Bigg Boss Telugu: కేక్ టాస్క్.. స్విమ్మింగ్ పూల్‍లో డ్యాన్స్.. బిగ్‍బాస్‍లో ఫుల్ జోష్: వీడియో-bigg boss gives cake task for amardeep and swimming pool dance for contestants ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Bigg Boss Gives Cake Task For Amardeep And Swimming Pool Dance For Contestants

Bigg Boss Telugu: కేక్ టాస్క్.. స్విమ్మింగ్ పూల్‍లో డ్యాన్స్.. బిగ్‍బాస్‍లో ఫుల్ జోష్: వీడియో

Chatakonda Krishna Prakash HT Telugu
Dec 05, 2023 02:52 PM IST

Bigg Boss Telugu 7 Day 93 Promo: బిగ్‍బాస్ హౌస్‍లో కంటెస్టెంట్లు స్విమ్మింగ్ పూల్‍లో డ్యాన్సులు చేశారు. అమర్‌కు కేక్‍ టాస్కును ఇచ్చారు బిగ్‍బాస్.

Bigg Boss Telugu: కేక్ టాస్క్.. స్విమ్మింగ్ పూల్‍లో డ్యాన్స్.. బిగ్‍బాస్‍లో ఫుల్ జోష్: వీడియో
Bigg Boss Telugu: కేక్ టాస్క్.. స్విమ్మింగ్ పూల్‍లో డ్యాన్స్.. బిగ్‍బాస్‍లో ఫుల్ జోష్: వీడియో

Bigg Boss Telugu 7 Day 93 Promo: హాట్‍హాట్‍గా జరుగుతున్న బిగ్‍బాస్ తెలుగు 7వ సీజన్‍లో కాస్త సరదా సమయం వచ్చింది. కంటెస్టెంట్లకు ఆటవిడుపుగా ఉండేలా కొన్ని ఫన్నీ టాస్కులను బిగ్‍బాస్ ఇచ్చారు. నేటి (నవంబర్ 5) ఎపిసోడ్‍‍ కాస్త సరదాగా సాగనుంది. ప్రోమోను చూస్తే ఇది అర్థమవుతోంది. స్విమ్మింగ్ పూల్‍లో కంటెస్టెంట్లు డ్యాన్స్ చేయనున్నారు. వివరాలివే..

ట్రెండింగ్ వార్తలు

అందరూ చిల్ అవడానికి హౌస్‍లో పార్టీ అవసరం అని భావిస్తున్నట్టు అమర్‌దీప్‍తో బిగ్‍బాస్ చెప్పారు. పార్టీలో ఏం ఉండొచ్చని అనుకుంటున్నారని ప్రశ్నించారు. దీంతో ఎప్పటిలాగే చిప్స్, కూల్ డ్రింక్స్ ఇలా ఏవైనా ఉండొచ్చని అనుకుంటున్నట్టు అమర్ చెప్పారు. “మీరు చేసుకునే పార్టీల్లో కేవలం ఇవే ఉంటాయా అమర్” అని బిగ్‍బాస్ పంచ్ వేశారు.

ఓ కేక్ ఇచ్చి దాన్ని మొత్తం 15 నిమిషాల్లో తినేయాలని అమర్‌కు బిగ్‍బాస్ టాస్క్ ఇచ్చారు. 15 నిమిషాల్లో మొత్తం తింటే.. తోటి కంటెస్టెంట్లకు కూడా వేరే కేక్‍ తినే అవకాశం లభిస్తుందని చెప్పారు. దీంతో అమర్ గబగబా కేక్ తిన్నారు. కేక్‍ను తెలుగులో ఏంటారని బిగ్‍బాస్ ప్రశ్నించగా.. బిక్కముఖం వేశారు అమర్.

ఆ తర్వాత కంటెస్టెంట్లకు పూల్ డ్యాన్స్ టాస్క్ ఇచ్చారు బిగ్‍బాస్. స్విమ్మింగ్ పూల్‍లోకి దూకి డ్యాన్స్ చేయాలని చెప్పారు. మిగతా వారి కంటే ఆలస్యంగా పూల్‍లో దూకిన వారు ఈ పార్టీ నుంచి తప్పుకుంటారని అన్నారు. అందరూ ఒక్కసారిగా పూల్ వైపు పరిగెత్తారు. అయితే, అందరి కంటే అమర్ చివరగా పూల్‍లో దూకాడు. దీంతో తొలి రౌండ్‍లో అమర్ ఔటయ్యారు. తర్వాతి రౌండ్‍లో శోభ ఔట్ అయ్యారు. చివరగా శివాజీ, యావర్ పోటీలో నిలిచారు. ఆ తర్వాత నాది నక్లెస్ గొలుసు పాటకు కంటెస్టెంట్లతా ఫుల్ జోష్‍తో డ్యాన్స్ చేశారు.

ఇక, మొదటి ప్రోమోలో పల్లవి ప్రశాంత్, అమర్ దీప్ గొడవ పడినట్టు ఉంది. తనకు అంత స్ట్రాటజీలు ఉంటే తాను ఇక్కడ ఉండేవాడిని కాదని అమర్ అన్నాడు. చేతికి గాజులు వేసుకొని ఉన్నాను కదా అని ప్రశాంత్‍తో అమర్ వారించారు. ప్రశాంత్ కూడా అదే మాట అన్నారు. గతంలో ‘నువ్వు మగాడివి’ అని ప్రశాంత్‍ను అన్న విషయంపై ఈ గొడవ జరిగింది. ఈ మొత్తం విషయం నేటి ఎపిసోడ్‍లో ఉండనుంది. ప్రోమోలు ఇక్కడ చూడండి.

WhatsApp channel
హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే బిగ్‌బాస్ 7 తెలుగు, ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.