Bigg Boss 6 Telugu Episode 38: ఇనయాను సత్య అంత పెద్ద బూతు అన్నదా? భార్యతో ఆదిరెడ్డి వీడియో కాల్..!-bigg boss telugu 6 episode 38 adireddy video call to his wife and srihan gets mutton biryani ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Bigg Boss 6 Telugu Episode 38: ఇనయాను సత్య అంత పెద్ద బూతు అన్నదా? భార్యతో ఆదిరెడ్డి వీడియో కాల్..!

Bigg Boss 6 Telugu Episode 38: ఇనయాను సత్య అంత పెద్ద బూతు అన్నదా? భార్యతో ఆదిరెడ్డి వీడియో కాల్..!

Maragani Govardhan HT Telugu
Oct 12, 2022 06:45 AM IST

Adireddy Video Call to his wife: మంగళవారం నాటి ఎపిసోడ్‌లో బిగ్‌బాస్.. హౌస్ మెట్స్‌కు ఫ్యామిలీ సభ్యులతో మాట్లాడే లేదా వారి తాలుకూ జ్ఞాపకాలను పొందే అవకాశాన్ని టాస్క్ రూపంలో ఇచ్చారు. కొన్ని సర్ ప్రైజ్‌లు ప్లాన్ చేశారు. ఇందులో భాగంగా ఆదిరెడ్డి తన భార్యకు వీడియో కాల్‌లో మాట్లాడే అవకాశం వచ్చింది.

బిగ్‌బాస్ 6 ఎపిసోడ్ 38
బిగ్‌బాస్ 6 ఎపిసోడ్ 38

Bigg Boss Telugu 6 Day 37 Episode 38: సోమవారం నాడు నామినేషన్లతో హీట్‌గా మారిపోయిన బిగ్‌బాస్ హౌస్.. కంటెస్టెంట్ల ఓదార్పులు, ఏడుపులు, తమ నామినేషన్లకు గల కారణాలతో ఆ రాత్రంతా గడిచింది. ముందు రోజు నామినేషన్లతో గొడవలు పెట్టిన బిగ్‌బాస్.. మంగళవారం నాడు భావోద్వేగాలతో నిండిపోయింది. ఫ్యామిలీ సభ్యులతో మాట్లాడే లేదా వారి తాలుకూ జ్ఞాపకాలను పొందే అవకాశాన్ని టాస్క్ రూపంలో ఇచ్చారు బిగ్‌బాస్. హౌస్ మెట్స్‌కు కొన్ని సర్ ప్రైజ్‌లు ప్లాన్ చేశారు. ఆడియో కాల్, వీడియో కాల్, ఇంటి నుంచి ఫుడ్, షర్ట్ లాంటివి పొందే అవకాశాన్ని ఇచ్చాడు. మరి అవేంటి? ఎవరెవరు దక్కించుకున్నారు? హైలెట్స్ గురించి ఇఫ్పుడు ఓ లుక్కేద్దాం.

ఎపిసోడ్ కీర్తి ఏడుపుతో మొదలైంది. నామినేషన్ ముగిసినా దాన్నుంచి ఆమె ఇంకా బయటపడలేకపోయింది. ఇనాయను నీ ఎంకమ్మ అనడం పెద్ద బూతు అని శ్రీసత్య అందరికీ నొక్కి చెప్పింది. కానీ శ్రీ సత్య ఇనాయను ఘోరమైన బూతులతో సంభోదించిందని ఫైమాతో చెప్పింది. అదేంటో చెప్తే ఇనాయను ఆమెను చెప్పు తీసుకుని కొట్టడం ఖాయమని, ఆమె ఏమందో చెప్తే హౌస్ అల్లకల్లోలం అవుతుందని స్పష్టం చేసింది. మరుసటి రోజు బిగ్‌బాస్ ఇంటి సభ్యులకు బ్యాటరీ రీఛార్జ్ టాస్క్ ఇచ్చాడు.

కెప్టెన్సీ పోటీదారుల టాస్క్..

ఇందులో భాగంగా గార్డెన్ ఏరియాలో 100 శాంత ఛార్జ్ ఉన్న బ్యాటరీని ఏర్పాటు చేశాడు. ఈ వారం హౌస్ మేట్స్ కోసం బిగ్‌బాస్ సర్‌ప్రైజ్‌లు ప్లాన్ చేశాడు. ఇంటి సభ్యులు ఏ సర్ ప్రైజ్ అయితే ఎంచుకుంటారో బదులుగా బ్యాటరీ ఛార్జ్ తగ్గిపోతుంది.. అలాగే ఇంటి నియమాలను ఉల్లంఘించినా ఛార్జ్ తగ్గుతుందని బిగ్‌బాస్ చెబుతారు. ఈ క్రమంలో ఒక్కక్కరిని కన్ఫెషన్ రూంకు పిలుస్తారు. ముందుగా శ్రీహాన్ వెళ్లగా.. అతడికి వీడియో కాల్(35%), ఆడియో మెసేజ్(30%), ఇంటి ఫుడ్(15%) ఆప్షన్లు ఇస్తారు. ముందు తను స్వీకరించలేనని అతడు చెప్పినప్పటికీ.. ఇంటి మొత్తం ప్రభావితమవుతుందని బిగ్‌బాస్ ఆదేశించడంతో శ్రీహాన్ ఆప్షన్ ఎంచుకోవడం తప్పలేదు. అతడు అన్నింటికంటే తక్కువ ఛార్జ్ ఉన్న ఇంటి ఫుడ్‌ను ఎంచుకుంటాడు. అలాగే ఇంట్లో వాళ్లతో మాట్లాడలేకపోయానని బయటకొచ్చి ఎమోషనల్ అవుతాడు.

అనంతరం సుదీపను బిగ్‌బాస్ పిలుస్తారు. నీ భర్తతో మాట్లాడతావా? టీషర్ట్ కావాలా? మీ అమ్మ చేసిన చికెన్ కర్రీ కావాలా? అనే ఆప్షన్లు ఇస్తాడు. అందుకామె ఎమోషనలై చివరకు తక్కువ బ్యాటరీ ఉన్న ఆడియో కాల్(30%) ఎంచుకుంటుంది. అనంతరం ఆమె తన భర్త రంగనాథ్‌తో ఫోన్‌లో మాట్లాడుతుంది. మరోపక్క శ్రీహాన్‌కు ఇంటి వద్ద నుంచి తన మటన్ బిర్యానీ అందుకుంటాడు. ఇదిలా ఉంటే కెప్టెన్ అయినా కూడా రేవంత్.. ఇంటి నియమాలను ఉల్లంఘిస్తున్నాడు. నిద్రపోవడంతో 5 శాతం ఛార్జ్ తగ్గిస్తాడు బిగ్‌బాస్. గీతూ సరిగ్గా మైక్ ధరించనందుకు గానూ మరో 5 శాతం తగ్గిపోతుంది.

ఆదిరెడ్డి ఫుల్ బూస్ట్..

అనంతరం ఆదిరెడ్డిని పిలుస్తాడు బిగ్‌బాస్. తన భార్యతో వీడియో కాల్ మాట్లాడతావా(40%), టీ షర్ట్(35%), ఆడియో కాల్(30%) ఈ మూడింటిలో ఏది ఎంచుకుంటారు అని బిగ్‌బాస్ అడుగ్గా.. చాలా సేపు ఆలోచనలో పడతాడు ఆదిరెడ్డి. మూడు ఎక్కువ ఛార్జే ఉండటంతో ఆదిరెడ్డి తెలివిగా ఉన్న 45 శాతం ఛార్జ్‌తో భార్యతో వీడియో కాల్ మాట్లాడే అవకాశాన్ని ఎంచుకుంటారు. వీడియో కాల్‌లో కవితను చూడాగానే ఆదిరెడ్డి కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఈ సీజన్‌లో అతడు ఏడ్వడం ఇదే తొలిసారి. భార్యను, కూతురును చూసిన ఆనందంలో ఆనంద భాష్పాలతో భావోద్వేగం చెందాడు. మరోపక్క ఆదిరెడ్డి భార్య కవిత కూడా అతడిలో ఆత్మవిశ్వాసం నింపేలా మాట్లాడింది.

బిగ్‌బాస్ వెళ్లినందుకు చాలా గర్వపడుతున్నా. ప్రోగ్రస్ అవ్వాలని ప్రతిసారి చెప్తావ్. బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్న ప్రతిక్షణం నువ్వు ప్రోగ్రస్ అవ్వడానికి ట్రై చెయ్. నీ వైపు తప్పులేనప్పుడు అవతల వ్యక్తి ఎవరైనా సరై ఆర్గ్యూ చేయ్. అస్సలు వదలొద్దు. అంటూ అతడిలో ఆత్మవిశ్వాసం నింపింది. ఈ మూడు నెలను మేము నిన్ను ఎందుకు మిస్ అయ్యాం అనే క్వశ్చన్‌కు ఆన్సర్ నువ్వు విన్నరై రావడం. అని ఎమోషనల్‌గా చెప్పింది. తన భార్య కవిత మాటలకు ఆదిరెడ్డి పొంగిపోయాడు. పాప నిలబడుతుందా? అడుగులేస్తుందా? మాటలు వస్తున్నాయా? పన్ను వచ్చిందా? అంటూ కూతుర్ని చూసి ఎమోషనల్ అయ్యాడు. మొత్తానికి ఈ ఎపిసోడ్‌తో ఆదిరెడ్డికి ఫుల్ బూస్ట్ వచ్చింది. ఎక్కువ బ్యాటరీ ఉపయోగించుకున్నప్పటికీ.. ఆదిరెడ్డి ఆటకు మంచి ప్లస్ అయిందనే చెప్పాలి. మరి ఎక్కువ ఛార్జ్ సెలక్ట్ చేసుకున్నందుకు ఈ రీజన్‌తో వచ్చే ఎపిసోడ్‌లో నామినేట్ చేసే అవకాశమూ లేకపోలేదు.

IPL_Entry_Point

సంబంధిత కథనం

టాపిక్