Bigg Boss Telugu 8: బిగ్ బాస్ తెలుగు 8 కాన్సెప్ట్ ఇదే.. ఆ షో నుంచి కాపీ.. హౌజ్ ఎలా ఉండనుందంటే?
Bigg Boss 8 Telugu Updates: బిగ్ బాస్ తెలుగు 8వ సీజన్ సెప్టెంబర్ 1న చాలా గ్రాండ్‌గా ప్రారంభం కానుందని తెలిసిందే. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ 8 తెలుగు కాన్సెప్ట్, థీమ్ ఇదే అని పలువురు రివ్యూవర్లు చెబుతున్నారు. అలాగే బిగ్ బాస్ తెలుగు 8ను పాపులర్ అయిన మరో సీజన్ నుంచి కాపీ కొట్టారని అంటున్నారు.
Bigg Boss Telugu 8 Latest News: సెప్టెంబర్ 1న సాయంత్రం ఏడు గంటలకు బిగ్ బాస్ తెలుగు 8 సీజన్ ప్రారంభం కావడానికి రెడీగా ఉంది. ఇందుకోసం కంటెస్టెంట్స్ సెలక్షన్, వారి ఏవీ షూటింగ్స్, డ్యాన్స్ పర్ఫార్మర్స్ అంతా సిద్ధం అయిపోయారు. హౌజ్‌లోకి వెళ్లే ఫైనల్ కంటెస్టెంట్స్ ఏవీ షూట్స్ ఈపాటికే అందరివీ అయిపోయాయని సమాచారం.
17 మంది కంటెస్టెంట్స్
ఎప్పటికప్పుడు ప్రతి సీజన్‌కు అంచనాలు పెరిగిపోతూనే ఉంటాయి. అలా ఈ 8వ సీజన్‌పై కూడా ఎక్స్‌పెక్టేషన్స్ భారీగానే ఉన్నాయి. ఈ బిగ్ బాస్ 8 తెలుగుకు హోస్ట్‌గా మరోసారి కింగ్ నాగార్జుననే రానున్నారు. ఇక బిగ్ బాస్ తెలుగు 8 సీజన్‌కు దాదాపుగా 17 మంది కంటెస్టెంట్స్ వెళ్లనున్నట్లు తెలుస్తోంది. వారిలో పది మంది సెలబ్రిటీలు వంద శాతం వెళ్లనున్నట్లు కన్ఫర్మ్ అయింది.
ఆదిత్య ఓం, యష్మీ గౌడ, అభిరామ్ వర్మ, బెజవాడ బేబక్క, నిఖిల్ మలియక్కల్, నైనిక అనసురు, పెళ్లి చూపులు ఫేమ్ అభయ్ నవీన్, విష్ణుప్రియ, విస్మయ శ్రీ, కిర్రాక్ సీత ఈ పది మొదటిరోజే హౌజ్‌లోకి వెళ్లనున్నారు. ఆ తర్వాత వైల్డ్ కార్డ్ తర్వాత మొదటి రెండు వారాల్లో ఇంద్రనీల్ వర్మ, రీతూ చౌదరి హౌజ్‌లోకి అడుగుపెట్టే అవకాశం ఉంది.
వీరితోపాటు ఆర్జే శేఖర్ బాషా, నాగ మణికంఠ, సహర్ కృష్ణన్, ఖయ్యూమ్ అలీ కూడా కంటెస్టెంట్స్‌గా ఎంట్రీ ఇవ్వనున్నారని సమాచారం. ఇదిలా ఉంటే, ఈ బిగ్ బాస్ తెలుగు 8 సీజన్‌ను కాన్సెప్ట్ ఇది అంటూ ఒక న్యూస్ లీక్ అయింది. బిగ్ బాస్ హిందీ 8వ సీజన్ కాన్సెప్ట్‌నే తెలుగు బిగ్ బాస్ 8 సీజన్‌లో ఇంప్లిమెంట్ చేయనున్నట్లు టాక్ నడుస్తోంది.
ఆ సీజన్ లాగా ట్విస్ట్
హిందీ బిగ్ బాస్ 8లో గత సీజన్‌లోని కంటెస్టెంట్స్‌ను తీసుకొచ్చి పార్టిస్‌పేట్ చేయించారట. పాత సీజన్‌లో నెగెటివ్‌గా గానీ, పాజిటివ్‌గా కానీ భారీ రెస్పాన్స్ తెచ్చుకున్న మాజీ హౌజ్‌మేట్స్‌ను సీజన్ 8లోకి తీసుకొచ్చి ఆడించారట. చివరిలో తీసుకొచ్చి, పెద్ద ట్విస్ట్ ఇచ్చి సర్‌ప్రైజ్ చేశారని సమాచారం. అదే తరహాలో బిగ్ బాస్ తెలుగు 8లో కూడా చేయనున్నట్లు చాలా గట్టి సమాచారం.
అందుకే మాజీ కంటెస్టెంట్స్‌తో తెలుగు బీబీ టీమ్ చర్చలు జరుపుతోందని టాక్. వారిలో కొంతమంది కన్ఫర్మ్ చేస్తున్నారు, మరికొంతమంది చూద్దాంలే అన్నట్లుగా రెస్పాండ్ అవుతున్నారట. ఏది ఏమైనా తెలుగు 8లోకి మాత్రం మాజీ కంటెస్టెంట్స్ వచ్చే అవకాశం చాలా గట్టిగా ఉందని తెలుస్తోంది. మరి హిందీలో వర్కౌట్ అయిన ఆ కాన్సెప్ట్ తెలుగులో ఎంతవరకు హిట్ అవుతోందో చూడాలి.
అయితే, బిగ్ బాస్ 8 తెలుగులోకి వచ్చే మాజీ కంటెస్టెంట్స్‌పై ఇంకా క్లారిటీ రాలేదు. ఇక బిగ్ బాస్ తెలుగు 8 సీజన్ హౌజ్ దాదాపుగా సీజన్ 7 తరహాలో ఉంటుందని టాక్. సీజన్ 7లో ఎలాగైతే మూడు బెడ్ రూమ్స్ ఉన్నాయో అలాగే ఉండనుందట. ఎందుకంటే అలా ముగ్గురు ముగ్గురు బ్యాచ్‌లుగా విడిపోయి స్పై, స్పా అనే టీమ్స్ ఏర్పడి సీజన్ 7 బాగా హిట్ అయిందని, అందుకే సీజన్ 8లో కూడా అలాగే ఉంచనున్నారట.
డిఫరెంట్‌గా ఎక్స్‌ట్రా రూమ్
ఎప్పుడు ఉండే సీక్రెట్ రూమ్ కాకుండా ఏ సీజన్‌లో లేనట్లుగా స్పెషల్‌గా వేరే డిఫరెంట్ రూమ్ ఒకటి ఉండేందుకు అవకాశం ఉందట. దాన్ని యాక్టివిటీ రూమ్‌లా కాకుండా ఇంకా వేరేలా వాడనున్నారట. ఎలా వాడతారన్నది క్లారిటీ లేదు గానీ, కొత్తగా, డిఫరెంట్‌గా ఓ ఎక్స్‌ట్రా రూమ్‌ను ఉంచనున్నారని సమాచారం. జైలు, కిచెన్ స్థానాల్లో మార్పులు జరిగే అవకాశం ఉందని సమాచారం.