Bigg Boss Telugu 8: ఇవాళే బిగ్ బాస్ తెలుగు 8 హౌజ్‌లోకి 14 మంది కంటెస్టెంట్స్ ఎంట్రీ.. తొలి రోజు సభ్యులు ఎవరంటే?
Bigg Boss Telugu 8 Contestants Entry Today: బిగ్ బాస్ తెలుగు 8 సీజన్‌లోకి ఇవాళే సుమారు 14 మంది వరకు కంటెస్టెంట్స్ ఇవ్వనున్నారు. అంటే, బిగ్ బాస్ ప్రారంభం రోజున హౌజ్‌లోకి 14 మంది వెళ్లనున్నారు. ఆ తర్వాత మరికొంతమంది, అనంతరం కొన్ని వారాలకు వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఉండనున్నాయి.
Bigg Boss 8 Telugu Contestants Entry: బిగ్ బాస్ తెలుగు 8 సీజన్ ఫీవర్ స్టార్ట్ అయిపోయింది. సెప్టెంబర్ 1న బిగ్ బాస్ తెలుగు 8 సీజన్ గ్రాండ్‌గా ప్రారంభం కానుంది. ఆదివారం నాడు సాయంత్ర 7 గంటల నుంచి తెలుగు ప్రేక్షకులను అలరించనుంది బిగ్ బాస్ 8 తెలుగు షో.
ఈ బిగ్ బాస్ తెలుగు 8 సీజన్ టీవీ ఛానెల్ స్టార్ మా, ఓటీటీ ప్లాట్‌ఫామ్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ప్రసారం కానుంది. అయితే, బిగ్ బాస్ ప్రారంభం రోజున హౌజ్‌లోకి సుమారుగా 14 మంది కంటెస్టెంట్స్ అడుగుపెట్టనున్నారని తాజా సమాచారం. మొదటి రోజున 14 మందిని ప్రవేశపెట్టి.. రెండో రోజున మిగతా వారిని పంపించనున్నారు. అలాగే వైల్డ్ కార్డ్‌తో ఎంట్రీ ఇచ్చే కంటెస్టెంట్లను నాలుగు లేదా ఐదో వారంలో పంపిస్తారు.
ఒక్కరోజు ముందు షూటింగ్
అయితే, ఈ షోను అధికారికంగా మనకు సెప్టెంబర్ 1న ప్రసారం చేస్తారు. కానీ, దానికి సంబంధించిన షూటింగ్ మాత్రం ఒకరోజు ముందు జరుగుతుంది. అంటే, బిగ్ బాస్ 8 తెలుగు కంటెస్టెంట్స్ ఎంట్రీని ఇవాళే (ఆగస్ట్ 31) షూట్ చేస్తారు. మొన్నటి నుంచి డ్యాన్స్ పర్ఫామెన్సెస్ జరుగుతున్నాయి. ఇక శనివారం నాడు బిగ్ బాస్ హౌజ్‌లోకి కంటెస్టెంట్స్ అడుగుపెట్టనున్నారు.
ప్రోగ్రామ్ ఆదివారం ప్రారంభమైన షూటింగ్ మాత్రం ఇవాళ జరగడంతో హౌజ్‌మెట్స్ ఎంట్రీ ఇవాళే ఉండనుందన్నమాట. ఇకపోతే ఇవాళ బిగ్ బాస్ హౌజ్‌లోకి వెళ్లే కంటెస్టెంట్స్‌లో ఆదిత్య ఓం, అభయ్ నవీన్, యాంకర్ విష్ణుప్రియ, యష్మీ గౌడ, ప్రేరణ కంబం, నిఖిల్ మలియక్కల్, ఆర్జే శేఖర్ బాషా, నైనిక అనరుసు, బెజవాడ బేబక్క, నాగ మణికంఠ, కిర్రాక్ సీత, పరమేశ్వర్ హివ్రాలే, సోనియా ఆకుల ఉన్నారు.
వైల్డ్ కార్డ్‌తో ఎక్స్ కంటెస్టెంట్స్
ఈ 13 మందితోపాటు జబర్దస్త్ రాకింగ్ రాకేష్, న్యూస్ రీడర్ కల్యాణ్, మోడల్ రవితేజ, దొరసాని సీరియల్ యాక్టర్ పృథ్వీరాజ్‌లో ఒకరు బిగ్ బాస్ హౌజ్‌లోకి తొలిరోజు అడుగుపెట్టనున్నారు. మిగతా వాళ్లలో ఒకలిద్దరిని రేపు (సెప్టెంబర్ 1)న పంపిస్తారట. అంటే, వీరి హౌజ్ ఎంట్రీ సెప్టెంబర్ 2న ప్రసారం అవుతుంది. ఇక మిగతా కంటెస్టెంట్స్‌ను వైల్డ్ కార్డ్ ద్వారా హౌజ్‌లోకి పంపిస్తారు.
అది కూడా నాలుగు లేదా ఐదో వారంలో వైల్డ్ కార్డ్ ఎంట్రీ కంటెస్టెంట్స్ ఉండొచ్చని టాక్. వైల్డ్ కార్డ్ ఎంట్రీలుగా గత సీజన్స్ ఎక్స్ కంటెస్టెంట్స్ ఉంటారని సమాచారం. వారిని ఛాలెంజర్స్ లాగా పంపిస్తారని సమాచారం. ఇదిలా ఉంటే, ఇప్పటివరకు ఫైనల్ కంటెస్టెంట్స్ గురించి వార్తలు వస్తూనే ఉన్నాయి. కానీ, ఇప్పుడు ఈ ఫైనల్ జాబితాలో పరమేశ్వర్ హివ్రాలే, సోనియా ఆకుల, మోడల్ రవితేజ, సీరియల్ యాక్టర్ పృథ్వీరాజ్ కొత్త ఆఫర్ అందుకున్న కంటెస్టెంట్స్.
ఇంట్రెస్టింగ్ విషయాలు
కాగా కింగ్ నాగార్జున హోస్ట్‌గా చేయనున్న బిగ్ బాస్ తెలుగు 8 సీజన్ ఆదివారం లాంఛనంగా ప్రారంభం కానుంది. ఈ గ్రాండ్ లాంచ్‌లో హీరోయిన్స్ డ్యాన్స్ పర్మామెన్స్, సెలబ్రిటీల ఎంట్రీ, వారి పర్సనల్, కెరీర్ విషయాలు ఇంట్రెస్టింగ్‌గా ఉండనున్నాయి.