మొన్న ఆ వీడియో.. ఇప్పుడు ఫైట్ వీడియో.. బిగ్ బాస్‌లో సంచలనం రేపుతున్న కంటెస్టెంట్-bigg boss contestant kritika malik fight video with shivani bigg boss ott season 3 armaan malik ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  మొన్న ఆ వీడియో.. ఇప్పుడు ఫైట్ వీడియో.. బిగ్ బాస్‌లో సంచలనం రేపుతున్న కంటెస్టెంట్

మొన్న ఆ వీడియో.. ఇప్పుడు ఫైట్ వీడియో.. బిగ్ బాస్‌లో సంచలనం రేపుతున్న కంటెస్టెంట్

Hari Prasad S HT Telugu

బిగ్ బాస్ ఓటీటీ 3లో ఓ కంటెస్టెంట్ సంచలనం రేపుతోంది. ఈ మధ్యే ఓ సెక్స్ వీడియో బయటకు రాగా.. ఇప్పుడు ఓ ఫైట్ వీడియో కూడా వైరల్ అవుతోంది.

మొన్న సెక్స్ వీడియో.. ఇప్పుడు ఫైట్ వీడియో.. బిగ్ బాస్‌లో సంచలనం రేపుతున్న కంటెస్టెంట్

బిగ్ బాస్ రియాల్టీ షో అంటేనే సంచలనాలు. ప్రతి సీజన్లోనూ అలాంటి కంటెస్టెంట్లు, గొడవలు, వివాదాలు సాధారణమే. తాజాగా బిగ్ బాస్ ఓటీటీ మూడో సీజన్లోనూ అలాంటి ఇద్దరు కంటెస్టెంట్లు ఉన్నారు. అర్మాన్ మాలిక్, కృతికా మాలిక్ అనే ఆ ఇద్దరు దంపతులు ఈ మధ్యే సెక్స్ చేసుకున్నారంటూ ఓ ఫేక్ వీడియో బయటకు రాగా.. ఇప్పుడు కృతికా మరో కంటెస్టెంట్ తో గొడవ పడుతున్న వీడియో కూడా వైరల్ అవుతోంది.

కృతికా మాలిక్ గొడవ

బిగ్ బాస్ ఓటీటీ 3లో బాగా వినిపిస్తున్న పేరు అర్మాన్ మాలిక్. తన ఇద్దరు భార్యలతో కలిసి అతడు ఈ షోలో పాల్గొనడం, అందులో పెద్ద భార్య ఇప్పటికే ఇంటికెళ్లిపోవడం, రెండో భార్యతో బిగ్ బాస్ షోలోనే సెక్స్ చేశాడంటూ ఓ ఫేక్ వీడియో వైరల్ కావడంలాంటి వాటితో అతడు వార్తల్లో నిలుస్తున్నాడు. ఇక అతడి భార్య కృతికా మాలిక్ కూడా అలాంటి కంటెస్టెంటే.

తాజాగా ఆమె మరో కంటెస్టెంట్ శివానీ కుమారితో గొడవ పడుతున్న వీడియో బయటకు వచ్చింది. వంట చేస్తూ శివానీ తన కాలు గోక్కోవడం తాను చూశానంటూ ఆమెతో గొడవకు దిగింది. తాను అలా చేయలేదని శివానీ వాదించింది. వీళ్ల గొడవకు సంబంధించిన పూర్తి వీడియో ఇప్పుడు బయటకు వచ్చింది. ఇద్దరూ మాటామాటా అనుకోవడం నుంచి కొట్టుకోవడం వరకు వెళ్లడం గమనార్హం.

మొదట శివానీయే కృతికను వెనక్కి నెట్టడం చూడొచ్చు. ఆ తర్వాత ఆమె కూడా శివానీపై చేయి చేసుకుంది. ఇద్దరూ తీవ్రస్థాయిలో వాదులాడుకున్నారు. ఈ ఘటన వల్లే శివానీ ఇప్పుడు బిగ్ బాస్ ఓటీటీ 3 నుంచి బయటకు వెళ్లిపోయిందన్న వార్తలు వస్తున్నాయి. వచ్చే వారం గ్రాండ్ ఫినాలే జరగనుండగా.. మిగిలిన హౌజ్ మేట్స్ శివానీ బయటకు వెళ్లిపోవాల్సిందిగా ఓటు వేశారు.

అర్మాన్, కృతిక వీడియో

ఇక ఈ మధ్యే ఇదే బిగ్ బాస్ షో నుంచి అర్మాన్, కృతిక వీడియో సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఈ వీడియో వైరల్ అవడంతో జియో సినిమా కూడా స్పందించింది. ఆ వీడియో ఫేక్ అంటూ సైబర్ క్రైమ్ లోనూ ఫిర్యాదు చేసింది.

తమ షో ప్రతిష్టను దెబ్బ తీయడానికే ఇలా చేశారంటూ ఆరోపించింది. అటు ఇప్పటికే బయటకు వెళ్లిపోయిన అర్మాన్ పెద్ద భార్య పాయల్ కూడా ఆ వీడియో ఫేక్ అని స్పష్టం చేసింది. ఈ బిగ్ బాస్ ఓటీటీ 3 సీజన్ కు అనిల్ కపూర్ హోస్ట్ చేస్తున్న విషయం తెలిసిందే.