Telugu Serial: సడెన్‌గా బిగ్‌బాస్ కంటెస్టెంట్ తెలుగు సీరియల్ ఎండ్ - కారణం ఇదేనా!
Telugu Serial: బిగ్‌బాస్ ఫేమ్ రాజశేఖర్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న జాబిల్లి కోసం ఆకాశమల్లే సీరియల్‌కు త్వరలోనే శుభం కార్డు పడబోతున్నట్లు తెలిసింది. జీ తెలుగులో ఈ సీరియల్ టెలికాస్ట్ అవుతోంది. డిసెంబర్ 31న ఈ సీరియల్ క్లైమాక్స్ ఎపిసోడ్ టెలికాస్ట్ కానున్నట్లు సమాచారం.
Telugu Serial: బిగ్‌బాస్ కంటెస్టెంట్ రాజశేఖర్ లీడ్ రోల్‌లో నటిస్తోన్న తెలుగు సీరియల్ జాబిల్లి కోసం ఆకాశమల్లే త్వరలోనే ముగియబోతున్నట్లు సమాచారం. ఈ సీరియల్‌కు అర్ధాంతరంగా జీ తెలుగు గుడ్‌బై చెప్పడం బుల్లితెర ఫ్యాన్స్‌లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇప్పటికే ఈ సీరియల్‌కు సంబంధించి క్లైమాక్స్ ఎపిసోడ్ షూటింగ్ పూర్తయినట్లు తెలిసింది. డిసెంబర్ 31న జాబిల్లి కోసం ఆకాశమల్లే సీరియల్ క్లైమాక్స్ ఎపిసోడ్ టెలికాస్ట్ అవుతోందని చెబుతోన్నారు.
![yearly horoscope entry point](https://telugu.hindustantimes.com/static-content/1y/astro-pages-content/astro-entry-point-mobile.png)
383 ఎపిసోడ్స్...
2023 అక్టోబర్‌లో ఈ సీరియల్ ప్రారంభమైంది. ఇప్పటివరకు 383 ఎపిసోడ్స్ టెలికాస్ట్ అయ్యాయి. 386 ఎపిసోడ్స్‌తో ఈ సీరియల్ ముగియబోతున్నట్లు సమాచారం. జాబిల్లి కోసం ఆకాశమల్లే సీరియల్ ప్రస్తుతం జీ తెలుగులో మధ్యాహ్నం మూడు గంటలకు ప్రసారమవుతోంది.
చామంతి సీరియల్ కోసం...
జనవరి 1 నుంచి జీ తెలుగులో చామంతి పేరుతో కొత్త సీరియల్ ప్రారంభం కాబోతోంది. ఈ సీరియల్ కోసమే జాబిల్లి కోసం ఆకాశమల్లే సీరియల్‌కు మేకర్స్ ముగింపు పలకబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆరంభంలో డ్రామా, ఎమోషన్స్‌తో సీరియల్ ఫ్యాన్స్‌ను ఆకట్టుకున్నది ఈ సీరియల్. ఆ తర్వాత క్రేజ్ తగ్గుముఖం పట్టింది. టీఆర్‌పీ కూడా డౌన్ అయ్యింది. లేటెస్ట్ టీఆర్‌పీలో ఈ సీరియల్ 2.21 రేటింగ్ మాత్రమే సొంతం చేసుకున్నది.
చామంతి సీరియల్ కోసం…
చామంతి సీరియల్ కోసం జాబిల్లి కోసం ఆకాశమల్లే సీరియల్‌కు ఎండ్ కార్డ్ వేయడంతో పాటు జానకిరామయ్యగారి మనవరాలు, త్రినయని సీరియల్స్ టైమింగ్‌ను జీ తెలుగు మార్చబోతున్నది. త్రినయని సీరియల్ రాత్రి ఎనిమిదిన్నర నుంచి మధ్యాహ్నం రెండు గంటలకు టెలికాస్ట్ కాబోతోంది. జాబిల్లి కోసం ఆకాశమల్లే సీరియల్ టైమింగ్స్‌లో జానకిరామయ్యగారి మనవరాలు ప్రసారం కాబోతోంది
మార్పులు చేసినా...
మూడు నెలల క్రితం ఈ సీరియల్ స్టోరీలో చాలా ఛేంజెస్ చేశారు మేకర్స్. కొత్త నటీనటులు, స్టోరీలైన్‌తో ట్విస్ట్ ఇచ్చారు. కానీ ఈ మార్పులు అంతగా ప్రేక్షకుల్ని మెప్పించలేకపోయాయి.
టాలీవుడ్‌లోకి ఎంట్రీ...
జాబిల్లి కోసం ఆకాశమల్లే సీరియల్‌లో రాజశేఖర్‌తో పాటు స్రవంతిక కీలక పాత్ర పోషించింది. తమిళ నటి అయిన స్రవంతిక ఈ సీరియల్‌తోనే టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ప్రిన్సి బాలకృష్ణన్, శివ పార్వతి, ఇంద్రనాగ్ ఇతర ముఖ్య పాత్రలు పోషించారు.
బిగ్‌బాస్ సీజన్ 6
జాబిల్లికోసం ఆకాశమల్లేతో పాటు తెలుగులో కళ్యాణ వైభోగమే, మనసంతా నువ్వే సీరియల్స్ చేశాడు రాజశేఖర్. బిగ్‌బాస్ తెలుగు సీజన్ 6లో ఓ కంటెస్టెంట్‌గా పాల్గొన్నాడు రాజశేఖర్. 84వ రోజు ఎలిమినేట్ అయ్యాడు.