మిత్రా శర్మ హీరోయిన్‌గా నటించిన వర్జిన్ బాయ్స్ మూవీ టీజర్ రిలీజైంది. గీతా నంద్ హీరోగా నటించిన ఈ మూవీలో బిగ్‌బాస్ శ్రీహాన్, రోనీత్, జెన్నిఫర్, అన్షుల కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ రొమాంటిక్ కామెడీ మూవీకి దయానంద్ దర్శకత్వం వహిస్తున్నాడు.
వర్జిన్ బాయ్స్ టీజర్ బోల్డ్, రొమాన్స్ అంశాలతో ఆకట్టుకుంటుంది. పక్కా వర్జినిటీ పొగొట్టుకుంటామని శ్రీహాన్ అతడి ఫ్రెండ్స్ శపథం చేసే సీన్‌తో ఫన్నీగా టీజర్ మొదలైంది. హీరోయిన్‌ను టీజర్‌లో గ్లామరస్‌గా చూపించారు. ఇక దబిడి దిబిడే అంటూ బాలకృష్ణ డైలాగ్‌ను టీజర్‌లో ఉపయోగించారు. హీరోహీరోయిన్ల కెమిస్ట్రీ, రొమాన్స్‌ను ఘాటుగా చూపించారు. బిగ్‌బాస్ శ్రీహాన్ కామెడీ ఈ టీజర్‌కు హైలైట్‌గా నిలిచింది.
యూత్‌ఫుల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా దర్శకుడు దయానంద్ ఈ మూవీని తెరకెక్కిస్తోన్నారు. యువతరం కోరుకునే అన్ని అంశాలు ఈ మూవీలో ఉండబోతున్నట్లు టీజర్ చూస్తుంటే తెలుస్తోంది. మోడ్రన్ రిలేషన్స్ ఎలా ఉంటున్నాయన్నది దర్శకుడు ఈ మూవీలో చూపించబోతున్నాడు. నటుడిగా బిగ్‌బాస్ శ్రీహాన్‌కు మంచి పేరు తీసుకొస్తుందని మేకర్స్ చెబుతోన్నారు. మిత్రా శర్మ క్యారెక్టర్‌లో డిఫరెంట్ వేరియేషన్స్ ఉంటాయని అంటున్నారు. ఈ మూవీకి .స్మరణ్ సాయి మ్యూజిక్ అందిస్తోండగా...వెంకట ప్రసాద్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తోన్నారు. త్వరలోనే ఈ మూవీ థియేటర్లలో రిలీజ్ కాబోతోంది.
నిర్మాత రాజా దరపునేని మాట్లాడుతూ.. "గతంలో టాలీవుడ్‌లో ఎన్నో మంచి యూత్ ఫుల్ ఎంటర్టైనర్ లు వచ్చాయి. వాటిని మైమరిపించేలా వర్జిన్ బాయ్స్ సినిమా ఉంటుందని అన్నారు. రొటీన్ కి భిన్నంగా మూవీ ఇది. ప్రారంభం నుంచి ముగింపు వరకు యూత్ బాగా ఎంజాయ్ చేస్తారు" అన్నారు.
బిగ్‌బాస్ తెలుగు నాన్‌స్టాప్‌లో ఓ కంటెస్టెంట్‌గా పాల్గొన్నది మిత్రా శర్మ. ఈ సీజన్‌లో ఫైనల్ చేరుకున్న మిత్రా శర్మ ఐదో రన్నరప్‌గా నిలిచింది. వర్జిన్ బాయ్స్ కంటే ముందు బాయ్స్ అనే సినిమా చేసింది.
వర్జిన్ బాయ్స్ మూవీలో శ్రీహాన్‌తో పాటు మరో బిగ్‌బాస్ కంటెస్టెంట్ ఆర్‌జే సూర్య కూడా కనిపించాడు.
సంబంధిత కథనం
టాపిక్