OTT Telugu: డైరెక్ట్‌గా ఓటీటీలోకి బిగ్‌బాస్ కంటెస్టెంట్ యూత్‌ఫుల్ లవ్‌డ్రామా మూవీ - స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
OTT Telugu: తెలుగు బిగ్‌బాస్ ఫేమ్ షణ్ముఖ్ జస్వంత్ హీరోగా నటిస్తోన్న లీలా వినోదం మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ కన్ఫామ్ అయ్యింది. డిసెంబర్ 19 నుంచి ఈటీవీ విన్ ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతోంది. విలన్ లవ్‌స్టోరీగా తెరకెక్కుతోన్న ఈ మూవీలో మలయాళ నటి అనఘా అజిత్ హీరోయిన్‌గా నటిస్తోంది.
OTT Telugu: బిగ్‌బాస్ ఫేమ్ షణ్ముఖ్ జస్వంత్ హీరోగా నటిస్తోన్న లీలా వినోదం ఓటీటీ ప్రేక్షకుల ముందుకు ఈ నెలలోనే రాబోతోంది. థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలోనే ఈ మూవీ రిలీజ్ అవుతోంది. ఈటీవీ విన్ ఓటీటీలో డిసెంబర్ 19 నుంచి స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ యూత్‌ఫుల్ లవ్‌స్టోరీ మూవీ నవంబర్‌లోనే విడుదల కావాల్సింది. చివరకు నెల రోజులు ఆలస్యంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
యూత్‌ఫుల్ లవ్ డ్రామా...
లీలా వినోదం మూవీలో షణ్ముఖ్ జస్వంత్‌కు జోడీగా మలయాళ బ్యూటీ అనఘా అజిత్ హీరోయిన్‌గా నటిస్తోంది. యూత్‌ఫుల్ లవ్‌డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ మూవీకి పవన్ సుంకర దర్శకత్వం వహిస్తోన్నాడు. శ్రీధర్ నిర్మిస్తోన్నారు. లీలా వినోదం మూవీకి టీఆర్ కృష్ణ చేతన్ మ్యూజిక్ అందిస్తున్నారు.
విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో...
లీలా వినోదం మూవీలో షణ్ముఖ్ జస్వంత్ వినోద్ అనే క్యారెక్టర్‌లో కనిపించబోతుండగా...లీలాగా అనఘా అజిత్ కనిపించబోతున్నట్లు సమాచారం. ఫోన్ కాల్ ద్వారా లీలా, వినోద్ మధ్య ఏర్పడిన పరిచయం ఎలా ప్రేమగా మారనున్నట్లు పోస్టర్స్ చూస్తుంటే తెలుస్తోంది. కోనసీమ నేపథ్యంలో కంప్లీట్ విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో ఫన్ లవ్‌స్టోరీగా లీలా వినోదం మూవీ సాగనున్నట్లు సమాచారం. లీలా వినోదం హీరోగా షణ్ముఖ్ జస్వంత్ ఫస్ట్ మూవీ కావడం గమనార్హం.
బిగ్‌బాస్ శివాజీతో...
లీలా వినోదం తర్వాత బిగ్‌బాస్ శివాజీతో మరో మూవీ చేస్తోన్నాడు షణ్ముఖ్ జస్వంత్ ఇటీవలే ఈ మూవీ ప్రారంభమైంది. క్రైమ్ థ్రిల్లర్‌గా ఈ కొత్త మూవీ రూపొందుతోన్నట్లు సమాచారం. ఈ మూవీకి భీమాశంకర్ దర్శకత్వం వహిస్తోన్నాడు.
బిగ్‌బాస్ రన్నరప్...
యూట్యూబర్‌గా కెరీర్ మొదలుపెట్టిన షణ్ముఖ్ జస్వంత్ బిగ్‌బాస్ సీజన్ 5తో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడయ్యాడు. ఈ సీజన్‌లో ఫస్ట్ రన్నరప్‌గా నిలిచాడు. బిగ్‌బాస్ 5 తెలుగులో సిరి హనుమంతుతో షణ్ముఖ్ లవ్ స్టోరీ హాట్ టాపిక్‌గా మారింది.
బిగ్‌బాస్ తర్వాత... ఏజెంట్ ఆనంద్ సంతోష్, ది సాఫ్ట్‌వేర్ డెవలపర్ తో పాటు మరికొన్ని వెబ్‌సిరీస్‌లు చేశాడు. రుక్మిణి, మలుపు, అయ్యోయ్యో వంటి ఇండిపెండెంట్ సాంగ్స్‌లో షణ్ముఖ్ కనిపించాడు. సినిమాలు, సిరీస్‌ల కంటే వివాదాలతోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తూ వస్తోన్నాడు షణ్ముఖ్.
బ్లాక్‌బస్టర్...
లీలా వినోదం కంటే ముందు మలయాళంలో తన్నీర్ మాతన్ దినంగల్ అనే సినిమా చేసింది అనఘా అజిత్. 2019లో రిలీజైన ఈ మూవీ కమర్షియల్ హిట్‌గా నిలిచింది. షణ్ముఖ్ మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నది.
టాపిక్