Bigg Boss Priyanka Singh: హీరోయిన్‌గా బిగ్‌బాస్ ప్రియాంక సింగ్ ఎంట్రీ - కామెడీ మూవీకి గ్రీన్‌సిగ్న‌ల్‌-bigg boss priyanka singh to debut as heroine with ghantasala viswanath movie ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Bigg Boss Priyanka Singh: హీరోయిన్‌గా బిగ్‌బాస్ ప్రియాంక సింగ్ ఎంట్రీ - కామెడీ మూవీకి గ్రీన్‌సిగ్న‌ల్‌

Bigg Boss Priyanka Singh: హీరోయిన్‌గా బిగ్‌బాస్ ప్రియాంక సింగ్ ఎంట్రీ - కామెడీ మూవీకి గ్రీన్‌సిగ్న‌ల్‌

Nelki Naresh Kumar HT Telugu
Jan 11, 2025 01:48 PM IST

Bigg Boss Priyanka Singh: బిగ్‌బాస్ బ్యూటీ ప్రియాంక సింగ్ హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తోంది. ఓ యూత్‌ఫుల్ ఎంట‌ర్‌టైన‌ర్ మూవీ చేస్తోంది. ఈ సినిమాతో టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఘంట‌సాల విశ్వ‌నాథ్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతోన్నాడు.

బిగ్‌బాస్ బ్యూటీ ప్రియాంక సింగ్
బిగ్‌బాస్ బ్యూటీ ప్రియాంక సింగ్

Bigg Boss Priyanka Singh: బిగ్‌బాస్ బ్యూటీ ప్రియాంక సింగ్ హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తోంది. తెలుగులో ఓ కామెడీ మూవీ చేయ‌బోతున్న‌ది. యూత్‌ఫుల్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కుతోన్న ఈ మూవీకి ఘంట‌సాల విశ్వ‌నాథ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. మ్యూజిక్ డైరెక్ట‌ర్ అయిన ఘంట‌సాల విశ్వ‌నాథ్ ఈ సినిమాతోనే ద‌ర్శ‌కుడిగా టాలీవుడ్‌కు ప‌రిచ‌యం అవుతోన్నారు. ఈ సినిమాలో ప్రియాంక సింగ్‌తో పాటు ఆదర్శ్ , అశ్రీత్, ప్రియాంక సింగ్, పూజిత కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్‌ను జ‌రుపుకుంటోంది.

yearly horoscope entry point

లింగ బేధాల‌తో...

ఈ సందర్భంగా ప్రియాంక సింగ్ మాట్లాడుతూ... “సంగీత దర్శకుడైన ఘంట‌సాల విశ్వ‌నాథ్‌ మొదటిసారి డైరెక్ష‌న్ చేస్తూ డిఫ‌రెంట్ కాన్సెప్ట్‌తో ఈ మూవీ తెర‌కెక్కిస్తోన్నాడు సొసైటీలోని లింగ బేధాల‌ను వినోదాత్మ‌క పంథాలో ఈ మూవీలో చూపించ‌బోతున్నాం. కామెడీ తో పాటు నా క్యారెక్ట‌ర్ చాలా కొత్త‌గా ఉంటుంది. అందరికి నచ్చుతుందని అనుకుంటున్నాను. ఈ రోజుల్లో ఇటువంటి సినిమాలు రావడం లేదు. కాబట్టి ఈ సినిమా ఎంతో స్పెషల్ గా ఉండ‌బోతుంద‌ని న‌మ్ముతున్నా” అని తెలిపింది.

యుఎస్ లో షూటింగ్…

“ఈ సినిమా షూటింగ్‌ను డిసెంబర్ 26న మొద‌లుపెట్టాం. 15 రోజుల షూట్‌తో స‌గం టాకీపార్ట్ పూర్త‌యింది. మిగతా సగభాగం షూటింగ్ కోసం యుఎస్ వెళ్తున్నాము. టెక్నాలజీ, ఎమోషన్స్‌ లింగ సమానత్వం అంశాల‌ను ట‌చ్ చేస్తూ క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ మూవీ రూపొందుతోంది. ఈ ఏడాది ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది” అని డైరెక్ట‌ర్ ఘంట‌సాల విశ్వ‌నాథ్ అన్నాడు. వేణుబాబు నిర్మాతగా వ్య‌వ‌హ‌రిస్తోన్న ఈ మూవీకి పవన్ చరణ్, జీవీ సంగీతాన్ని అందిస్తున్నారు. దిలీప్ కుమార్ చిన్నయ్య సినిమాటోగ్ర‌ఫీ స‌మ‌కూర్చుతున్నారు.

మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా ఎటు చూసిన నువ్వే, కెమిస్ట్రీతోపాటు మ‌రికొన్ని సినిమాల‌కు ఘంట‌సాల విశ్వ‌నాథ్ ప‌నిచేశాడు.

జ‌బ‌ర్ధ‌స్థ్‌తో పాపుల‌ర్‌...

ట్రాన్స్‌జెండ‌ర్ అయిన ప్రియాంక సింగ్ బిగ్‌బాస్ తెలుగు సీజ‌న్ 5లో కంటెస్టెంట్‌గా పాల్గొన్న‌ది. జ‌బ‌ర్ధ‌స్థ్ షో ద్వారా పాపుల‌ర్ అయిన ప్రియాంక సింగ్ బిగ్‌బాస్‌లో ఛాన్స్ ద‌క్కించుకున్న‌ది. సాయితేజ‌గా జ‌బ‌ర్ధ‌స్థ్ షోలో పాల్గొన్న ప్రియాంక సింగ్ ఆ త‌ర్వాత స‌ర్జ‌రీ చేసుకొని పూర్తిగా అమ్మాయిగా మారిపోయింది.

బిగ్‌బాస్ సీజ‌న్ 5

బిగ్‌బాస్ సీజ‌న్ 5లో ప‌ద‌మూడు వారాల పాటు కొన‌సాగింది ప్రియాంక సింగ్‌. ఫైన‌ల్ ముంగిట హౌజ్ నుంచి ఎ లిమినేట్ అయ్యింది. బిగ్‌బాస్ కంటెస్టెంట్‌గా ఇర‌వై ఐదు ల‌క్ష‌ల‌కుపైనే ప్రియాంక సింగ్ రెమ్యూన‌రేష‌న్ అందుకున్న‌ట్లు స‌మాచారం.

Whats_app_banner