Bigg Boss Intimate Video: బిగ్ బాస్ హౌజ్‌లో అర్ధరాత్రి రొమాన్స్.. భార్యను చూసి ఆపుకోలేకపోయిన కంటెస్టెంట్.. వీడియో వైరల్
Bigg Boss Intimate Video: బిగ్ బాస్ హౌస్ లో రొమాన్స్ వీడియో ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. బిగ్ బాస్ 18 సీజన్ లో భాగంగా ఫ్యామిలీ వీక్ నడుస్తుండగా.. ఓ కంటెస్టెంట్ తన భార్యను చూసి ఆపుకోలేకపోయాడు. వీళ్ల మిడ్ నైట్ రొమాన్స్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Bigg Boss Intimate Video: బిగ్ బాస్ 18వ సీజన్ ఎంతో వివాదాస్పదమైంది. ఈ సీజన్ చివరికి వచ్చేసింది. అయితే తాజాగా ఫ్యామిలీ వీక్ నడుస్తుండగా.. ఇందులో వివియన్ డిసేనా అనే కంటెస్టెంట్ చేసిన పని ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. ఫ్యామిలీ వీక్ లో భాగంగా చాలా రోజుల తర్వాత తనను కలవడానికి వచ్చిన భార్యతో అర్ధరాత్రి బెడ్ పై రొమాన్స్ చేస్తున్న వీడియో వైరల్ అయింది.
భార్యతో వివియన్ రొమాన్స్
టీవీలో అత్యంత వివాదాస్పదమైన షో బిగ్ బాస్ 18 ఇప్పుడు ఫినాలే దిశగా వెళ్తుండటంతో ప్రేక్షకులు మరింత ఎంజాయ్ చేస్తున్నారు. ఈ వారం హౌస్ లో చాలా ఎమోషనల్ మూమెంట్స్ కనిపించాయి. బిగ్ బాస్ హౌస్ లో ఫ్యామిలీ వీక్ నడుస్తోంది. కంటెస్టెంట్లను కలిసేందుకు వాళ్ల కుటుంబ సభ్యులు వచ్చారు. అందులో భాగంగా వివియన్ డిసేనా భార్య నూరాన్ అలీ, కూతురు కూడా వచ్చారు. వాళ్లను చాలా రోజుల తర్వాత చూసిన వివియన్ ఎమోషనల్ అయ్యాడు.
అంతేకాదు భార్యను చూసి అతడు ఆపుకోలేకపోయినట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో చూస్తే తెలుస్తోంది. మిడ్ నైట్ వీళ్లిద్దరూ బెడ్ పై పడుకొని ఘాటు రొమాన్స్ లో మునిగినట్లు కనిపిస్తోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు వివియన్ ను ట్రోల్ చేస్తున్నారు. ఆ వీడియోలో వివియన్, నూరాన్ ఇంటిమేట్ అయినట్లు స్పష్టంగా తెలుస్తోంది.
నెటిజన్ల ట్రోలింగ్
బిగ్ బాస్ హౌస్ లో ఆ మధ్య ఇలాంటిదే ఓ వీడియో తెగ వైరల్ అయిన విషయం తెలిసిందే. ఇద్దరు కంటెస్టెంట్లు ఇంటిమేట్ అయిన సీన్ అది. అయితే అది ఫేక్ వీడియో అని తర్వాత తేలింది. దీనిపై బిగ్ బాస్ నిర్వాహకులు కూడా అప్పట్లో వివరణ ఇవ్వాల్సి వచ్చింది. కానీ తాజాగా బిగ్ బాస్ 18 హౌజ్ లో నుంచి బయటకు వచ్చిన ఈ వీడియో మాత్రమే నిజమైనదే.
కంటెస్టెంట్ వివియన్, అతని భార్య రొమాన్స్ వీడియో చూసిన పలువురు నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. మరో 18 రోజుల్లో ఇంటికెళ్తావ్ వివియన్.. కాస్త ఓపిక పట్టు అని ఒకరు కామెంట్ చేయడం గమనార్హం. ఆమె అతని భార్యే కదా.. అందులో తప్పేముంది అని మరొకరు అన్నారు. ఆ వీడియోలో ఇద్దరూ బెడ్ పై పడుకొని ఉన్నారు. కాసేపటి తర్వాత నూర్ దుప్పట్లోకి దూరి అతన్ని గట్టిగా హగ్ చేసుకున్నట్లు అందులో కనిపిస్తోంది.
బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చే కంటెస్టెంట్లు వారాలు, నెలల పాటు కుటుంబాలకు దూరంగా ఉండటం వల్ల వాళ్లు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటారో దీనిని బట్టి అర్థమవుతోందని మరికొందరు నెటిజన్లు కామెంట్స్ చేశారు.