బిగ్‌బాస్ ఫేమ్ ఇనయా సుల్తానా ప్రధాన పాత్రలో నటించిన తెలుగు మూవీ నటరత్నాలు థియేటర్లలో రిలీజైన ఏడాది తర్వాత ఓటీటీలోకి వచ్చింది. సోమవారం అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో ఈ మూవీ రిలీజైంది. క్రైమ్ కామెడీ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ మూవీలో ఇనయా సుల్తానాతో పాటు టాలీవుడ్ కమెడియన్లు రంగస్థలం మహేష్, సుదర్శన్, తాగుబోతు రమేష్ కీలక పాత్రలు పోషించారు. ఈ తెలుగు మూవీకి శివనాగు దర్శకత్వం వహించాడు.
సినిమా కష్టాలకు మర్డర్ మిస్టరీ ఎలిమెంట్స్ జోడించి నటరత్నాలు మూవీని తెరకెక్కించాడు దర్శకుడు. గత ఏడాది మే నెలలో థియేటర్లలో రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సందడి చేయలేకపోయింది. బంగార్రాజు(అర్జున్ తేజ్), వరప్రసాద్(సుదర్శన్), పీకే నాయుడు(రంగస్థలం మహేష్) ప్రాణ స్నేహితులు. బంగార్రాజు హీరో కావాలని కలలు కంటుంటాడు.
హీరోయిన్ అవ్వాలని కలలతో ఇండస్ట్రీకి వచ్చిన సువర్ణ( ఇనయ సుల్తానా)తో ప్రేమలో పడతారు. స్నేహితుడు వరప్రసాద్ దర్శకత్వంలో బంగార్రాజు, సువర్ణ హీరోయిన్లుగా ఓ సినిమా చేసే అవకాశం లభిస్తుంది.
ఆ ఆనందక్షణాలను సెలబ్రేట్ చేసుకోవాలని అనుకున్న నలుగురు అనుకోకుండా ఓ హత్య కేసులో చిక్కుకుంటారు. ఆ నేరం నుంచి వాళ్లు ఎలా బయటపడ్డారు? అసలు వారిని క్రైమ్‌లో ఇరికించింది ఎవరు? బంగార్రాజు, సువర్ణల సినిమా రిలీజైందా? లేదా? అన్నదే ఈ మూవీ కథ.
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 6లో ఓ కంటెస్టెంట్‌గా పాల్గొన్నది ఇనయా సుల్తానా. 14 వారాల పాటు హౌజ్‌లో కొనసాగిన ఈ బ్యూటీ 98వ రోజు అనూహ్యంగా ఎలిమినేట్ అయ్యింది. బిగ్‌బాస్ ద్వారా వచ్చిన పాపులారిటీతో పలు సినిమాల్లో అవకాశాలను అందుకున్నది. సన్నీడియోల్ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వచ్చిన బాలీవుడ్ మూవీ జాట్‌లో లేడీ కానిస్టేబుల్ పాత్రలో తళుక్కున మెరిసింది.
తెలుగులో బచ్చలమల్లి, వాలెంటైన్స్ నైట్, మధం, శివం భజే, బుజ్జి ఇలా రాతో పాటు మరికొన్ని సినిమాల్లో వైవిధ్యమైన పాత్రల్లో కనిపించింది. కొన్ని టీవీ షోస్, వెబ్‌సిరీస్‌లలో నటించింది.
సంబంధిత కథనం