Bigg Boss: శ్రీ సత్య, మెహూబూబ్ కెమిస్ట్రీ చాలా బాగుంది, 10 మిలియన్ వ్యూస్ కొడుతుంది: బిగ్ బాస్ నాగ మణికంఠ, గీతూ రాయల్
Bigg Boss Contestants On Sri Satya Mehaboob Nuvve Kavali Song: బిగ్ బాస్ కంటెస్టెంట్స్ శ్రీ సత్య, మెహబూబ్ జోడీ కట్టిన రొమాంటిక్ సాంగ్ నువ్వే కావాలి. ఈ సాంగ్ లాంచ్ కార్యక్రమానికి హాజరు అయిన బిగ్ బాస్ మణికంఠ, గీతూ రాయల్, గౌతమ్, కృష్ణ ఇతరులు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
Bigg Boss Contestants About Sri Satya Mehaboob Chemistry: బిగ్ బాస్ ఫేమ్ మెహబూబ్ దిల్ సే, శ్రీ సత్య కలిసి చేసిన ప్రైవేట్ ఆల్బమ్ యూత్ ఫుల్ సాంగ్ నువ్వే కావాలి లాంచ్ ఇటీవల ఘనంగా జరిగింది. ఈ పాటకి సురేష్ బనిశెట్టి లిరిక్స్ అందించగా, భార్గవ్ రవడ డిఓపి, ఎడిటింగ్, డైరెక్షన్ అన్ని తానే అయి ఈ సాంగ్‌ను చిత్రీకరించారు.
బిగ్ బాస్ సెలబ్రిటీలంతా
ఈ సాంగ్ మనీష్ కుమార్ మ్యూజిక్ అందించి పాట పాడగా, వైషు మాయ ఫిమేల్ వాయిస్‌కి ఆయనతో జతకట్టారు. యూరోప్‌లోని బార్సిలోన, మెక్సికో, పారిస్ వంటి అద్భుతమైన లొకేషన్స్‌లో అందంగా రొమాంటిక్ సాంగ్ నువ్వే కావాలి పాటను చిత్రీకరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బిగ్ బాస్ సోహెల్, నోయల్, రాహుల్ సిప్లిగంజ్, రోల్ రైడా, గౌతమ్ కృష్ణ, ప్రియాంక, సిరి హన్మంతు, గీతు రాయల్, నాగ మణికంఠ హాజరయ్యారు.
ఇది కచ్చితంగా బెస్ట్
ఈ సందర్భంగా గౌతమ్ కృష్ణ మాట్లాడుతూ.. "నాకు మెహబూబ్, శ్రీ సత్య బిగ్ బాస్ ముందు నుంచే తెలుసు. అదేవిధంగా భార్గవ్‌తో నాకు ముందు నుంచే పరిచయం ఉంది. ఈ సాంగ్ చాలా అద్భుతంగా చిత్రీకరించారు. ఇప్పటివరకు నేను చూసిన ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్స్ అన్నిట్లో కల్లా ఇది కచ్చితంగా బెస్ట్‌గా నిలబడుతుంది" అని అన్నాడు.
టిక్ టాక్ మొదలుపెట్టి
"అద్భుతమైన లొకేషన్స్‌లో చాలా బాగా ఈ సాంగ్‌ని చిత్రీకరించారు. మహబూబ్ టిక్ టాక్ మొదలుపెట్టి యూట్యూబ్ వరకు ఎన్నో వీడియోస్, సాంగ్స్ కష్టపడి చేసి ఈ స్థాయికి వచ్చాడు. ఈ టీమ్ అందరికీ ఆల్ ద బెస్ట్ అండ్ కంగ్రాట్స్ తెలియజేస్తున్నాను" అని బిగ్ బాస్ తెలుగు 8 రన్నరప్ గౌతమ్ కృష్ణ తెలిపాడు.
ముందు చూపు ఎక్కువ
"మెహబూబ్ చాలా డెడికేటెడ్ అండ్ టాలెంటెడ్. ఏ పనైనా రిస్క్ గురించి ఆలోచించకుండా కష్టపడి పూర్తి చేస్తాడు. అదేవిధంగా ముందు చూపు ఎక్కువ. ఎవరి సపోర్ట్ లేకుండా తనని తాను ప్రూవ్ చేసుకుని ఎదిగిన వ్యక్తి. అందుకే తను చాలా మందికి ఇన్సిపిరేషన్" అని బిగ్ బాస్ తెలుగు 6 కంటెస్టెంట్ గీతూ రాయల్ తెలిపింది.
10 మిలియన్ వ్యూస్
"శ్రీ సత్య బయట నుంచే కాక తన మనసు కూడా చాలా మంచిది. తను కూడా అంతే హార్డ్ వర్కింగ్ అండ్ డిటర్మైండ్ పర్సన్. ఈ సాంగ్ విజువల్‌గా చాలా బాగుంది. కచ్చితంగా ప్రేక్షకులకు ఈ సాంగ్ నచ్చి పెద్ద సక్సెస్ అవుతుంది. 10 మిలియన్ వ్యూస్ కొడుతుంది అని ఆశిస్తున్నాను" అని గీతూ రాయల్ పేర్కొంది.
కెమిస్ట్రీ చాలా బాగుంది
బిగ్ బాస్ తెలుగు 8 కంటెస్టెంట్ నాగ మణికంఠ మాట్లాడుతూ.. "సురేష్ గారు ఈ పాట లిరిక్స్ చాలా బాగా రాశారు. మనీష్ అందించిన మ్యూజిక్ అండ్ తను ఈ పాట పాడిన విధానం సూపర్. భార్గవ్ డైరెక్షన్ అండ్ లొకేషన్స్ చాలా బాగున్నాయి. మెహబూబ్ అండ్ శ్రీ సత్య కెమిస్ట్రీ చాలా బాగుంది. కచ్చితంగా ఈ సాంగ్ ప్రేక్షకులకు నచ్చుతుంది అని ఆశిస్తున్నాను" అని పేర్కొన్నాడు.
సంబంధిత కథనం
టాపిక్