ఏంటన్నది ఈరోజు రాబోయే బిగ్ బాస్ తెలుగు 8 ఎపిసోడ్ లో చూడాలి.