Bigg Boss Telugu 7: ఓటింగ్‍లో షాకింగ్ ట్విస్ట్.. టాప్‍లో హీరో.. ఆమె ఎలిమినేషన్.. మారిన లెక్కలు
Bigg Boss 7 Telugu Voting: బిగ్ బాస్ తెలుగు 7 సీజన్ మూడో వారానికి చేరుకుంది. ప్రస్తుతం హౌజ్‍లో 12 మంది కంటెస్టెంట్స్ మాత్రమే ఉన్నారు. వారిలో సోమవారం నుంచి పోల్ అవుతున్న ఓటింగ్‍లో అనేక రకాల ట్విస్టులు కనిపించాయి.
పాపులర్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు 7 సీజన్‍లోకి మొత్తంగా 14 మంది కంటెస్టెంట్స్ అడుగుపెట్టారు. వారిలో మొదటి వారం సీనియర్ హీరోయిన్ కిరణ్ రాథోడ్, రెండోవారం షకీలా ఇద్దరూ ఎలిమినేట్ అయి వెళ్లిపోయారు. నామినేషన్స్ లో ఉన్న వీళ్లకు ప్రేక్షకులు తక్కువ ఓట్ చేయడంతో హౌజ్‍ను వీడిపోవాల్సి వచ్చింది. ప్రస్తుతం బిగ్ బాస్ 7 తెలుగులో 12 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. వారిలో మొదటి ఇంటి సభ్యుడిగా ఆట సందీప్, రెండో ఇంటి సభ్యుడిగా హీరో శివాజీ అర్హత సాధించుకున్న విషయం తెలిసిందే.
ట్రెండింగ్ వార్తలు
నామినేషన్లలో ఏడుగురు
బిగ్ బాస్ 7 తెలుగు 3వ వారం నామినేషన్స్ సోమవారం (సెప్టెంబర్ 18) జరిగాయి. బోళ్లు కడగలేదు, ఇళ్లు ఊడవలేదనే అతి సిల్లీ కారణాలతో నామినేషన్స్ జరిగాయి. మూడో వారం నామినేషన్లలో గౌతమ్ కృష్ణ, ప్రిన్స్ యావర్, శుభ శ్రీ రాయగురు, రతిక రోజ్, సింగర్ దామిని, అమర్ దీప్ చౌదరి, ప్రియాంక జైన్ మొత్తం ఏడుగురు ఉన్నారు. వీరికి సోమవారం నుంచే ఓటింగ్ పోల్ పెట్టారు. వాటిలో అత్యధిక ఓట్లతో జానకి కలగనలేదు సీరియల్ హీరో అమర్ దీప్ చౌదరికి టాప్‍లో ఉన్నాడు.
ప్రిన్స్ యావర్‍కు రెండో స్థానం
అమర్ దీప్‍కు ఎక్కువగా 19.82 శాతం, ప్రిన్స్ యావర్‍కు 18.99 శాతం, ప్రియాంక జైన్ 18.34 శాతం, రతిక రోజ్ 16.5 శాతం, గౌతమ్ కృష్ణ 13.81 శాతం, శుభ శ్రీ రాయగురు 7.11 శాతం, సింగర్ దామినికి 5.43 శాతం ఓటింగ్ నమోదు అయింది. మొన్నటివరకు పల్లవి ప్రశాంత్, శివాజీలు టాప్‍లో ఉండేవాళ్లు. ఇప్పుడు వారు నామినేషన్లలో లేకపోయేసరికి అమర్ దీప్ టాప్‍కి వచ్చేశాడు. అలాగే చివర్లో ఉండే ప్రిన్స్ యావర్ 18.99 శాతం ఓటింగ్‍తో రెండో స్థానంలో ఉండటం విశేషం.
ఆమెకు ఎలిమినేషన్ ముప్పు
బిగ్ బాస్ ఓటింగ్‍లో మిడిల్ రేంజ్‍లో ఉండే సింగర్ దామిని (Singer Damini Bhatla) పాతాళంలోకి పడిపోయింది. ఆమె తర్వాతి స్థానంలో బ్యూటిఫుల్ శుభ శ్రీ ఉంది. ఈ ఇద్దరు ప్రస్తుతం డేంజర్ జోన్‍లో ఉండి ఎలిమినేషన్‍కు దగ్గరగా ఉన్నారు. ఈ వారం ఆటతో ప్రూవ్ చేసుకోకపోతే అతి తక్కువగా ఉన్న దామిని మూడోవారం ఎలిమినేట్ (Bigg Boss 7 Telugu Third Week Elimination) అయ్యే అవకాశం ఉందని గట్టిగానే వార్తలు వినిపిస్తున్నాయి. ఇలా అనేక ట్విస్టులతో బిగ్ బాస్ 7 తెలుగు మూడో వారం ఓటింగ్ ప్రక్రియ సాగింది. వీకెండ్ వరకు ఇది ఎలా ఉంటుందో చూడాలి మరి.