Bigg Boss Voting: ఓటింగ్‌లో అట్టడుగుకు స్థాయికి పడిపోయిన విష్ణుప్రియ- వేడుకున్న మారని స్థానం- ఇవాళ ఎలిమినేషన్‌లో ఇద్దరు!
Bigg Boss Telugu 8 Fourteenth Week Nominations Voting Results: బిగ్ బాస్ తెలుగు 8 పద్నాలుగో వారం మరొకరు ఎలిమినేట్ కానున్నారు. ఇవాళ బిగ్ బాస్ 8 తెలుగు నుంచి మరొకరు ఎలిమినేట్ అయి హౌజ్‌ను వీడనున్నారు. బిగ్ బాస్ ఓటింగ్‌లో ఈ వారం అతి తక్కువ ఓట్లతో అట్టడుగు స్థానంలోకి పడిపోయింది విష్ణుప్రియ.
Bigg Boss Telugu 8 Voting Results: బిగ్ బాస్ తెలుగు 8 సీజన్ మరికొన్ని రోజుల్లో పూర్తి కానుంది. డిసెంబర్ 15న బిగ్ బాస్ 8 తెలుగు గ్రాండ్ ఫినాలే నిర్వహించి విజేతను ప్రకటించనున్నారు. అందుకు ఇంకొక వారమే మిగిలి ఉంది. ఇక బిగ్ బాస్ తెలుగు 8 నుంచి ఈ వారం మరొకరు ఎలిమినేట్ కానున్నారు.
అట్టడుగు స్థానంలోకి
బిగ్ బాస్ 8 తెలుగు ఈ వారం ఎలిమినేషన్ ఎపిసోడ్ ఇవాళే (డిసెంబర్ 7) షూట్ చేయనున్నారు. బిగ్ బాస్ తెలుగు 8 పద్నాలుగో వారం ఎలిమినేషన్ ఎపిసోడ్‌ను రేపు (డిసెంబర్ 8) ప్రసారం చేయనున్నారు. అయితే, బిగ్ బాస్ తెలుగు 8 ఈ వారం ఓటింగ్‌లో యాంకర్ విష్ణుప్రియ అట్టడుగు స్థానంలోకి పడిపోయింది. మొన్నటి ఎపిసోడ్‌లో (డిసెంబర్ 5) ఓటింగ్ అప్పీల్ అవకాశం పొంది ఓట్లను అభ్యర్థించిన కూడా ఆమె స్థానం పెద్దగా మారలేదు.
టాప్ 2లో ఆ ఇద్దరే
బిగ్ బాస్ తెలుగు 8 ఈ వారం నామినేషన్స్‌లో టికెట్ టు ఫినాలే సాధించి మొదటి ఫైనలిస్ట్ అయిన అవినాష్ తప్పా మిగతా అంతా నామినేట్ అయ్యారు. దాంతో బిగ్ బాస్ 8 తెలుగు 14వ వారం నామినేషన్స్‌లో విష్ణుప్రియ, నిఖిల్, గౌతమ్, రోహిణి, నబీల్, ప్రేరణ ఆరుగురు ఉన్నారు. వీరికి ప్రారంభమైన ఓటింగ్ పోల్‌లో టాప్ 2 స్థానాల్లో నిఖిల్, గౌతమ్ నిలుస్తూ వస్తున్నారు. అతి తక్కువ ఓటింగ్‌తో వీరి ప్లేస్‌లు కాస్తా అటు ఇటు అవుతున్నాయి.
డేంజర్ జోన్‌లో ఈ ఇద్దరు
ఇక మూడో స్థానంలో ప్రేరణ దూసుకుపోతోంది. అలాగే, బిగ్ బాస్ ఓటింగ్‌లో టాప్ 4వ స్థానంలో నబీల్ ఉంటున్నాడు. అయితే, వీరి స్థానాలు కూడా మారుతూ వచ్చాయి. నాలుగులో నబీల్ ఉంటే, ఐదో స్థానంలో ప్రేరణ కూడా కొన్నిసార్లు ఉంది. ఇక ఐదో స్థానంలో రోహిణి, ఆరో స్థానంలో విష్ణుప్రియ ఉన్నారు. అంటే, ఈ వారం ఎలిమినేషన్‌కు వీరిద్దరు డేంజర్ జోన్‌లో ఉన్నారు.
ఫస్ట్ లేడి విన్నర్ కావాలని
బిగ్ బాస్ తెలుగు 8 14వ వారం ఎలిమినేషన్‌లో విష్ణుప్రియ, రోహిణికి డేంజర్ బెల్స్ మోగనున్నాయి. మొదటి నుంచి విష్ణుప్రియ ఐదు లేదా ఆరో స్థానంలోనే ఉంటూ వస్తోంది. డిసెంబర్ 5 ఎపిసోడ్‌లో ఓట్ అప్పీల్ టాస్క్‌లు ఆడి గెలిచి అవకాశం అందుకుని ప్రేక్షకులను ఓట్లు వేయమని అభ్యర్థించింది విష్ణుప్రియ. ఈ సీజన్‌లో గెలిచి మొదటి లేడి విన్నర్ కావాలని, అది తననే చేయాలని వేడుకుంది.
మారని ఓటింగ్ స్థానం
కానీ, విష్ణుప్రియ ఓట్ అప్పీల్ చేసుకుని అభ్యర్థించిన ఈ వారం బిగ్ బాస్ ఓటింగ్‌లో ఆమె స్థానం ఏమాత్రం మారలేదు. వీకెండ్ వచ్చేసరికి డేంజర్ జోన్‌లో టాప్ 2 బాటమ్‌లో రోహిణి, విష్ణుప్రియ మాత్రమే ఉన్నారు. కాబట్టి, ఇవాళ జరిగే బిగ్ బాస్ తెలుగు 8 ఫైనల్ వీక్ ఎలిమినేషన్‌లో విష్ణుప్రియ లేదా రోహిణిలో ఒకరు ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది.
టాపిక్