Bigg Boss Shining Stars Trp Rating: బిగ్‌బాస్ సీజన్ 7 త్వరలోనే ప్రారంభంకానుంది. ప్రోమోస్, టీజర్స్‌తో ఈ కొత్త సీజన్‌పై బుల్లితెర ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోన్నారు మేకర్స్. సీజన్ 6 పెద్దగా సక్సెస్ కాకపోవడంతో ఆ పొరపాట్లను సీజన్ 7లో రిపీట్ చేయకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రమోషన్స్ విషయంలో కొత్త స్ట్రాటజీ ఫాలో అవుతోన్నారు. సీజన్ 7పై హైప్ క్రియేట్ చేయడానికి ఇటీవలే బిగ్‌బాస్ షైనింగ్‌స్టార్స్ పేరుతో ఓ స్పెషల్ ఈవెంట్‌ను నిర్వహించారు.
గత ఆదివారం స్టార్ మా ఛానెల్‌లో ఈ బీబీ షైనింగ్ స్టార్ టెలికాస్ట్ అయ్యింది. ఈ షోలో బిగ్‌బాస్ హోస్ట్ నాగార్జునతో పాటు గత సీజన్స్ విన్నర్స్, రన్నరన్స్‌తో పాలు పలువురు కంటెస్టెంట్‌లు , సినిమా స్టార్స్ పాల్గొని తమ ఆటపాటలు, పంచ్, ప్రాసలతో ఆడియెన్స్‌ను అలరించారు. ఈ షోకు సుమ హోస్ట్‌గా వ్యవహరించింది. బిగ్‌బాస్ సీజన్ 7 ఎలా ఉండబోతుందో? కొత్తగా ప్రవేశపెట్టనున్న రూల్స్ గురించి బీబీ షైనింగ్ స్టార్ పోగ్రామ్‌లో హింట్ ఇచ్చారు నాగార్జున.
ఈ బీబీ షైనింగ్ స్టార్ షోకు 6.32 టీఆర్‌పీ రేటింగ్ మాత్రమే వచ్చింది. ఆర్బన్ ఏరియాలో 7.63 టీఆర్‌పీ రేటింగ్‌ను సొంతం చేసుకున్నది. ఈ షోకు 10 కంటే ఎక్కువ టీఆర్‌పీ రేటింగ్ వచ్చే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరిగింది. కానీ ఆశించిన స్థాయిలో ఆదరణ మాత్రం దక్కలేదు. అందులో సగం మాత్రమే టీఆర్‌పీ రేటింగ్‌ను దక్కించుకొని బిగ్‌బాస్ మేకర్స్‌కు షాకిచ్చింది.
బిగ్‌బాస్ పాపులర్ కంటెస్టెంట్స్ అందరూ పాల్గొన్న కూడా బుల్లితెర ప్రేక్షకులను ఈ స్పెషల్ షో ఎంటర్‌టైన్‌చేయలేకపోయింది. బిగ్‌బాస్ షోకు తెలుగు ప్రేక్షకుల్లో క్రేజ్, తగ్గుతుందనడానికి ఈ బీబీ షైనింగ్ స్టార్ ఉదాహరణంగా నిలిచిందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
కాగా బిగ్‌బాస్ సీజన్ 7 సెప్టెంబర్ ఫస్ట్ వీక్‌లో ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. కంటెస్టెంట్స్ ఫైనల్ అయినట్లు తెలిసింది. త్వరలోనే వారు ఎవరన్నది రివీల్ కానున్నట్లు తెలిసింది.