Bigg boss Divi: లంబసింగిలో బిగ్‌బాస్ బ్యూటీ - కొత్త హీరోతో రొమాన్స్
Bigg boss Divi: బిగ్‌బాస్ బ్యూటీ దివి హీరోయిన్‌గా నటిస్తోన్న లంబసింగి మూవీ రిలీజ్ డేట్ ఫిక్సయింది. మార్చి 15న థియేటర్లలో ఈ లవ్ స్టోరీ విడుదలకాబోతోంది.
Bigg boss Divi: బిగ్‌బాస్ ఫేమ్ దివి హీరోయిన్‌గా నటిస్తోన్న లంగసింగి రిలీజ్ డేట్ ఫిక్సయింది. మార్చి 15న ఈ మూవీ థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. లింగసింగ్ రిలీజ్ డేట్‌ను మేకర్స్ అఫీషియల్‌గా అనౌన్స్‌చేశారు. లంబసింగి సినిమాకు నవీన్ గాంధీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకు డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ ప్రజెంటర్‌గా వ్యవహరిస్తున్నారు.
హిట్ స్టేషన్ బ్యాక్‌డ్రాప్...
హిల్ స్టేషన్ బ్యాక్‌డ్రాప్‌లో లవ్ స్టోరీతో పాటు థ్రిల్లర్ అంశాలతో లంబసింగి తెరకెక్కుతోన్నట్లు సమాచారం. ఈ సినిమా టైటిల్‌కు ఏ ప్యూర్ లవ్ స్టోరీ అనే క్యాప్షన్ ఇచ్చారు.ఈ క్యాప్షన్ ఆసక్తిని పంచుతోంది. లంబసింగి సినిమాతో భరత్ రాజ్‌హీరోగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. లంబసింగి నుండి వయ్యారి గోదారి సాంగ్ ను చిత్ర యూనిట్ ఇటీవల విడుదల చేసింది.
జవేద్ అలీ ఆలపించిన ఈ సాంగ్ కు కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించారు. ఆర్ఆర్ ధ్రువన్ మ్యూజిక్ సమకూర్చారు. డిఫరెంట్ మెలోడీ గా సాగిన ఈ పాట మ్యూజిక్ లవర్స్ ను ఆకట్టుకుంటోంది. లంబసింగి సినిమాలో వంశీ రాజ్, కిట్టయ్య, నిఖిల్ రాజ్, జనార్దన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
లంబసింగిలో గ్లామర్‌తో పాటు యాక్టింగ్ ప్రధానంగా సాగే పాత్రలో దివి కనిపించబోతున్నట్లు సమాచారం. హీరోయిన్‌గా ఆమెకు ఈ సినిమా మంచి పేరు తెచ్చిపెడుతుందని మేకర్స్ చేబోతున్నారు. కాన్సెప్ట్ ఫిల్మ్స్ పతాకంపై ఆనంద్.టి నిర్మిస్తున్నారు
బిగ్‌బాస్ సీజన్ 4 ద్వారా...
బిగ్‌బాస్ సీజన్ 4లో ఓ కంటెస్టెంట్‌గా పాల్గొన్నది దివి. గేమ్ కంటే గ్లామర్‌తోనే అభిమానులను ఎక్కువగా ఆకట్టుకున్నది. బిగ్‌బాస్ ద్వారా వచ్చిన గుర్తింపుతో పలు సినిమాల్లో అవకాశాల్ని దక్కించుకున్నది.
చిరంజీవి గాడ్‌ఫాదర్‌లో ఓ కీలక పాత్ర చేసింది. జిన్నా, రుద్రంగి, క్యాబ్ స్టోరీస్, నయీం డైరీస్‌తో పాటు తెలుగులో చాలా సినిమాలు చేసింది. అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతోన్న పుష్ప 2లో జర్నలిస్ట్ పాత్రలో దివి కనిపించబోతున్నది.
వెబ్ సిరీస్‌లో...
తెలుగులో మా నీళ్ల ట్యాంక్, పరంపరతో పాటు మరికొన్ని వెబ్‌సిరీస్‌లలో దివి డిఫరెంట్ రోల్స్ చేసింది. సినిమాల పరంగా సక్సెస్‌లు లేకపోయినా సోషల్ మీడియా ద్వారా మాత్రం భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించుకున్నది దివి.
చిరంజీవితో నెక్స్ట్ మూవీ….
నాగార్జున సోగ్గాడే చిన్నినాయన సినిమాతో దర్శకుడిగా కళ్యాణ్ కృష్ణ టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. తొలి సినిమాతోనే డైరెక్టర్‌గా బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్నాడు. సోగ్గాడే చిన్నినాయనాకు సీక్వెల్‌గా వచ్చిన బంగార్రాజుకు కూడా కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వం వహించాడు. ప్రస్తుతం చిరంజీవితో కళ్యాణ్ కృష్ణ ఓ సినిమా చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఫ్యామిలీ ఎమోషన్స్‌కు యాక్షన్ అంశాలను మేళవించి తెరకెక్కనున్న ఈ మూవీకి చిరంజీవి తనయ సుస్మిత కొణిదెల ప్రొడ్యూసర్‌గా వ్యవహరించనున్నట్లు సమాచారం.
సెకండ్ మూవీ…
దర్శకుడిగా లంబసింగి నవీన్ గాంధీకి సెకండ్ మూవీ. ఆదిపినిశెట్టి హీరోగా నటించిన గాలిపటం మూవీతో నవీన్ గాంధీ దర్శకుడిగా మారాడు. లాంగ్ గ్యాప్ తర్వాత లంబసింగి సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.
టాపిక్