Maa Awara Zindagi Release Date: బిగ్‌బాస్ ఫేమ్ శ్రీహాన్ హీరోగా నటిస్తోన్న మా ఆవారా జిందగీ సినిమా థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. జూన్ 23న ఈ సినిమా రిలీజ్ కానుంది. బిగ్‌బాస్ సీజన్ 6లో శ్రీహాన్ పాల్గొనడానికి ముందే ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. అతడు హౌజ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత రిలీజ్ చేస్తే ఆ క్రేజ్ కలిసి వస్తుందని సినిమా యూనిట్ ఇన్నాళ్లు రిలీజ్‌ను పోస్ట్‌పోన్ చేస్తూ వచ్చింది.
ఎట్టకేలకు ఈ సినిమా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇటీవల మా ఆవారా జిందగీ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. డబుల్ మీనింగ్ డైలాగ్స్, రొమాంటిక్ సీన్స్‌తో హాట్‌హాట్‌గా ట్రైలర్ సాగింది. కంప్లీట్‌గా యూత్‌ను టార్గెట్ చేస్తూ మా ఆవారా జిందగీ సినిమాను తెరకెక్కించినట్లుగా కనిపిస్తోంది.
ఈ సినిమాలో శ్రీహాన్, అజయ్, సద్దాంతో పాటు పలువురు బుల్లితెర ఆర్టిస్ట్‌లు కీలక పాత్రలను పోషించారు.దీపా శ్రీకాంత్‌రెడ్డి దర్శకత్వం వహిస్తోన్నాడు. అయితే ట్రైలర్‌లోని డబుల్ మీనింగ్ డైలాగ్స్ పై నెటిజన్లు ఫైర్ అవుతోన్నారు. సిరితో కలిసి ఈ సినిమా చూడగలవా శ్రీహాన్ అంటూ కామెంట్స్ చేస్తోన్నారు. బూతు సినిమాలతో సక్సెస్ కాలేవని శ్రీహాన్‌ను విమర్శిస్తోన్నారు.
కాగా బిగ్‌బాస్ సీజన్6 ద్వారా తెలుగులో చక్కటి పాపులారిటీని దక్కించుకున్నాడు శ్రీహాన్. ఫైనల్ చేరుకున్న అతడు రన్నరప్‌గా నిలిచాడు. విన్నర్ రేవంత్ కంటే ఎక్కువ క్యాష్ ప్రైజ్ గెలుచుకున్నాడు. ప్రస్తుతం తన లవర్ సిరితో కలిసి ఓ వెబ్‌సిరీస్‌లోనూ నటిస్తోన్నాడు శ్రీహాన్.