Bigg Boss Telugu 8 Final Contestants: బిగ్ బాస్ తెలుగు 8లోకి మాజీ సభ్యులు.. ఫైనల్ కంటెస్టెంట్స్ వీళ్లే!
Bigg Boss 8 Telugu Final Contestants List: బిగ్ బాస్ తెలుగు 8 సీజన్ ప్రారంభానికి ఇంకా కొన్ని రోజులే ఉంది. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ 8 తెలుగులోకి వెళ్లే ఫైనల్ కంటెస్టెంట్స్ ఎవరో తెలిసిపోయింది. అలాగే ఈ సారి బిగ్ బాస్‌లోకి మాజీ కంటెస్టెంట్స్ కూడా ఎంట్రీ ఇవ్వనున్నట్లు సమాచారం.
Bigg Boss Telugu 8 Final Contestants List: బిగ్ బాస్ తెలుగు 8 సీజన్ ప్రారంభానికి ఇంకా నాలుగు రోజుల సమయం మాత్రమే ఉంది. కింగ్ నాగార్జున హోస్ట్‌గా చేయనున్న బిగ్ బాస్ 8 తెలుగు సెప్టెంబర్ 1న గ్రాండ్‌గా ప్రారంభం కానుంది. ఆరోజున సాయంత్రం 7 గంటలకు బిగ్ బాస్ లాంచ్ జరగనుంది.
ఫైనల్ కంటెస్టెంట్స్
ఇప్పటికే హౌజ్‌లోకి వెళ్లే కన్ఫర్మ్‌డ్ కంటెస్టెంట్స్ ఏవీ షూట్స్ అయిపోయాయి. అలేగా షో ప్రారంభానికి రెండు మూడు రోజుల ముందు డ్యాన్సర్స్, కంటెస్టెంట్స్ డ్యాన్స్ పర్ఫామెన్స్ ఉండనుంది. అయితే, ఇప్పటికీ బిగ్ బాస్ 8 తెలుగులో పాల్గొనే కంటెస్టెంట్స్ ఎవరా అనే ప్రశ్నలు చాలామందిలో మెదులుతున్నాయి. ఈ నేపథ్యంలో హౌజ్‌లోకి వెళ్లే ఫైనల్ కంటెస్టెంట్స్ వీరే అంటూ చాలా గట్టిగా వార్తలు వినిపిస్తున్నాయి.
పది మంది కన్ఫర్మ్
ఇదివరకు చెప్పుకున్నట్లే బిగ్ బాస్ తెలుగు 8 సీజన్‌లోకి హీరో ఆదిత్యం ఓం కంటెస్టెట్‌గా కన్ఫర్మ్ అయ్యాడు. అలాగే సీరియల్ హీరో నిఖిల్ మలియక్కల్, కృష్ణ ముకుంద మురారి సీరియల్‌లో విలన్‌గా చేసిన యష్మీ గౌడ, పలు చిత్రాల్లో హీరోగా చేసిన అభిరామ్ వర్మ, యూట్యూబర్ బెజవాడ బేబక్క, ఢీ డ్యాన్సర్ నైనిక అనసూరు, అభయ్ నవీన్, బేబీ మూవీ నటి కిర్రాక్ సీత్, హీరోయిన్ విస్మయ శ్రీ, యాంకర్ విష్ణుప్రియ కన్ఫర్మ్ అయ్యారు.
ఇద్దరు వైల్డ్ కార్డ్ ఎంట్రీ
ఈ పది మంది దాదాపు నూటికి నూరు శాతం బిగ్ బాస్ 8 తెలుగు హౌజ్‌లోకి వెళ్లే ఫైనల్ కంటెస్టెంట్స్ అని పక్కా సమాచారం. వీరితోపాటు వైల్డ్ కార్డ్ ఎంట్రీగా జబర్దస్త్ రితూ చౌదరి, చక్రవాకం, మొగలి రేకులు ఫేమ్ ఇంద్రనీల్ వర్మ ఎంట్రీ ఇవ్వనున్నారని తెలుస్తోంది. అయితే, వీరిని షో ప్రారంభం అయిన మొదటి వారం, లేదా రెండో వారం హౌజ్‌లోకి పంపించనున్నారట.
రాకింగ్ రాకేష్ కూడా
ఈ 12 మందితోపాటు కమెడియన్ అలీ సోదరుడు ఖయ్యూమ్ అలీ, నాగ మణికంట, ఆర్జే శేఖర్ బాషా, సహర్ కృష్ణన్ కూడా దాదాపుగా 99 శాతం కన్ఫర్మ్ అయినట్లు సమాచారం. కాగా న్యూస్ రీడర్ కల్యాణి కూడా ఎంట్రీ ఇస్తోందని వార్తలు వచ్చాయి. కానీ, ఆమె బిగ్ బాస్ 8 తెలుగులోకి వెళ్లడం డౌటే అని మరో న్యూస్ వైరల్ అవుతోంది. వీరితోపాటు జబర్దస్త్ కమెడియన్ రాకింగ్ రాకేష్ కూడా ఎంట్రీ ఇస్తాడని అంటున్నారు.
మొత్తం 17 మంది
ఈ 17 మందితోపాటు బిగ్ బాస్ తెలుగు 8లోకి గత సీజన్ల కంటెస్టెంట్స్ కూడా రానున్నారని సమాచారం. వారిలో బిగ్ బాస్ తెలుగు 5 సీజన్‌తో నెగెటివిటీ తెచ్చుకున్న సిరి హన్మంతును బీబీ టీమ్ కలిసిందట. కానీ బీబీ 8 తెలుగులోకి పాల్గొనేందుకు సిరి నిరాకరించినట్లు సమాచారం.
మాజీ కంటెస్టెంట్స్‌తో చర్చలు
అలాగే బిగ్ బాస్ తెలుగు సీజన్ 1 కంటెస్టెంట్స్ హరితేజ, ఆదర్శ్‌ను, బీబీ 3 హౌజ్‌మేట్స్ పునర్నవి, వరుణ్ సందేశ్ భార్య వితికను కూడా బిగ్ బాస్ నిర్వాహకులు బిగ్ బాస్ 8 తెలుగులో పాల్గొనేందుకు అడిగారట. కానీ, వారిలో ఏ ఒక్కరు కూడా ఇప్పటివరకు కన్ఫర్మ్ కాలేదు.