Prerana Kambam: బిగ్‌బాస్ తర్వాత మరో తెలుగు టీవీషోలోకి ప్రేరణ వైల్డ్ కార్డ్ ఎంట్రీ - ఈ సారి జంటగా!
Prerana Kambam: బిగ్‌బాస్ తర్వాత మరో టీవీ షో ద్వారా తెలుగు ప్రేక్షకులకు పలకరించబోతున్నది ప్రేరణ కంబం. ఇస్మార్ట్ జోడీ సీజన్ 3లో కంటెస్టెంట్‌గా పాల్గొననున్నది. ఈ సెలబ్రిటీ కపుల్ టీవీ షోలోకి తన భర్త శ్రీపద్‌తో కలిసి ప్రేరణ ఎంట్రీ ఇవ్వనుంది.
Prerana Kambam: బిగ్‌బాస్ సీజన్ 8 తర్వాత తెలుగులో మరో టీవీ షోలోకి కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇస్తోంది ప్రేరణ కంబం. ఈ సారి సింగిల్‌గా కాకుండా జంటగా షోలోకి అడుగుపెట్టబోతుంది. బిగ్‌బాస్ ప్లేస్‌లో ఇటీవలే స్టార్ మా ఛానెల్‌లో ఇస్మార్ట్ జోడీ సీజన్ 3 టీవీ షో ప్రారంభమైంది.ఈ సెలిబ్రిటీ కపుల్ గేమ్ షోలోకి బిగ్‌బాస్ ఫైనలిస్ట్ ప్రేరణ వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇవ్వబోతున్నది. భర్త శ్రీపద్ దేశ్‌పాండేతో కలిసి ఈ గేమ్‌లోకి అడుగుపెట్టనుంది. ఈ విషయాన్ని ఇస్మార్ట్ జోడీ లేటెస్ట్ ప్రోమోలో చూపించారు.
వైల్డ్ కార్డ్ ఎంట్రీ...
ప్రేరణ, శ్రీపాద్ తమ తల్లిదండ్రులతో కలిసి ఈ షోలోకి అడుగుపెట్టినట్లు ప్రోమోలో చూపించారు. ప్రేరణ, శ్రీపాద్ కలిసి డ్యాన్స్ చేసినట్లు ఈ ప్రోమోలో కనిపిస్తోంది. ఇస్మార్ట్ జోడీ మూడో సీజన్‌లోకి ఫస్ట్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్‌గా ప్రేరణ - శ్రీపద్ నిలవబోతున్నారు.
తొమ్మిది జంటలు...
ఇస్మార్ట్ జోడీ సీజన్ 3లో మొత్తం తొమ్మిది జంటలు కంటెస్టెంట్స్‌గా అడుగుపెట్టాయి. ఇస్మార్ట్ జోడీలో ప్రదీప్ - సరస్వతి, అనిల్ గీలా - ఆమని, అలీ రెజా - మౌసుమా, రాకింగ్ రాకేష్ - సుజాత, యశ్ - సోనియా, లాస్య - మంజునాథ్, ఆదిరెడ్డి - కవిత, అమర్ దీప్ -తేజు , వరుణ్ - సౌజన్య జంటలతో ఈ షో మొదలైంది. ఇందులో నుంచి వరుణ్ - సౌజన్య జోడీ లేటెస్ట్ ఎపిసోడ్‌లో ఎలిమినేట్ అయ్యారు. వారి ప్లేస్‌లో ప్రేరణ - శ్రీపద్ ఈ గేమ్‌లోకి రానున్నట్లు సమాచారం. ఇస్మార్ట్ జోడీ సీజన్ 3కి ఓంకార్ హోస్ట్‌గా వ్యవహరిస్తోన్నాడు.
థర్డ్ రన్నరప్‌గా...
బిగ్‌బాస్ సీజన్ 8లోకి కంటెస్టెంట్‌గా అడుగుపెట్టిన ప్రేరణ ఫైనల్ చేరుకుంది ప్రేరణ. థర్డ్ రన్నరప్‌గా షో నుంచి ఎలిమినేట్ అయ్యింది. ఒకానొక టైమ్‌లో బిగ్‌బాస్ విన్నర్‌గా ప్రేరణ పేరు బలంగా వినిపించింది. కానీ గౌతమ్ కృష్ణ ఎంట్రీతో సీన్ మారింది. నిఖిల్, గౌతమ్, నబీల్‌లకు ఫైనల్ వరకు గట్టి పోటీ ఇచ్చింది. చివరలో లక్ కలిసిరాకపోవడంతో బిగ్‌బాస్ నుంచి ఎలిమినేట్ అయ్యింది.
30 లక్షల రెమ్యూనరేషన్...
బిగ్‌బాస్‌లో కంటెస్టెంట్‌గా పాల్గొన్నందుకు ప్రేరణ భారీగానే రెమ్యూనరేషన్ డిమాండ్ చేసినట్లు సమాచారం. వారానికి రెండు లక్షల చొప్పున మొత్తం 30 లక్షల వరకు ప్రేరణకు రెమ్యూనరేషన్ దక్కినట్లు చెబుతోన్నారు.
కృష్ణ ముకుంద మురారి సీరియల్
కృష్ణ ముకుంద మురారి సీరియల్‌తో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది ప్రేరణ. ఈ సీరియల్‌లో కృష్ణ అనే డాక్టర్ పాత్రలో కనిపించింది. అల్లరితనం, అమాయకత్వం కలబోసిన యువతిగా నాచురల్ యాక్టింగ్‌తో మెప్పించింది. కన్నడంలో రంగనాయకి అనే సీరియల్ చేసింది. కొన్ని కన్నడ సినిమాల్లో కీలక పాత్రలు చేసింది.