Inaya Sultana Top in Bigg Boss Voting: ఎంత పనిచేసింది పిట్ట.. ఓటింగ్‌లో దూసుకెళ్తోన్న ఇనాయా..!-bigg boss telugu 6 fourth week voting results inaya in top 2 ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
Telugu News  /  Entertainment  /  Bigg Boss Telugu 6 Fourth Week Voting Results Inaya In Top 2

Inaya Sultana Top in Bigg Boss Voting: ఎంత పనిచేసింది పిట్ట.. ఓటింగ్‌లో దూసుకెళ్తోన్న ఇనాయా..!

ఓటింగ్‌లో దూసుకెళ్తున్న ఇనాయా
ఓటింగ్‌లో దూసుకెళ్తున్న ఇనాయా (Instagram)

Bigg Boss 6 Telugu Fourth Week Voting: ఓటింగ్‌లో ఇనాయా దూసుకెళ్తోంది. ఇనాయానే టార్గెట్ చేసి మరి అందరూ నామినేట్ చేయడంతో ఆమెకు సింపతీ బాగా వర్కౌట్ అయింది. ఈ వారం నామినేషన్స్‌లో రేవంత్, శ్రీహాన్‌తో పోటీ పడుతుంది.

Inaya is top in Voting: ఇనాయ సుల్తానా.. ప్రస్తుతం జరుగుతున్న బిగ్‌బాస్ సీజన్ 6లో బాగా వినిపిస్తున్న పేరు. మొదటి రెండు వారాల్లో ఓ సాధారణ కంటెస్టెంట్‌గా ఉన్న ఇనాయా.. ఒక్క దెబ్బకు ఊహించని రీతిలో దూసుకెళ్తింది. తొలి వారంలోనే ఎలిమినేట్ కావాల్సిన ఈ బ్యూటీ.. ఓటింగ్ లెక్కలు చూస్తుంటే ఏకంగా టాప్-5కి చేరుకున్నా ఆశ్చర్యోపోనక్కర్లేదనేంతగా దుమ్మురేపుతోంది. మూడో వారం కెప్టెన్సీ టాస్క్‌ మొదలవడం, శ్రీహాన్‌తో గొడవ పడటం ఆమెను బిగ్‌బాస్ హౌస్‌లో స్టార్‌ను చేసింది. ఇందుకు కారణంగా శ్రీహాన్ నోటి జారుడే. పిట్ట అంటూ ఆమెపై సెటైర్ వేసి యాంకర్ నాగార్జన చేతిలో తిట్లు తిన్న శ్రీహాన్.. అయినా కూడా బుద్ది రాకుండా సోమవారం నామినేషన్ ఎపిసోడ్‌లో రెచ్చిపోయాడు.

ట్రెండింగ్ వార్తలు

యాటిట్యూడ్ చూపించడం, ఇనాయాను నామినేట్ చేయడానికి వచ్చినప్పుడు ఆవలించడం ఒక్కటేమిటి మనోడి అతి ఓ రేంజ్‌లో ఉంది. గొర్రెల మంద మాదిరిగా అందరూ ఇనాయానే టార్గెట్ చేసి మరి నామినేట్ చేయడంతో ఆమెకు సింపతీ బాగా వర్కౌట్ అయింది. ఈ వారం నామినేషన్స్‌లో రేవంత్, శ్రీహాన్‌తో పోటీ పడుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే టాప్‌‍లో ఉన్న రేవంత్ కంటే రెండు, మూడు శాతం ఓట్లే ఇనాయాకు తక్కువ కావడం గమనార్హం. మరోపక్క గత వారం ఓటింగ్‌లో దూసుకెళ్లిన శ్రీహాన్ ఈ వారం నాలుగో స్థానానికి పడిపోయాడు.

గత అర్ధరాత్రి నుంచి ఓటింగ్ ప్రారంభం కాగా.. అన్‌అఫిషియల్ పోల్ ప్రకారం అందరి కంటే ఎక్కువగా రేవంత్ 26 శాతంతో అగ్రస్థానంలో ఉండగా.. ఇనాయ సుల్తానా 24.6 శాతంతో ఓటింగ్‌లో రెండో స్థానంలో ఉంది. ఇదే ఊపు కొనసాగితే టాప్‌కు చేరడం ఖాయంగా కనిపిస్తోంది. పిట్ట అని పిలిచిన ఇనాయాను స్టార్‌ చేసిన శ్రీహాన్ గత వారం టాప్-2లో ఉండగా.. ఇప్పుడు నాలుగో స్థఆనానికి పడిపోయాడు. అనంతరం గీతూ తన స్థానాన్ని కాపాడుకుంటూ 10 శాతంతో ఓట్లో ఐదో స్థానంలో నిలిచింది.

ఇనాయాకు ఊహించిన రీతిలో ఈ విధంగా ఓటింగ్ రావడానికి ప్రధాన కారణం ఇంటి సభ్యులు ఆమెను టార్గెట్ చేయడమే. ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు ఏకంగా తొమ్మిది మంది ఈ వారం ఆమెను నామినేట్ చేశారు. శ్రీహాన్, సుదీప, గీతూ, ఆరోహి, శ్రీసత్య, చంటి, ఆర్జే సూర్య, రోహిత్ మెరీనా, కీర్తి వీళ్లంతా ఇనాయను టార్గెట్ చేస్తూ నామినేట్ చేశారు. దొంగల టీమ్‌లో ఉన్న వాళ్లు ఇనాయాను నామినేట్ చేశారంటే అర్థముంది.. కానీ పోలీసుల టీమ్‌లో ఉన్న శ్రీ సత్య, చంటి, రోహిత్ మెరీనా ఇనాయాను నామినేట్ చేయడం విచిత్రంగా అనిపించింది. అసలు ఈ టాస్‌లో పోలీసులు గెలవడానికి కారణమే ఇనాయ, ఆదిరెడ్డి వల్ల. ఉళ్లు ఊనమయ్యేలా కష్టపడటమే కాకుండా.. అనేక రకాల మాటాలు కూడా పడింది ఇనాయ. తీరా గెలిచన తర్వాత ఆమె టీమ్ సభ్యులే తనపై నిందలు వేయడాన్ని భరించలేక కన్నీళ్లు పెట్టుకుంది.

సంబంధిత కథనం

టాపిక్