Madhura Nagarilo Serial on Star Maa: బిగ్‌బాస్ ఫేమ్ కీర్తి భ‌ట్ కొత్త సీరియ‌ల్ మ‌ధురాన‌గ‌రిలో ప్రారంభం - టైమింగ్స్ ఇవే-bigg boss fame keerthi bhat new serial madhura nagarilo timings deatails ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Bigg Boss Fame Keerthi Bhat New Serial Madhura Nagarilo Timings Deatails

Madhura Nagarilo Serial on Star Maa: బిగ్‌బాస్ ఫేమ్ కీర్తి భ‌ట్ కొత్త సీరియ‌ల్ మ‌ధురాన‌గ‌రిలో ప్రారంభం - టైమింగ్స్ ఇవే

Nelki Naresh Kumar HT Telugu
Mar 16, 2023 10:47 AM IST

Madhura Nagarilo Serial on Star Maa: బిగ్‌బాస్ ఫేమ్ కీర్తి భ‌ట్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తోన్న మ‌ధురాన‌గ‌రిలో డైలీ సీరియ‌ల్ స్టార్‌మా ఛానెల్‌లో ప్రారంభ‌మైంది. ఈ సీరియ‌ల్ టైమింగ్స్ ఏవంటే...

కీర్తి భ‌ట్
కీర్తి భ‌ట్

Madhura Nagarilo Serial on Star Maa: బిగ్‌బాస్ సీజ‌న్ 6తో మంచి గుర్తింపును సొంతం చేసుకున్న‌ది కీర్తిభ‌ట్‌. సెకండ్ ర‌న్న‌ర‌ప్‌గా నిలిచి ప్రేక్ష‌కాభిమానాన్ని చూర‌గొన్న‌ది. బిగ్‌బాస్ త‌ర్వాత కొత్త సీరియ‌ల్ మ‌ధురాన‌గ‌రిలోతో బుల్లితెర ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది కీర్తిభ‌ట్‌. స్టార్‌మాలో మార్చి 14 నుంచి ఈ సీరియ‌ల్ ప్రారంభ‌మైంది.

సోమ‌వారం నుంచి శ‌నివారం వ‌ర‌కు ప్ర‌తిరోజు మ‌ధ్యాహ్నం రెండు గంట‌ల‌కు స్టార్‌మాలో ఈ సీరియ‌ల్ టెలికాస్ట్ కానుంది. ఈ సీరియ‌ల్‌లో రాధిక అనే వెడ్డింగ్ ప్లాన‌ర్ పాత్ర‌లో కీర్తి భ‌ట్ న‌టిస్తోంది. అంద‌రికి పెళ్లి సంబంధాలు కుదిర్చే రాధిక జీవితంలో మాత్రం వివాహ బంధానికి చోటు ఎందుకు లేద‌నే క‌థాంశంతో ఈ సీరియ‌ల్ రూపొందుతోంది.

మ‌ధురాన‌గ‌రిలో సీరియ‌ల్‌లో నాగార్జున‌, ఆదిత్య రెడ్డి ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఏ హై చాహ‌తేన్ అనే హిందీ సీరియ‌ల్‌కు రీమేక్‌గా మ‌ధురాన‌గ‌రిలో సీరియ‌ల్ రూపొందింది. బిగ్‌బాస్ ద్వారా కీర్తికి వ‌చ్చిన పాపులారిటీ ఈ సీరియ‌ల్‌కు చాలా హెల్ప్ అవుతోంద‌ని మేక‌ర్స్ భావిస్తోన్నారు. కాగా తెలుగులో మ‌న‌సిచ్చిచూడు అనే సీరియ‌ల్‌తో ఎంట్రీ ఇచ్చింది కీర్తి భ‌ట్‌. కార్తీక‌దీపంతో పాటు మ‌రికొన్ని సీరియ‌ల్స్‌లో న‌టించింది.

WhatsApp channel

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.