Bigg Boss Nominations: యష్మి, నిఖిల్‌పై రివేంజ్ తీర్చుకున్న గౌతమ్ - ఈ వారం నామినేషన్స్‌లో ఉన్నది వీళ్లే!
Bigg Boss Nominations: బిగ్‌బాస్ పదోవారం నామినేషన్స్‌లో గౌతమ్, నిఖిల్, యష్మి మధ్య గొడవ హైలైట్ అయ్యింది. ఈ వీక్ నామినేషన్స్‌లో మొత్తం ఏడుగురు కంటెస్టెంట్స్ నిలిచారు. నిఖిల్, పృథ్వీ, యష్మీ, ప్రేరణ, విష్ణుప్రియ, హరితేజ, గౌతమ్ నామినేషన్స్‌లో ఉన్నారు.
Bigg Boss Nominations: బిగ్‌బాస్ 8 తెలుగు పదోవారం నామినేషన్స్ ప్రక్రియ ఆసక్తికరంగా సాగింది. ఈ వారం నామినేషన్స్‌లో ఏడుగురు కంటెస్టెంట్స్ నిలిచారు. నిఖిల్, పృథ్వీ, యష్మీ, ప్రేరణ, విష్ణుప్రియ, హరితేజ, గౌతమ్ నామినేషన్స్‌లో ఉన్నారు. సోమవారం నాటి గేమ్‌లో గౌతమ్ అదరగొట్టాడు. ఈ ఎపిసోడ్‌తో అతడు టైటిల్ ఫేవరేట్లలో ఒకరిగా మారిపోయాడు. యష్మి, నిఖిల్‌లకు గౌతమ్‌కు మధ్య సాగిన వాదనలు నామినేషన్స్ ఎపిసోడ్‌కు హైలైట్‌గా నిలిచాయి.
గౌతమ్‌ను నామినేట్ చేసిన నిఖిల్...
ఈ నామినేషన్స్‌లో నిఖిల్.... గౌతమ్‌ను నామినేట్ చేశాడు. ఒకరు నో అన్నప్పుడు నో అనే అర్థం...వద్దని చెప్పిన కూడా యష్మిని అక్కా అని పిలిచి ఇబ్బంది పెడుతోన్నావని, నువ్వు నా మీద రూల్ బుక్ విసిరేయడం కూడా నచ్చలేదంటూ గౌతమ్‌ను నామినేట్ చేశాడు నిఖిల్. అక్కా అని పిలిస్తే తప్పేంటి....యష్మి కూడా తనను తమ్ముడు అని పిలిచిందా కదా అంటూ నిఖిల్‌తో గౌతమ్ వాదించాడు.
అశ్వత్థామ 2.0
నిన్ను అశ్వత్థామ 2.0 అని పిలిస్తే బాధపడ్డావ్ కదా...అలా పిలవొద్దని, బుల్లీయింగ్ చేయద్దంటూ అందరితో చెప్పావు...అక్కా అని పిలవొద్దని యష్మి చెప్పినప్పుడు కూడా నువ్వు వినకుండా అలాగే పిలుస్తుంటే అదే బాధే ఉంటుందని నిఖిల్ వాదించాడు. ఇక నుంచి నువ్వు నన్ను అశ్వత్థామ అని పిలిచుకో...అశ్వత్థామ ఈజ్ బ్యాక్ అంటూ గౌతమ్...నిఖిల్‌తో ఛాలెంజ్ చేశాడు.
గొడవ సీరియల్‌గా మారడంతో బయటకు వెళ్లి చూసుకుందాం అంటూ నిఖిల్, గౌతమ్ ఒకరిపై మరొకరు సవాల్ విసురుకున్నారు. . ఇద్దరు బిగ్‌బాస్ డోర్ వరకు వెళ్లారు. నిఖిల్ ఎంత చెప్పిన అక్క అని పిలవడంలో తప్పే లేదంటూ గౌతమ్ వాదించాడు. నా మీద ఉన్న కోపాన్ని హౌజ్‌లోని ఆడపిల్లలపై చూపించొద్దని గౌతమ్‌కు నిఖిల్ వార్నింగ్ ఇచ్చాడు. గౌతమ్‌కు రోహిణి, హరితేజ సపోర్ట్‌చేశారు. గౌతమ్ మాట్లాడింది కరెక్ట్ అన్నట్లుగా అతడి మాట్లాడిన ప్రతిసారి చప్పట్లు కొట్టారు.
గౌతమ్ రివేంజ్...
ఆ తర్వాత నామినేషన్స్‌లో గౌతమ్ వంతు వచ్చింది. అతడు యష్మిని నామినేట్ చేసి రివేంజ్ తీర్చుకున్నాడు. మెగా చీఫ్ అయ్యాకా టీమ్‌లో నుంచి తనను సైడ్ చేశావని గౌతమ్ రీజన్స్ చెప్పాడు. యష్మి అతడితో వాదనకు దిగింది. చీఫ్ అయిన తన మీట వినకుండా గేమ్‌లో అవతలి టీమ్‌ను సపోర్ట్‌చేశావని, తప్పు చేసినప్పుడు అరవకుండా నీకు ముద్దుపెట్టి బుజ్జగించాలా అంటూ యష్మి అన్నది.నేను ముద్దు పెట్టమని అడగలేదని గౌతమ్ సమాధానమిచ్చాడు.
ఆ తర్వాత యష్మి...గౌతమ్‌ను నామినేట్ చేసింది. అక్కా అని పిలుస్తుంటే తనకు ఇబ్బందిగా ఉందని అన్నది. అక్కా అని పిలుస్తావు.. క్రష్ అంటావు అంటూ గౌతమ్‌తో యష్మి అన్నది. నీమీద నాకు కొంచెం క్రష్ ఉండేదని కానీ గొడవల వల్ల అక్కా అని పిలవాల్సివచ్చిందని యష్మి పట్ల తన మనసులో ఉన్నది మొత్తం బయటపెట్టేశాడు. ఇక నుంచి అక్కా అని పిలవమనని యష్మీతో చెప్పాడు. గౌతమ్‌ను టీమ్ నుంచి సైడ్ చేయడం బాగాలేదంటూ రోహిణి కూడా యష్మినే నామినేట్ చేసింది.
ప్రేరణను నామినేట్ చేసిన విష్ణుప్రియ...
విష్ణుప్రియ...ప్రేరణను నామినేట్ చేసింది. గేమ్‌లో తప్పులు చేయడం వల్లే నిన్ను నామినేట్ చేయాల్సివచ్చిందని అన్నది. మెగా చీఫ్‌గా ఫెయిలయ్యావని విష్ణుప్రియను నబీల్ నామినేట్ చేశాడు. టేస్టీ తేజ...పృథ్వీని....హరితేజ...ప్రేరణను నామినేట్ చేశారు. పృథ్వీ రోహిణిని నామినేట్ చేశాడు.