Bigg Boss Aditya Om: గిరిజనుల నీటి సమస్యను తీర్చిన బిగ్ బాస్ కంటెస్టెంట్, హీరో ఆదిత్య ఓం.. ఎక్కడంటే?
Bigg Boss Aditya Om Solved Water Problem: బిగ్ బాస్ తెలుగు 8 సీజన్‌లో కంటెస్టెంట్‌గా పాల్గొన్న హీరో ఆదిత్యం ఓం గిరిజనుల నీటి సమస్యను పరిష్కరించేందుకు ముందుకు వచ్చాడు. తెలంగాణలోని ఓ గ్రామంలో స్వచ్ఛమైన మంచి నీటిని అందిస్తానని ఆదిత్య ఓం ప్రతిజ్ఞ చేశాడు. పూర్తి వివరాల్లోకి వెళితే..
Bigg Boss Aditya Om Solved Water Problem: బిగ్ బాస్ తెలుగు 8లో కంటెస్టెంట్‌గా పాల్గొని అలరించిన ఆదిత్యం ఓం లాహిరి లాహిరి లాహిరిలో సినిమాతో టాలీవుడ్‌లోకి హీరోగా ఎంట్రీ ఇచ్చి మంచి పేరు తెచ్చుకున్నాడు. ఆ సినిమా తర్వాత ప్రేమించుకున్నాం మా పెళ్లికి రండి, ధనలక్ష్మీ ఐ లవ్యూ, మీ ఇంటికొస్తే ఏమిస్తారు మా ఇంటికి వస్తే ఏం తెస్తారు వంటి సినిమాలతో అలరించాడు.
సేవా కార్యక్రమాలతో
అనంతరం చాలా కాలం గ్యాప్ తర్వాత బందూక్, ఫ్రెండ్ రిక్వెస్ట్, నాతో నేను వంటి సినిమాలు చేశాడు. అయితే, నటనతోనే కాకుండా సేవా కార్యక్రమాలతో కూడా అందరినీ ఆకట్టుకుంటున్నాడు హీరో ఆదిత్య ఓం. తెలంగాణలోని గిరిజన గ్రామమైన చెరుపల్లిలో నీటి సమస్యను పరిష్కరించేందుకు ఆదిత్య ఓం ముందుకు వచ్చారు.
ఆర్వో వాటర్ ప్లాంట్ నిర్మాణం
ఈ మేరకు ఆ ప్రజలందరికీ స్వచ్ఛమైన నీటిని అందిస్తానని ప్రతిజ్ఞ చేశాడు ఆదిత్య ఓం. కలుషితమైన నీటి ద్వారా సంక్రమించే వ్యాధులతో అక్కడి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయాన్ని తెలుసుకున్న ఆదిత్య ఓం చెరుపల్లితోపాటు ఇరుగు పొరుగు గ్రామాల అవసరాలను తీర్చేందుకు ఆర్వో వాటర్ ప్లాంట్ (RO Water Plant) నిర్మాణాన్ని ప్రారంభించారు.
తొలిగిపోనున్న ప్రజల నీటి సమస్య
RO ప్లాంట్ నుంచి వచ్చే స్వచ్ఛమైన, సురక్షితమైన మంచినీటితో అక్కడి ప్రజల సమస్యలు తొలిగిపోనున్నాయి. ఇక నీటి సంబంధిత ఆరోగ్య సమస్యలు కూడా దూరం కానున్నాయి. ఈ ప్రాజెక్టును త్వరగా పూర్తి చేసి సంక్రాంతి పండుగ సందర్భంగా ఊరి ప్రజలకు అందించాలని ఆదిత్యం ఓం అనుకుంటున్నారు. ప్రాజెక్టు త్వరగా పూర్తి చేయాలని ఆదిత్య ఓం త్వరితగతిన పనులు చేపడుతున్నారు.
మిడ్ వీక్‌లో ఎలిమినేట్
ఈ మేరకు గ్రామస్తులు ఆదిత్య ఓంకి కృతజ్ఞతలు తెలియజేశారు. అయితే, వాటర్ ప్లాంట్ నిర్మాణాన్ని ప్రారంభించిన ఆదిత్య ఓం ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది తెలిసి ఆదిత్య ఓం నిజమైన హీరో అని నెటిజన్స్ ప్రశంసిస్తున్నారు. ఇదిలా ఉంటే, ఇటీవలే బిగ్ బాస్ తెలుగు 8 సీజన్‌లో పాల్గొన్న ఆదిత్య ఓం ఐదో వారం మిడ్ వీక్‌లో భాగంగా ఎలిమినేట్ అయ్యాడు. అయితే, హౌజ్‌లో మాత్రం తన ప్రవర్తనతో మంచి పేరు తెచ్చుకున్నాడు.
వారానికి 3 లక్షల రెమ్యునరేషన్
సెప్టెంబర్ 1న ప్రారంభమైన బిగ్ బాస్ 8 తెలుగు సీజన్‌లోకి ఐదో కంటెస్టెంట్‌గా అడుగుపెట్టిన ఆదిత్య ఓం హౌజ్‌లో 33 రోజులపాటు ఉన్నారు. బిగ్ బాస్‌లో పాల్గొన్నందుకు ఆదిత్య ఓం వారానికి సుమారుగా రూ. 3 లక్షల రెమ్యునరేషన్ తీసుకున్నట్లు సమాచారం. దాంతో బిగ్ బాస్ తెలుగు 8 ద్వారా 33 రోజుల్లో ఆదిత్య ఓం రూ. 14 లక్షల వరకు పారితోషికం అందుకున్నట్లు తెలుస్తోంది.
పర్యావరణ సంరక్షణ ప్రాముఖ్యత
ఇక ఆదిత్య ఓం హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘బంధీ’. ప్రయోగాత్మక చిత్రంగా బంధీని తెరకెక్కించారు. పర్యావరణ సంరక్షణ ప్రాముఖ్యతను తెలియజేసేలా బంధీ చిత్రాన్ని రూపొందించారు.
టాపిక్