Deepthi Sunaina: బిగ్ బాస్ బ్యూటి దీప్తి సునైనాకు యాక్సిడెంట్.. అసలు ఏం జరిగిందంటే?
Deepthi Sunaina About Accident: సోషల్ మీడియా, బిగ్ బాస్ ద్వారా సూపర్ పాపులారిటీ తెచ్చుకున్న తెలుగు బ్యూటి దీప్తి సునైనా. ఇటీవల దీప్తికి యాక్సిడెంట్ అయినట్లు తెగ వార్తలు వచ్చాయి. దీనిపై ఆమె తాజాగా స్పందించారు.
సోషల్ మీడియా ద్వారా విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న అతి కొద్ది తెలుగు ముద్దుగుమ్మల్లో దీప్తి సునైనా ఒకరు. యూట్యూబ్ ద్వారా తన ఫన్నీ వీడియోలతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది ఈ బ్యూటిఫుల్. అనంతరం బిగ్ బాస్ 2 తెలుగు సీజన్‍లో ఎంట్రీ ఇచ్చి మరో తరహాలో క్రేజ్ సంపాదించుకుంది. ఈ సీజన్‍లో ఆటలు, పాటలు, గొడవలు పడుతూనే గ్లామర్ ట్రీట్ అందించి ఆకట్టుకుంది. నచ్చావులే హీరో తనీష్‍తో చాలా చనువుగా ఉంటూ కాస్తా వివాదంగా కూడా మారింది. ఇలా బిగ్ బాస్ ద్వారా వివిధ రకాలుగా క్రేజ్ అయితే సంపాదించుకుంది దీప్తి.
ట్రెండింగ్ వార్తలు
ఇదిలా ఉంటే ఇటీవల దీప్తి సునైనాకు యాక్సిడెంట్ అయినట్లుగా వార్తలు వచ్చాయి. తాజాగా దీప్తి సునైనా నిర్వహించిన ఇన్‍స్టా గ్రామ్ ఆస్క్ మి సెషన్‍లో "మీకు యాక్సిడెంట్ అయిందని న్యూస్ వస్తుంది. నిజమేనా అక్క?" అని ఓ అభిమాని అడిగారు. దీనికి దీప్తి సునైనా రియాక్ట్ అయింది. యాక్సిడెంట్ గురించి చెబుతూ ఇన్ స్టా స్టోరీ వీడియోలో చెప్పుకొచ్చింది.
"గాయ్స్.. ఒక వీడియో చూసి నాకు యాక్సిడెంట్ అయినట్లు ఆ న్యూస్ అలా పెట్టారు. నేను కూడా ఆ వీడియో చూశాను. నాకు చాలా మంది పంపించారు. నేను 6, 7 ఏళ్ల క్రితం అలియా ఖాన్ అనే ఒక షార్ట్ ఫిల్మ్ చేశాను. ఆ వీడియో అందులోని షాట్ అది. నాకు ఏ యాక్సిడెంట్ కాలేదు. నేను చాలా బాగున్నాను. ఆల్ గుడ్. కానీ, అసలు ఏది తెలియకుండా అలా న్యూస్ ఎలా పెడతారో" అని దీప్తి సునైనా ఆ వీడియోలో పేర్కొంది. దీంతో ఆమెకు ఎలాంటి యాక్సిడెంట్ కాలేదని క్లారిటీ వచ్చేసింది.
ఇక బిగ్ బాస్ ద్వారా మరింతగా పాపులర్ అయిన దీప్తి సునైనా సినిమాలు ఏం చేయకపోయినా క్రేజ్ అలాగే కొనసాగిస్తూ వచ్చింది. యూట్యూబ్ షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీసులతోపాటు మ్యూజిక్ ఆల్బమ్స్ తో చాలా మంచి పేరు తెచ్చుకుంది. మరో యూట్యూబర్ షణ్ముక్ జశ్వంత్‍తో ప్రేమాయణం నడిపిన దీప్తి సునైనా బిగ్ బాస్ 5 తెలుగు సీజన్ తర్వాత బ్రేకప్ చెప్పిన విషయం తెలిసిందే.