Bigg Boss 7 Telugu - Shobha Shetty: బిగ్‍బాస్ తెలుగు 7వ సీజన్ 14వ వారం వీకెండ్‍కు వచ్చేసింది. నేటి (డిసెంబర్ 9) శనివారం ఎపిసోడ్‍లో కంటెస్టెంట్లతో హోస్ట్ నాగార్జున మాట్లాడనున్నారు. ముఖ్యంగా ఈ వారం టాస్కుల్లో కంటెస్టెంట్లు చేసిన తప్పులను వీడియోలతో సహా బయటపెట్టనున్నారు. ఇందుకు సంబంధించిన ప్రోమో బయటికి వచ్చింది. ముఖ్యంగా శోభా శెట్టి, ప్రిన్స్ యావర్‌పై నాగార్జున ఆగ్రహం వ్యక్తం చేశారు. వివరాలివే..
ఈ ఎపిసోడ్‍కు గొడ్డలి లాంటి దాన్ని హోస్ట్ నాగార్జున తీసుకొని వచ్చారు. ముందుగా శోభా శెట్టి ముఖం ప్రింట్ ఉన్న టైల్‍ను నాగ్ పగులగొట్టారు. శనివారం అన్నీ బయటపెట్టకపోతే తన పేరు శోభా శెట్టి కాదు అంటూ ఆమె సవాల్ చేసిన వీడియోను నాగ్ ప్లే చేసి చూపించారు. అన్నీ చెప్పేయ్ అని శోభతో నాగార్జున అన్నారు. శివాజీ ప్రతీసారి ఫేవరిజం అని అనడం తనకు నచ్చడం లేదని, తనకు ఆ విషయం క్లారిటీ ఇవ్వాలని అడగాలని అనుకున్నానని శోభా శెట్టి అన్నారు.
బాల్ టాస్కులో సంచాలక్‍గా ఉండి ప్రియాంక జైన్‍కు సపోర్ట్ చేసిన శోభా శెట్టిపై నాగార్జున ఫైర్ అయ్యారు. సంచాలక్‍గా ఉండి నువ్వు ఏం చేశావని నాగ్ ప్రశ్నిస్తే.. ప్రియాంకను సపోర్ట్ చేశానని శోభ ఆన్సర్ ఇచ్చారు. సంచాలక్ అంటే రిఫరీ అని, నిష్పక్షపాతంగా ఉండాలని నాగార్జున స్పష్టం చేశారు. అయితే, ఫన్ టాస్క్ అని బిగ్‍బాస్ చెప్పడంతో అలా చేశానని శోభ బదులిచ్చారు.
“నువ్వు సీరియస్‍గా ప్రియాంకకు సపోర్ట్ చేశావ్. నీకు ప్రియాంక అంటే ఇష్టం” అని నాగ్ అన్నారు. దీంతో తనకు ప్రియాంక అంటే ఇష్టమని, అందుకే సపోర్ట్ చేశానని ఆమె అన్నారు. దీంతో ఓపెన్‍గా సపోర్ట్ చేస్తే అంటారు కదా అని నాగ్ చెప్పారు. ఈ వారం అంతా తన మైండ్ డిస్ట్రబ్‍గా ఉందని శోభ అన్నారు. దీంతో.. “నీ మైండ్ డిస్ట్రబింగ్‍గా ఉండి.. ఆటను డిస్ట్రబ్ చేస్తున్నావ్.. ఆటను చెడగొడుతున్నావ్. అందరినీ రెచ్చగొడుతున్నావ్” అని నాగార్జున నిలదీశారు.
నాగార్జున ప్రశ్నల వర్షం కురిపించడంతో శోభా శెట్టి కన్నీరు పెట్టుకున్నారు. “బాల్ టాస్కులో నువ్వు యావర్‌తో చేసింది ఏంటో చెప్పు. మొదటి పెట్టింది నువ్వు. యావర్ దగ్గరికి వెళ్లింది నువ్వు. ఆ తర్వాత యావరే నన్ను గట్టిగా కొట్టాడని చెప్పింది నువ్వు” అని శోభకు క్లాస్ పీకారు నాగ్. దీంతో యావర్ తనను గట్టిగా కొట్టాడని తాను చెప్పలేదని, ఆ వీడియో చూడాలని నాగార్జునతో శోభ అన్నారు. దీంతో.. ఆ వీడియోను నాగ్ ప్లే చేసి చూపించారు. యావర్ గట్టిగా కొట్టాడని ఆ వీడియోలో శోభ అన్నట్టు తేలింది. దీంతో సమాధానం చెప్పలేక నిట్టూర్చారు శోభా శెట్టి.
ఆ తర్వాత ప్రిన్స్ యావర్ టైల్‍ను నాగార్జున పగులగొట్టారు. శోభా శెట్టిని యావర్ ఛీ అనడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నాగార్జున కూడా యావర్‌ను ఛీ.. తూ అని అన్నారు. ఇలా అంటుంటే ఎలా ఉందని యావర్‌ను అడిగారు. అయితే, తాను శోభతో మాత్రమే అనలేదని, అప్పటి పరిస్థితి అలాంటిదని యావర్ చెప్పారు. దీంతో అప్పటి వీడియోను నాగ్ ప్లే చేశారు.
శోభతోనే ఛీ అని యావర్ చాలామార్లు అన్నట్టు ఆ వీడియోలో ఉంది. ఇది చెత్త ప్రవర్తన అని నాగార్జున అన్నారు. ఇదే యావర్ అసలైన క్యారెక్టర్ అని, ఇప్పుడు బయటికి వచ్చిందని తమకు అనిపిస్తోందని నాగార్జున అన్నారు. ఏం చెప్పాలో తెలియడం లేదని యావర్ అంటే.. నువ్వు తప్పు అని నాగార్జున తేల్చేశారు. దీంతో యావర్ తల దించుకున్నారు. ఇతర కంటెస్టెంట్ల తప్పులను కూడా నేటి ఎపిసోడ్‍లో నాగార్జున నిలదీయనున్నారు. ఈ మొత్తం తతంగం నేటి ఎపిసోడ్‍లో ప్రసారం కానుంది. ప్రోమో ఇక్కడ చూడండి.
మరోవైపు, ఈ వారం బిగ్‍బాస్ హౌస్ నుంచి శోభా శెట్టి ఎలిమినేట్ కానున్నారని లీకులు బయటికి వచ్చాయి.
టాపిక్