మిత్రా శర్మ, గీతానంద్, శ్రీహాన్, జెన్నీఫర్ ఇమాన్యుల్, రోనిత్, అన్షుల హీరోహీరోయిన్లుగా నటిస్తున్న మూవీ వర్జిన్ బాయ్స్. యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీకి దయానంద్ గడ్డం దర్శకత్వం వహిస్తున్నారు. జూలై 11న ఈ మూవీ రిలీజ్ కాబోతోంది. శనివారం వర్జిన్ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.
ఈ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌లో సినిమా టికెట్ కొన్న 11 మందికి ఐఫోన్లు గిఫ్ట్ గా ఇస్తామని చిత్రబృందం ప్రకటించింది. మనీ రైన్ ఇన్ థియేటర్స్ అనే కాన్సెప్ట్ తో కొన్ని థియేటర్లలో ఆడియెన్స్‌పై డబ్బు వర్షం కురిపిస్తామని, సినిమా చూస్తున్న ప్రేక్షకులు ఎవరైనా ఆ డబ్బును సొంతం చేసుకోవచ్చునని ప్రకటించారు.
ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌లో బిగ్‌బాస్ శ్రీహాన్ మాట్లాడుతూ... “యువతను మెప్పించే సినిమాగా వర్జిన్ బాయ్స్ ఉంటుంది. ఇందులో ఫుల్ లెంగ్త్ కామెడీ రోల్‌లో కనిపిస్తా. అంతర్లీనంగా నా క్యారెక్టర్‌లో మంచి ఎమోషన్ ఉంటుంది” అని అన్నారు
“కాలేజీ రోజుల్లో ఉండగా తాము చేసిన కొన్ని సరదా సంఘటనలను ఆధారంగా చేసుకుని వర్ఝిన్ బాయ్స్ సినిమా చేశాం. ఇలాంటి సినిమాలు చాలా అరుదుగా వస్తాయి. యూత్ అందరికి కనెక్ట్ అయ్యే మూవీ ఇది. మా అన్నయ్య గీతానంద్ తో నాకు ఇది రెండవ సినిమా. సినిమాలో గీతానంద్, మిత్రా శర్మ మధ్య సీన్లు అద్భుతంగా వచ్చాయి” అని డైరెక్టర్ అన్నారు.
నటుడు గీతానంద్ మాట్లాడుతూ... "ఈ సినిమాకు డైరెక్టర్ నా తమ్ముడే. ఇద్దరం కలిసి షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్లతో పాటు ఒక సినిమా చేశాను. శ్రీహన్ వల్ల వర్జిన్ బాయ్స్ సినిమా అద్భుతంగా వచ్చింది.ఈ సినిమా యూత్ కు బయోపిక్ లాంటిది. నిజమైన సంతోషం మందు, మత్తు పదార్థాలలో ఉండదు. మనం ఏదైనా సాధించినప్పుడు వస్తుంది అన్నదే ఈ మూవీ కథ" అన్నారు. వర్జిన్ బాయ్స్ సినిమాలో తన క్యారెక్టర్ కొంచెం కొత్తగా ఉంటుందని, శ్రీహాన్ లేకపోతే ఈ సినిమాలో కిక్ ఉండదని మిత్రా శర్మ అన్నది.
వర్జిన్ బాయ్స్ సినిమాను రాజా దారపునేని నిర్మించారు. స్మరణ్ సాయి మ్యూజిక్ అందించారు.