Bigg Boss Telugu 7 Vote: హీరోను తొక్కిపడేసిన జనం.. ఒక్క ఎపిసోడ్‍తో ఓటింగ్ తారుమారు.. ఇద్దరికి డేంజర్
Bigg Boss 7 Telugu Voting: బిగ్ బాస్ తెలుగు 7 సీజన్ మూడో వారంలో ఒక్క ఎపిసోడ్‍తో ఓటింగ్ లెక్కలు అన్ని మారిపోయాయి. ప్రస్తుతం హౌజ్‍లో 12 మంది కంటెస్టెంట్స్ ఉండగా.. ఏడుగురు నామినేషన్లలో ఉన్నారు. వారికి పోల్ అయిన ఓట్లను పరిశీలిస్తే..
Bigg Boss 7 Telugu 3rd Week Voting Result: పాపులర్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు 7 సీజన్‍లోకి మొత్తంగా 14 మంది కంటెస్టెంట్స్ అడుగుపెట్టగా.. మొదటి వారంలో హీరోయిన్ కిరణ్ రాథోడ్, సెకండ్ వీక్‍లో షకీలా ఎలిమినేట్ అయి వెళ్లిపోయారు. ప్రస్తుతం బిగ్ బాస్ 7 తెలుగులో 12 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. వారిలో మొదటి ఇంటి సభ్యుడిగా ఆట సందీప్, రెండో ఇంటి సభ్యుడిగా హీరో శివాజీ అర్హత సాధించుకుని వరుసగా 5 వారాలు, 4 వారాల ఇమ్యునిటీ సంపాదించుకున్నారు.
ట్రెండింగ్ వార్తలు
అత్యధిక ఓట్లతో
ఇక బిగ్ బాస్ 7 తెలుగు మూడో వారం జరిగిన నామినేషన్లలో మొత్తంగా ఏడుగురు గౌతమ్ కృష్ణ, ప్రిన్స్ యావర్, శుభ శ్రీ రాయగురు, రతిక రోజ్, సింగర్ దామిని, అమర్ దీప్ చౌదరి, ప్రియాంక జైన్ ఉన్నారు. నామినేషన్స్ సోమవారం (సెప్టెంబర్ 18) నుంచి పోలింగ్ నిర్వహించారు. అయితే అందులో మొదట్లో అత్యధిక ఓట్లతో సీరియల్ హీరో అమర్ దీప్ చౌదరి ముందంజలో, ప్రిన్స్ రెండో ప్లేసులో ఉండగా.. శనివారం వచ్చేసరికి స్థానాలు తారుమారైపోయాయి.
డేంజర్ జోన్‍లో ముద్దుగుమ్మలు
ప్రస్తుతం లెక్కల ప్రకారం 20.91 శాతం ఓట్లతో టాప్‍లో ప్రిన్స్ యావర్, 19.69 శాతంతో రెండో స్థానంలో గౌతమ్ కృష్ణ ఉన్నారు. 18.6 శాతం ఓట్లతో అమర్ దీప్ చౌదరి మూడో స్థానానికి పడిపోయాడు. ఇక రతిక రోజ్‍కు 14.47 శాతం, ప్రియాంక జైన్ 14.45 శాతం, శుభ శ్రీ రాయగురు 6.09 శాతం, సింగర్ దామిని 5.79 శాతం ఓట్లు సాధించారు. వీరిలో చివరి రెండు స్థానాలతో శుభ శ్రీ, దామిని డేంజర్ జోన్‍లో ఉన్నారు. ఇద్దరిలో సింగర్ దామిని దాదాపుగా 99 శాతం ఎలిమినేట్ (Bigg Boss 7 Telugu Third Week Elimination) అయ్యే అవకాశం ఉందని సమాచారం.
ఒక్క ఎపిసోడ్‍తో
ఇదిలా ఉంటే సీరియల్ బ్యాచ్ గ్రూప్ గేమ్, శాడిజం, క్రూరత్వం, శారీరక, మానసిక హింస అన్నింటిని తట్టుకుని ప్రిన్స్ టాప్‍లోకి వచ్చాడు. మూడో పవరాస్త్ర కంటెండర్‍షిప్ కోసం నిరూపించుకునే టాస్క్ జరిగిన ఒక్క ఎపిసోడ్‍తో ఈ ఓట్లు తారుమారు అయ్యాయి. సీరియల్ హీరో అమర్ దీప్‍ను దాటి ముందుకు వచ్చాడు. అలాగే గౌతమ్ కృష్ణ కూడా తన జెన్యూన్ గేమ్‍తో రెండో స్థానంలో ఉన్నాడు. తాము మంచివాళ్లుగా పోట్రే చేసుకుంటున్న సీరియల్ బ్యాచ్ అమర్, ప్రియాంకకు మంచి పాపులారిటీ ఉన్నప్పటికీ వాళ్ల చేష్టలు వెనక్కి నెట్టేలా చేశాయి.
టాపిక్