బిగ్ బాస్ అప్‌డేట్‌.. హౌస్‌లోకి వెళ్లాల‌నుందా? రియాలిటీ షోలో టాస్క్‌లు ఆడ‌తారా? అయితే ఇలా అప్లై చేయండి.. ఇవే రూల్స్‌!-bigg boss season 9 telugu follow this steps to entry into house rules and conditions nagarjuna ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  బిగ్ బాస్ అప్‌డేట్‌.. హౌస్‌లోకి వెళ్లాల‌నుందా? రియాలిటీ షోలో టాస్క్‌లు ఆడ‌తారా? అయితే ఇలా అప్లై చేయండి.. ఇవే రూల్స్‌!

బిగ్ బాస్ అప్‌డేట్‌.. హౌస్‌లోకి వెళ్లాల‌నుందా? రియాలిటీ షోలో టాస్క్‌లు ఆడ‌తారా? అయితే ఇలా అప్లై చేయండి.. ఇవే రూల్స్‌!

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9కి టైమ్ ఆసన్నమవుతోంది. త్వరలోనే ఈ రియాలిటీ షో కొత్త సీజన్ ను స్టార్ మాలో స్టార్ట్ చేయబోతున్నారు. అయితే ఈ సారి సెలబ్రిటీలతో పాటు కామన్ మ్యాన్ కు కూడా ఎంట్రీ కల్పిస్తున్నారు. అందుకు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 (x/JioHotstar Telugu)

మరోసారి తెలుగు ఫ్యాన్స్ ను ఎంటర్ టైన్ చేసేందుకు రియాలిటీ గేమ్ షో బిగ్ బాస్ రెడీ అవుతోంది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9కి టైమ్ ఆసన్నమవుతోంది. ఈ సీజన్ ను స్టార్ట్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. బిగ్ బాస్ 9 త్వరలోనే వస్తుందంటూ పోస్టర్లు రిలీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ సారి బిగ్ బాస్ సీజన్ లోకి కామన్ వ్యక్తులకు కూడా ఎంట్రీ ఉందని పదే పదే స్పష్టం చేస్తున్నారు.

ఎలా అప్లై చేయాలంటే?

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 త్వరలోనే స్టార్ట్ కాబోతోంది. మరోసారి కింగ్ నాగార్జున ఈ రియాలిటీ షోకు హోస్ట్ గా వ్యవహరించబోతున్నారు. ఈ నేపథ్యంలో జియోహాట్‌స్టార్‌ ఎక్స్ లో వరుసగా పోస్టులు పెట్టింది. ‘‘ఇంకా వెయిటింగ్ ఎందుకు? వీడియో రికార్డు చేయండి. ఇప్పుడే అప్లై చేయండి. త్వరలోనే స్టార్ మాలో బిగ్ బాస్ సీజన్ 9 రాబోతుంది’’ అని పోస్టు చేసింది.

ఈ స్టెప్స్ ఫాలో అయిపోండి

బిగ్ బాస్ సీజన్ 9లోకి ఎంట్రీ కోసం ప్రయత్నిస్తున్న సాధారణ ప్రజలు ఎలా అప్లై చేసుకోవాలో జియోహాట్‌స్టార్‌ పోస్టు చేసింది. ఈ స్టెప్స్ ఫాలో కావాలి అని పేర్కొంది.

  • ముందుగా bb9.jiostar.com వెబ్ సైట్ ను విజిట్ చేయాలి.
  • మీ పేరును ఎంటర్ చేయాలి.
  • మీ ఫోన్ నంబర్ ను ఎంటర్ చేయాలి.
  • సెండ్ ఓటీపీ ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
  • మీ మొబైల్ నంబర్ కు వచ్చే ఓటీపీని ఎంటర్ చేయాలి.
  • ఒకవేళ ఓటీపీ రానట్లయితే మీ ఫోన్ లో డీఎన్డీ (డు నాట్ డిస్టర్బ్) యాక్టివ్ గా ఉండొచ్చు.
  • అలా అయితే మీ మొబైల్ సర్వీస్ ప్రొవైడర్ కస్టమర్ కేర్ కు కాల్ చేసి డీఎన్డీని డీయాక్టివేట్ చేయమని చెప్పాలి.
  • డీఎన్డీ డీయాక్టివేట్ చేసుకున్న తర్వాత మళ్లీ ఫోన్ నంబర్ ఎంటర్ చేసి, వచ్చిన ఓటీపీ నమోదు చేయాలి.
  • ఆ తర్వాత ఈ మెయిల్ ఐడీ ఎంటర్ చేయాలి.
  • ఆ తర్వాత వీడియో అప్ లోడ్ చేయాలి. (బిగ్ బాస్ లో ఎందుకు పార్టిసిపేట్ చేయాలి అనుకుంటున్నారో అనే విషయంపై 3 నిమిషాలు మించకుండా, 50 ఎంబీ సైజ్ దాటకుండా ఉండే వీడియోను అప్ లోడ్ చేయాలి)
  • టర్మ్స్ అండ్ కండీషన్స్, ప్రైవసీ పాలసీ, కుకీ పాలసీని చదవాలి.
  • మీకు ఓకే అయితే అగ్రీ చేస్తున్నట్లు టిక్ చేయాలి.
  • ఆ తర్వాత యాక్సెప్ట్ డీఎన్సీ కన్సెంట్ ను క్లిక్ చేయాలి.
  • ఒకవేళ మీ ఫోన్ వెరిఫికేషన్ సక్సెస్ ఫుల్ అయ్యి, వీడియో సబ్ మిట్ చేయలేకపోతే.. మళ్లీ తర్వాత ఒకసారి వెబ్ సైట్ ను విజిట్ చేయాలి.
  • మళ్లీ ఫామ్ నింపి, వీడియో పంపించాలి.
  • ఒక్కసారి సబ్ మిట్ బటన్ క్లిక్ చేస్తే ఫైనల్ ఎంట్రీ నమోదు అయినట్లే. ఒక్కసారి సబ్ మిట్ చేశాక.. మళ్లీ మరో ఎంట్రీ చేయడానికి వీల్లేదు.

చందు శనిగారపు హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా పని చేస్తున్నారు. ఈయనకు మీడియా రంగంలో ఏడేళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు లాంటి ప్రముఖ దినపత్రికలో పని చేశారు. ఫిబ్రవరి 6, 2025 నుంచి ఇక్కడ స్పోర్ట్స్, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ వార్తలు రాస్తున్నారు. వివిధ ర‌కాల క్రీడ‌ల‌పై అవ‌గాహ‌న ఉంది.

సంబంధిత కథనం