Comedy Movie: యూట్యూబ్‌లోకి బిగ్‌బాస్ కంటెస్టెంట్ తెలుగు రొమాంటిక్ కామెడీ మూవీ - ఫ్రీగా స్ట్రీమింగ్‌-bigg boss fame sohel telugu romantic comedy movie bootcut balaraju free streaming now on youtube ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Comedy Movie: యూట్యూబ్‌లోకి బిగ్‌బాస్ కంటెస్టెంట్ తెలుగు రొమాంటిక్ కామెడీ మూవీ - ఫ్రీగా స్ట్రీమింగ్‌

Comedy Movie: యూట్యూబ్‌లోకి బిగ్‌బాస్ కంటెస్టెంట్ తెలుగు రొమాంటిక్ కామెడీ మూవీ - ఫ్రీగా స్ట్రీమింగ్‌

Nelki Naresh HT Telugu

బిగ్‌బాస్ ఫేమ్ సోహెల్ హీరోగా న‌టించిన బూట్‌క‌ట్ బాల‌రాజు మూవీ యూట్యూబ్‌లో రిలీజైంది. ఈ రొమాంటిక్ కామెడీ మూవీ ఫ్రీగా స్ట్రీమింగ్ అవుతోంది. ఈ తెలుగు మూవీలో మేఘ‌లేఖ‌, సిరి హ‌నుమంతు హీరోయిన్లుగా న‌టించారు.

కామెడీ మూవీ

బిగ్‌బాస్ ఫేమ్ సోహెల్ హీరోగా న‌టించిన రొమాంటిక్ కామెడీ మూవీ బూట్‌క‌ట్ బాల‌రాజు యూట్యూబ్‌లో రిలీజైంది. ఎలాంటి రెంట‌ల్ ఛార్జీలు లేకుండా ఫ్రీగా స్ట్రీమింగ్ అవుతోంది. మేఘ‌లేఖ, సిరి హ‌నుమంతు హీరోయిన్లుగా న‌టించిన ఈ మూవీలో సునీల్‌, ఇంద్ర‌జ‌, బిగ్‌బాస్ అవినాష్ కీల‌క పాత్ర‌లు పోషించారు. శ్రీను కోనేటి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో…

గ‌త ఏడాది ఫిబ్ర‌వ‌రిలో బూట్‌క‌ట్ బాల‌రాజు మూవీ థియేట‌ర్ల‌లో రిలీజైంది. సోహైల్ క్రేజ్‌తో పాటు వెరైటీ ప్ర‌మోష‌న్స్‌తో ఈ చిన్న సినిమా తెలుగు ప్రేక్ష‌కుల్లో ఆస‌క్తిని రేకెత్తించింది. కామెడీ బాగానే ఉన్నా కాన్సెప్ట్‌లో కొత్త‌ద‌నం లోపించ‌డంతో క‌మ‌ర్షియ‌ల్‌గా ఆశించిన స్థాయిలో విజ‌యాన్ని అందుకోలేక‌పోయింది. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో ఫ‌న్ ల‌వ్‌స్టోరీగా ద‌ర్శ‌కుడు ఈ సినిమాను తెర‌కెక్కించాడు.

బూట్‌క‌ట్ బాల‌రాజు క‌థ ఇదే...

ఊరి పెద్ద అయిన ప‌టేల‌మ్మ (ఇంద్ర‌జ‌) కూతురు మ‌హాల‌క్ష్మిని (మేఖ‌లేఖ‌)అంద‌రూ గౌర‌విస్తుంటారు. బాల‌రాజుతో (సోహెల్) మ‌హాల‌క్ష్మికి మొద‌లైన స్నేహం ప్రేమ‌గా మారుతుంది. బాల‌రాజును కాలేజీలో సిరి అనే అమ్మాయి కూడా ఇష్ట‌ప‌డుతుంటుంది. సిరి కంటే ముందే బాల‌రాజుకు ప్ర‌పోజ్ చేస్తుంది మ‌హాల‌క్ష్మి. కూతురి ప్రేమ విష‌యం ప‌టేల‌మ్మ‌కు తెలిసిపోతుంది. ఎలెక్ష‌న్స్‌లో త‌న‌పై పోటీ చేసి స‌ర్పంచ్‌గా గెలిస్తేనే మ‌హాల‌క్ష్మిని ఇచ్చి పెళ్లి చేస్తాన‌ని బాల‌రాజుతో ఛాలెంజ్ చేస్తుంది ప‌టేల‌మ్మ‌. జులాయిగా ముద్ర‌ప‌డిన బాల‌రాజు ఎన్నిక‌ల్లో గెలిచాడా? మ‌హాల‌క్ష్మిని పెళ్లి చేసుకున్నాడా? లేదా? అన్న‌దే ఈ మూవీ క‌థ‌.

ప్రొడ్యూస‌ర్‌గా కూడా...

బూట్‌క‌ట్ బాల‌రాజు మూవీలో హీరోగా న‌టిస్తూనే ఈ మూవీని ప్రొడ్యూస్ చేశాడు సోహెల్. ఈ సినిమా అత‌డికి న‌ష్టాల‌ను మిగిల్చింది. ఈ రొమాంటిక్ కామెడీ మూవీకి సంక్రాంతికి వ‌స్తున్నాం ఫేమ్ భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందించాడు.

సీరియ‌ల్ యాక్ట‌ర్‌గా..,.

సీరియ‌ల్ యాక్ట‌ర్‌గా కెరీర్‌ను ప్రారంభించాడు సోహెల్. పసుకు కుంకుమ, నాతిచరామి,కృష్ణ‌వేణి సీరియ‌ల్స్ చేశాడు. బిగ్‌బాస్ తెలుగు సీజ‌న్ 4తో పాపుల‌ర్ అయ్యాడు. ఈ సీజ‌న్‌లో ఫైన‌ల్ చేరుకొని సెకండ్ ర‌న్న‌ర‌ప్‌గా నిలిచాడు.

బిగ్‌బాస్ ద్వారా వ‌చ్చిన గుర్తింపుతో హీరోగా వ‌రుస‌గా అవ‌కాశాల‌ను అందుకున్నాడుసోహెల్ . ల‌క్కీ ల‌క్ష్మ‌ణ్, ఆర్గానిక్ మామ హైబ్రీడ్ అల్లుడు, మిస్ట‌ర్ ప్రెగ్నెంట్‌తో పాటు మ‌రికొన్ని సినిమాలు చేశాడు. అవేవీ అత‌డికి విజ‌యాల‌ను తెచ్చిపెట్ట‌లేక‌పోయాయి.

Nelki Naresh

TwittereMail
నెల్కి న‌రేష్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. సినిమా, టీవీ రంగాల‌తో పాటు స్పోర్ట్స్‌కు సంబంధించిన రెగ్యుల‌ర్ అప్‌డేట్స్‌, రివ్యూల‌ను అందిస్తుంటారు. తెలంగాణ యూనివ‌ర్సిటీ లో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. గ‌తంలో న‌మ‌స్తే తెలంగాణ దిన‌ప‌త్రిక‌లో ప‌నిచేశారు. 2022 ఫిబ్ర‌వ‌రిలో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం