Bigg Boss Voting: తారుమారు అయిన బిగ్ బాస్ ఓటింగ్.. టాప్ 5 ఫైనలిస్ట్‌ల స్థానాల్లో మార్పులు.. రెండో రోజు ఊహించని ఫలితాలు
Bigg Boss Telugu 8 Final Week Voting Results: బిగ్ బాస్ తెలుగు 8 ఫైనల్ వీక్ ఓటింగ్‌లో రెండో రోజు ఫలితాలు ఊహించని విధంగా ఉన్నాయి. రెండో రోజు వచ్చేసరికి లెక్కలన్నీ తారుమారు అయిపోయాయి. బిగ్ బాస్ 8 తెలుగు విన్నర్ ఓటింగ్‌లో టాప్ 5 ఫైనలిస్ట్‌ల స్థానాల్లో మార్పులు చోటు చేసుకున్నాయి.
Bigg Boss Telugu 8 Winner Voting Results: బిగ్ బాస్ తెలుగు 8 సీజన్ ముగియడానికి ఇంకా కొన్ని రోజులు మాత్రమే ఉంది. డిసెంబర్ 15న గ్రాండ్‌గా ఫినాలే ఈవెంట్ నిర్వహించి బిగ్ బాస్ 8 తెలుగు సీజన్ విన్నర్‌ను ప్రకటించనున్నారు. ఇందుకోసం సోమవారం (డిసెంబర్ 9) నుంచే బిగ్ బాస్ ఫైనల్ వీక్ ఓటింగ్ ప్రారంభమైపోయింది.
టాప్ 5 ఫైనిలిస్ట్‌ల స్థానాల్లో మార్పులు
బిగ్ బాస్ తెలుగు 8 చివరి వారం ఓటింగ్‌లో ఊహించని ఫలితాలు చోటు చేసుకుంటున్నాయి. రోజు రోజుకీ లెక్కలన్నీ తారుమారు అయిపోతున్నాయి. దీంతో టాప్ 5 ఫైనలిస్ట్‌ల స్థానాల్లో మార్పులు జరుగుతున్నాయి. అయితే, ప్రస్తుతం బిగ్ బాస్ హౌజ్‌లో టాప్ 5 ఫైనలిస్ట్‌లుగా ఐదుగురు కంటెస్టెంట్స్ ఉన్న విషయం తెలిసిందే.
బిగ్ బాస్ తెలుగు 8 విన్నర్
టికెట్ టు ఫినాలే టాస్క్ గెలుపొంది మొదటి ఫైనలిస్ట్‌గా అవినాష్ బిగ్ బాస్ తెలుగు 8 ఫైనల్స్‌కి చేరుకోగా రెండో ఫైనలిస్ట్‌గా నిఖిల్, మూడో ఫైనలిస్ట్‌గా గౌతమ్, నాలుగు, ఐదు ఫైనలిస్ట్‌లుగా వరుసగా ప్రేరణ, నబీల్ నిలిచారు. వీరిలో బిగ్ బాస్ తెలుగు 8 సీజన్ విజేత ఎవరు అనే విషయం తేలడానికి ఓటింగ్ నిర్వహిస్తున్నారు.
గౌతమ్‌ను దాటేసిన నిఖిల్
ఈ ఓటింగ్‌లో మొదటి రోజు గౌతమ్ స్వల్ప ఓట్ల తేడాతో నిఖిల్ కంటే మొదటి స్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే. అయితే, రెండో రోజు ఓటింగ్ వచ్చేసరికి గౌతమ్‌ను దాటేసి నిఖిల్ ఫస్ట్ ప్లేస్‌కు వచ్చేశాడు. అయితే, వీరి ఓట్లల్లో తేడా ఉన్నప్పటికీ ఓటింగ్ శాతంలో మాత్రం ఎలాంటి తేడ లేకపోవడం గమనార్హం.
రెండో రోజు ఓట్లల్లో తేడా
నిఖిల్‌కు 33 శాతం ఓటింగ్‌తో 47,917 ఓట్లు పడగా.. గౌతమ్‌కు అదే 33 శాతం ఓటింగ్‌తో 47,671 ఓట్లు వచ్చాయి. అంటే, ఇద్దరి మధ్య 246 ఓట్ల తేడా మాత్రమే ఉంది. ఈ తేడాతోనే నిఖిల్ ఫస్ట్ ప్లేస్‌లో, గౌతమ్ రెండో స్థానంలో నిలిచాడు. అయితే, మొదటి రోజుకంటే రెండో రోజు వీరి ఓటింగ్ శాతం పెరిగింది. మొదటి రోజు 31 శాతం ఉన్న ఓటింగ్ రెండో రోజుకు 33 శానికి పెరిగిపోయింది.
తగ్గిన ఓటింగ్ శాతం
కానీ, మిగతా ఫైనిలిస్ట్‌ల ఓటింగ్ శాతం మాత్రం తగ్గిపోయింది. టాప్ 3లో కొనసాగిన నబీల్‌కు రెండో రోజు 26,910 ఓట్లు, 19 శాతం ఓటింగ్ నమోదు అయింది. ఇతనికి మొదటి రోజు 21 శాతం ఓటింగ్ ఉండేది. ఇక 10 శాతం ఓటింగ్, 15,238 ఓట్లతో ప్రేరణ టాప్ 4లో నిలిచింది. ఆమెకు మొదటి రోజు 11 శాతం ఓటింగ్ నమోదు అయింది. ఇక చివరి స్థానంలో అంటే టాప్ 5లో మొదటి ఫైనలిస్ట్ అవినాష్ ఉన్నాడు.
అవినాష్‌కు పెరిగిన ఓట్లు
అతనికి మాత్రం మొదటి రోజు 5 శాతం ఓటింగ్ రాగా.. రెండో రోజు కూడా అంతే 5 శాతం ఓటింగ్ కొనసాగింది. కానీ, మొదటి రోజుతో పోల్చితే రెండో రోజు ఓట్లు పెరిగాయి. జబర్దస్త్ అవినాష్‌కు రెండో రోజు బిగ్ బాస్ ఓటింగ్‌లో 7,409 ఓట్లు పడ్డాయి.ఇలా ఊహించని ఫలితాలతో బిగ్ బాస్ తెలుగు 8 ఫైనల్ వీక్ ఓటింగ్ ఉంది.
టాపిక్