Bigg Boss Winner: బిగ్ బాస్ విన్నర్ ఓవరాక్షన్.. యూట్యూబర్‌ను దారుణంగా కొడుతూ.. వీడియో చూసి ఫ్యాన్స్ సీరియస్
Bigg Boss Winner: బిగ్ బాస్ ఓటీటీ 2 విన్నర్ ఎల్విష్ యాదవ్ మరోసారి ఓవరాక్షన్ చేశాడు. ఓ యూట్యూబర్ ను దారుణంగా కొట్టిన వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు అతన్ని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
Bigg Boss Winner: బిగ్ బాస్ గెలిచి సెలబ్రిటీలుగా మారిపోతున్న కొందరు వ్యక్తులు పబ్లిగ్గా రెచ్చిపోతున్నారు. ఏకంగా వ్యక్తులపై దాడులు చేస్తున్నారు. తాజాగా బిగ్ బాస్ ఓటీటీ 2 విన్నర్ అయిన ఎల్విష్ యాదవ్.. ఓ యూట్యూబర్ ను దారుణంగా కొట్టిన వీడియో బయటకు వచ్చింది. గురువారం (మార్చి 7) ఈ దాడి జరగగా.. బాధితుడైన యూట్యూబర్ మాక్స్‌టెర్న్ (సాగర్ ఠాకూర్) శుక్రవారం ఈ వీడియోను రిలీజ్ చేశాడు.
ఎల్విష్ ఓవరాక్షన్
ఎల్విష్ యాదవ్ బిగ్ బాస్ ఓటీటీ రెండో సీజన్ విన్నర్. తరచూ ఇలాంటి వివాదాలతో అతడు వార్తల్లో నిలుస్తున్నాడు. తాజాగా బయటకు వచ్చిన వీడియోలో ఎల్విష్.. మ్యాక్స్‌టెర్న్ ఉన్న ఓ స్టోర్ లోకి ఏడెనిమిది మందితో కలిసి వెళ్లి అతనిపై దాడి చేశాడు. తనను కలవడానికి వస్తున్నాడనుకొని వెల్కమ్ చెప్పడానికి వెళ్లిన యూట్యూబర్ ను ఎల్విష్ చెంపపై బలంగా కొట్టాడు.
దీంతో సదరు యూట్యూబర్ కూడా ఎదురు దాడి చేయడానికి ప్రయత్నించాడు. అయితే ఎల్విష్ తోపాటు అతని వెంట వచ్చిన వ్యక్తులు అతన్ని దారుణంగా కొట్టారు. ఎల్విష్ తన మోకాలితో మ్యాక్స్‌టెర్న్ ను బలంగా తన్నడం కూడా వీడియోలో కనిపించింది. ఐదు నిమిషాలకుపైగా ఉన్న ఈ వీడియోను శుక్రవారం (మార్చి 8) బాధితుడు సోషల్ మీడియోలో అప్ లోడ్ చేశాడు.
ఈ వీడియో వైరల్ అవడంతో ఎల్విష్ ను అరెస్ట్ చేయాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. తనను ఒక్కడిని చేసి ఎల్విష్, అతని మనుషులు దాడి చేశారని, ఇందులో తనకు గాయాలయ్యాయని తర్వాత మరో వీడియోలో మ్యాక్స్‌టెర్న్ చెప్పాడు.
ఎల్విష్ ఎందుకు దాడి చేశాడంటే..
ఎల్విష్ ఇలా దాడి చేయడం వెనుక అంతకుముందు యూట్యూబర్ మ్యాక్స్‌టెర్న్ చేసిన కామెంట్సే కారణమని వార్తలు వస్తున్నాయి. ఎల్విష్ యాదవ్, మునావర్ ఫరూఖీ ఫ్రెండ్షిప్ పై అతడు అభ్యంతర కామెంట్స్ చేసినట్లు తెలిసింది. ఈ విషయం ఎల్విష్ కు తెలియడంతో నేరుగా అతని దగ్గరికి వెళ్లి దాడి చేశాడు. అయితే ఎల్విస్ ఇలా వ్యక్తులపై దాడి చేయడం ఇదే తొలిసారి కాదు.
ఈ మధ్యే అతను మరో వ్యక్తినీ కొట్టినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ వీడియో బయటకు రాగానే నెటిజన్లు తీవ్రంగా మండిపడ్డారు. ఓ మైనర్ పై చేయి చేసుకున్న ఎల్విష్ ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. అతనిపై, అతని టీమ్ పై క్రిమినల్ కేసులు పెట్టాలనీ వాళ్లు అంటున్నారు. అయితే ఈ వీడియోపై ఎల్విష్ నుంచి ఇప్పటి వరకూ ఎలాంటి ప్రకటన రాలేదు.