Hathya: కొడుకు పుట్టిన తర్వాత మళ్లీ సినిమాల్లోకి బిగ్ బాస్ బ్యూటి రీ ఎంట్రీ.. ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్‌గా హత్య-bigg boss pooja ramachandran re entry with hathya after son crime investigative thriller hathya teaser release event ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Hathya: కొడుకు పుట్టిన తర్వాత మళ్లీ సినిమాల్లోకి బిగ్ బాస్ బ్యూటి రీ ఎంట్రీ.. ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్‌గా హత్య

Hathya: కొడుకు పుట్టిన తర్వాత మళ్లీ సినిమాల్లోకి బిగ్ బాస్ బ్యూటి రీ ఎంట్రీ.. ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్‌గా హత్య

Sanjiv Kumar HT Telugu
Jan 10, 2025 10:54 AM IST

Pooja Ramachandran In Hathya Teaser Release Event: బిగ్ బాస్ తెలుగు సీజన్ 2, స్వామిరారా సినిమాతో క్రేజ్ తెచ్చుకున్న పూజా రామచంద్రన్ కొడుకు పుట్టిన తర్వాత రీ ఎంట్రీ ఇచ్చిన సినిమా హత్య. ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన హత్య టీజర్ రిలీజ్ ఈవెంట్‌లో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.

కొడుకు పుట్టిన తర్వాత మళ్లీ సినిమాల్లోకి బిగ్ బాస్ బ్యూటి రీ ఎంట్రీ.. ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్‌గా హత్య
కొడుకు పుట్టిన తర్వాత మళ్లీ సినిమాల్లోకి బిగ్ బాస్ బ్యూటి రీ ఎంట్రీ.. ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్‌గా హత్య

Pooja Ramachandran In Hathya Teaser Release Event: నిఖిల్, స్వాతి జంటగా నటించిన స్వామిరారా సినిమాలో సైడ్ హీరోయిన్‌గా మంచి క్రేజ్ తెచ్చుకుంది నటి పూజా రామచంద్రన్. అనంతరం నాని హోస్ట్ చేసిన బిగ్ బాస్ తెలుగు సీజన్ 2లో పాల్గొని మరింతగా పాపులర్ అయింది ఈ ముద్దుగుమ్మ.

yearly horoscope entry point

హత్య టీజర్ రిలీజ్

దక్షిణాది సినిమాల్లో విలన్‌గా నటించే జాన్ కొకెన్‌ను పెళ్లి చేసుకున్న పూజా రామచంద్రన్ వైవాహిక జీవితాన్ని ఆస్వాదించింది. అనంతరం ఆమెకు ఒక బాబు కూడా జన్మించాడు. ఇప్పుడు కొడుకు పుట్టిన తర్వాత సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తోంది పూజా రామచంద్రన్. క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన హత్య టీజర్ తాజాగా రిలీజ్ అయింది. ఈ ఈవెంట్‌లో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది పూజా రామచంద్రన్.

సినిమాను మార్చేసే పాత్ర

న‌టి పూజా రామ‌చంద్ర‌న్ మాట్లాడుతూ "నాకు కొడుకు పుట్టిన తర్వాత నటించిన తొలి సినిమా ఇది. చాలా మంది నాకు సినిమాలు ఆఫ‌ర్ చేసిన నో చెబుతూ వ‌చ్చాను. అయితే డైరెక్టర్ విద్య‌తో మాట్లాడిన త‌ర్వాత .. ఫుల్ లెంగ్త్ క్యారెక్ట‌ర్ కాక‌పోయినా త‌ప్ప‌కుండా చేస్తాన‌ని చెప్పి మరీ యాక్ట్ చేశాను. నాది కీ రోల్‌. సినిమానంత మార్చేసే చాలా ముఖ్య‌మైన పాత్ర‌లో న‌టించాను" అని తెలిపింది.

డిఫరెంట్ మూవీతో

"చాలా కాలం త‌ర్వాత హ‌త్య వంటి డిఫ‌రెంట్ మూవీతో తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాను. నాకు ఇంత మంచి అవ‌కాశం ఇచ్చిన డైరెక్ట‌ర్ శ్రీవిద్య‌కి థాంక్స్‌. ర‌వివ‌ర్మ అద్భుత‌మైన న‌టుడు. శ్రీవిద్య ఎక్స్‌లెంట్ డైరెక్ట‌ర్‌. త‌ను ఇండ‌స్ట్రీలో ఇంకా ఉన్న‌త శిఖ‌రాల‌ను చేరుకోవాల‌ని కోరుకుంటున్నాను" అని పూజా రామచంద్రన్ పేర్కొంది.

నెక్ట్స్ లెవెల్‌కు తీసుకెళ్లారు

"అంద‌రి ద‌గ్గ‌రి నుంచి బెస్ట్ ఔట్‌పుట్‌ను రాబ‌ట్టుకుంది. అభిరాజ్ ప్ర‌తీ ఫ్రేమ్‌ను బ్యూటీఫుల్‌గా క్యాప్చర్ చేశారు. న‌రేష్ త‌న మ్యూజిక్‌తో సినిమాను నెక్ట్స్ లెవ‌ల్‌కు తీసుకెళ్లారు. అంద‌రికీ థాంక్స్‌" అని బిగ్ బాస్ బ్యూటి పూజా రామచంద్రన్ చెప్పుకొచ్చింది.

సైకలాజికల్ థ్రిల్లర్‌తో మెప్పించి

ఇదిలా ఉంటే, ప్రస్తుతం థ్రిల్లర్ జానర్ చిత్రాలకు మంచి డిమాండ్ ఉందన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ‘మధ’ అంటూ సైకలాజికల్ థ్రిల్లర్‌తో అందరినీ మెప్పించిన శ్రీ విద్య బసవ ‘హత్య’ అనే మరో థ్రిల్లర్ మూవీతో ప్రేక్ష‌కుల‌ను మెప్పించ‌టానికి సిద్ధ‌మ‌వుతున్నారు.

హత్య నటీనటులు

హత్య సినిమా జ‌న‌వ‌రి 24న రిలీజ్‌కి రెడీ అవుతోంది. ఈ సినిమాను మహాకాళ్‌ పిక్చర్స్ పతాకంపై ఎస్ ప్రశాంత్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ధన్య బాలకృష్ణ, పూజా రామచంద్రన్, రవి వర్మ ప్రధాన పాత్రల్లో నటించారు. గురువారం (జనవరి 9) హత్య టీజ‌ర్ విడుద‌ల కార్య‌క్ర‌మం హైద‌రాబాద్‌లో జ‌రిగింది. ప్ర‌ముఖ న‌టుడు ర‌వివ‌ర్మ చేతుల మీదుగా టీజ‌ర్ విడుద‌లైంది.

Whats_app_banner