Bigg Boss Sivaji: జ‌బ‌ర్ధ‌స్త్‌కు కొత్త జ‌డ్జ్ రానున్నాడోచ్‌ - బుల్లితెర‌పైకి బిగ్‌బాస్ శివాజీ రీఎంట్రీ!-bigg boss sivaji re entry into small screen after long gap with jabardasth comedy show as judge ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Bigg Boss Sivaji: జ‌బ‌ర్ధ‌స్త్‌కు కొత్త జ‌డ్జ్ రానున్నాడోచ్‌ - బుల్లితెర‌పైకి బిగ్‌బాస్ శివాజీ రీఎంట్రీ!

Bigg Boss Sivaji: జ‌బ‌ర్ధ‌స్త్‌కు కొత్త జ‌డ్జ్ రానున్నాడోచ్‌ - బుల్లితెర‌పైకి బిగ్‌బాస్ శివాజీ రీఎంట్రీ!

Nelki Naresh Kumar HT Telugu
Sep 12, 2024 08:47 AM IST

జ‌బ‌ర్ధ‌స్థ్‌కు మ‌రో కొత్త జ‌డ్జ్ వ‌చ్చాడు. కృష్ణ‌భ‌గ‌వాన్ స్థానంలో ఈ కామెడీ షో లేటెస్ట్ ప్రోమోలో శివాజీ జ‌డ్జ్‌గా క‌నిపించాడు. జ‌డ్జ్‌గా వ‌చ్చిన శివాజీకి కంటెస్టెంట్స్ గ్రాండ్ వెల్క‌మ్ చెప్పారు. ఈ కొత్త ప్రోమోలో కంటెస్టెంట్స్‌పై శివాజీ వేసిన పంచ్‌లు న‌వ్విస్తున్నాయి.

శివాజీ
శివాజీ

సీనియ‌ర్ హీరో శివాజీ కెరీర్ స్మాల్‌స్క్రీన్‌తోనే స్టార్ట‌య్యింది. హోస్ట్‌గా కెరీర్‌ను ప్రారంభించిన శివాజీ ఆ త‌ర్వాత క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ నుంచి హీరోగా మారారు. మంత్ర‌, మిస్స‌మ్మ‌, టాటా బిర్లా మ‌ధ్య‌లో లైలాతో పాటు తెలుగులో ప‌లు హిట్టు సినిమాల్లో క‌థానాయ‌కుడిగా న‌టించాడు.

బిగ్‌బాస్‌తో సెకండ్ ఇన్నింగ్స్‌...

ప‌రాజ‌యాల కార‌ణంగా టాలీవుడ్‌కు దూర‌మైన శివాజీ బిగ్‌బాస్ సీజ‌న్ 7తో సెకండ్ ఇన్నింగ్స్ మొద‌లుపెట్టాడు. నైంటీస్ మిడిల్‌క్లాస్ బ‌యోపిక్ వెబ్‌సిరీస్‌తో టాలీవుడ్‌లో మ‌ళ్లీ బిజీ అయ్యాడు. తాజాగా శివాజీ లాంగ్ గ్యాప్ త‌ర్వాత బుల్లితెర‌పైకి రీఎంట్రీ ఇవ్వ‌బోతున్నాడు. జ‌బ‌ర్ధ‌స్థ్ కామెడీ షోకు జ‌డ్జ్‌గా వ్య‌వ‌హ‌రించ‌నున్నాడు. లేటెస్ట్ ప్రోమోలో కృష్ణ‌భ‌గ‌వాన్ స్థానంలో శివాజీ జ‌డ్జ్‌గా రీఎంట్రీ ఇచ్చాడు.

గ్రాండ్ వెల్క‌మ్‌...

జ‌బ‌ర్ధ‌స్థ్ షోకు కొత్త జ‌డ్జ్‌గా వ‌చ్చిన శివాజీకి కంటెస్టెంట్స్ గ్రాండ్ వెల్క‌మ్ చెప్పారు. ఆ త‌ర్వాత నాకు ఇంకా బాధ‌గా ఉంద‌ని రాకెట్ రాఘ‌వ అన‌గానే...నేను జ‌డ్జ్‌గా వ‌చ్చాన‌నా...నేను కూడా జ‌డ్జ్‌గా వ‌చ్చాన‌నా అని శివాజీ అత‌డికి స‌మాధాన‌మిచ్చాడు.

తాగుబోతు ర‌మేష్ స్కిట్‌...

ర‌ష్మి డ్యాన్స్ కోస‌మే తాను జ‌బ‌ర్ధ‌స్థ్ షో చూస్తాన‌ని ఇటీవ వినాయ‌క‌చ‌వితి సంద‌ర్భంగా ఈటీవీలో టెలికాస్ట్ అయిన జైజై గ‌ణేషా షోలో శివాజీ అన్నాడు. అత‌డి కామెంట్స్‌పై తాగుబోతు ర‌మేష్ స్కిట్ చేశాడు. ఆ స్కిట్ చూడ‌గానే నేను వెళ్లిపోతా ఇక‌...నా వ‌ల్ల కాదు అని శివాజీ కామెంట్స్ చేశాడు. బుల్లెట్ భాస్క‌ర్‌తో పాటు ప్ర‌తి ఒక్క కంటెస్టెంట్‌పై శివాజీ వేసిన పంచ్‌లు న‌వ్వించాయి. చివ‌ర‌లో కెవ్వు కార్తిక్ కూడా ర‌ష్మిపై శివాజీ చేసిన కామెంట్స్‌పైనే స్కిట్ చేశాడు. ఆ స్కిట్ చూడ‌గానే నేను పోతా అన్న‌య్య నేను పోతా అని శివాజీ స‌మాధాన‌మివ్వ‌డం న‌వ్వుల‌ను పంచుతోంది. ఈ కొత్త ప్రోమో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

నాగ‌బాబు, రోజా...

జ‌బ‌ర్ధ‌స్థ్ షోకు నాగ‌బాబు, రోజా చాలా ఏళ్ల పాటుజ‌డ్జ్‌లుగా వ్య‌వ‌హ‌రించారు. రాజ‌కీయాల‌తో బిజీ అయినా రోజా, నాగ‌బాబు జ‌బ‌ర్ధ‌స్థ్ షోకు గుడ్‌బై చెప్పారు. వారి స్థానంలో మ‌నో, ఇంద్ర‌జ‌, జానీ మాస్ట‌ర్‌, శేఖ‌ర్ మాస్ట‌ర్...ఇలా ప‌లువురు సెల‌బ్రిటీస్ వ‌చ్చినా ఎక్కువ రోజులు కొన‌సాగ‌లేక‌పోయారు. గ‌త కొన్నాళ్లుగా సీనియ‌ర్ హీరోయిన్ ఖుష్బూ జ‌బ‌ర్ధ‌స్థ్ జ‌డ్జ్‌గా కొన‌సాగుతోంది. ఆమెతో పాటు ఇక నుంచి శివాజీ కూడా జ‌డ్జ్‌గా క‌నిపించ‌బోతున్నాడు.

క్రైమ్ థ్రిల్ల‌ర్ మూవీ...

నైంటీస్ మిడిల్ క్లాస్ త‌ర్వాత టాలీవుడ్‌లో శివాజీకి ఆఫ‌ర్లు కూ క‌డుతోన్నాయి. ప్ర‌స్తుతం కూర్మ‌నాయ‌కి అనే సినిమా చేస్తున్నాడు. తాను హీరోగా న‌టిస్తూ ఓన్ ప్రొడ‌క్ష‌న్‌లో శివాజీ ఓ క్రైమ్ థ్రిల్ల‌ర్ మూవీని ఇటీవ‌ల ప్రారంభించాడు. వీటితో పాటు మ‌రికొన్ని తెలుగు సినిమాలు, వెబ్‌సిరీస్‌ల‌లో శివాజీ న‌టిస్తోన్న‌ట్లు స‌మాచారం.