Bigg Boss Akhil: బిగ్‌బాస్ అఖిల్ తెలుగు కామెడీ వెబ్‌సిరీస్ - యాభై ఎపిసోడ్స్‌తో స్ట్రీమింగ్ - టైటిల్ ఇదే!
Bigg Boss Akhil: బిగ్‌బాస్ రన్నరన్ అఖిల్ తెలుగులో ఓ యూత్‌ఫుల్ కామెడీ వెబ్‌సిరీస్ చేయబోతున్నాడు. వేరే లెవెల్ ఆఫీస్ పేరుతో తెరకెక్కుతోన్న ఈ వెబ్‌సిరీస్ ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది. వందకుపైగా ఎపిసోడ్స్‌తో ఈ వెబ్‌సిరీస్‌ను రిలీజ్ చేస్తోన్నట్లు సమాచారం.
బిగ్‌బాస్ తెలుగు షోలో రెండు సార్లు రన్నరప్‌గా నిలిచాడు అఖిల్. బిగ్‌బాస్ సీజన్ 4తో పాటు బిగ్‌బాస్ నాన్ స్టాప్‌లో అతడికి టైటిల్ దక్కినట్లే దక్కి చివరి నిమిషంలో చేజారింది. రెండు సీజన్స్‌లో ఫస్ట్ రన్నరప్ ప్లేస్‌తోనే సరిపెట్టుకున్నాడు. బిగ్‌బాస్ ద్వారా పాపులర్ అయిన అఖిల్‌కు పెద్దగా సినిమా అవకాశాలు మాత్రం దక్కలేదు.
హారర్ కామెడీ వెబ్‌సిరీస్
తాజాగా అఖిల్ తెలుగులో ఓ యూత్‌ఫుల్ కామెడీ వెబ్‌సిరీస్ చేయబోతున్నాడు. ఈ వెబ్‌సిరీస్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను అఖిల్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. ఈ వెబ్‌సిరీస్‌కు వేరే లెవెల్ ఆఫీస్ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఈ వెబ్‌సిరీస్‌లో అఖిల్ సార్ధక్, మహేష్ విట్టాతో పాటు పలువురు బిగ్‌బాస్ కంటెస్టెంట్స్, యూట్యూబ్ స్టార్స్ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు.
ఆహా ఓటీటీలో...
వేరే లెవెల్ ఆఫీస్ స్టూడెంట్స్‌తో పాటు సాఫ్ట్‌వేర్ జాబ్ చేసేవాళ్లను ఆకట్టుకుంటుందని అఖిల్ సార్ధక్ అన్నాడు. ఈ వెబ్‌సిరీస్‌కు డైరెక్టర్ ఎవరన్నది మాత్రం అఖిల్ రివీల్ చేయలేదు. త్వరలోనే ఆహా ఓటీటీలో ఈ వెబ్‌సిరీస్ స్ట్రీమింగ్ కాబోతున్నట్లు ప్రకటించాడు.
వంద ఎపిసోడ్స్ తో...
ఎడెనిమిది ఎపిసోడ్స్‌తో కాకుండా ఏకంగా యాభైకిపైగా ఎపిసోడ్స్‌తో వేరే లెవెల్ ఆఫీస్ వెబ్‌సిరీస్ రూపొందుతోన్నట్లు సమాచారం. ప్రతి వారం మూడు ఎపిసోడ్స్ చొప్పున రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేసినట్లు చెబుతోన్నారు. గురువారం నుంచి శనివారం వరకు ఈ ఎపిసోడ్స్ విడుదలవుతాయని తెలుస్తోంది.
తమిళ రీమేక్...
తమిళంలో విజయవంతమైన వేర మారి ఆఫీస్ కు రీమేక్‌గా వేరే లెవల్ ఆఫీస్ వెబ్‌సిరీస్ తెరకెక్కుతోంది. ప్రస్తుతం వేరమారి ఆఫీస్ సీజన్ 2 ఆహా తమిళ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. సీజన్ వన్ యూత్ ఆడియెన్స్‌ను ఆకట్టుకోవడంతో సీజన్ 2ను ప్రారంభించారు. సీజన్ వన్ యాభై ఎపిసోడ్స్‌తో ముగియగా...సీజన్ 2 ఇప్పటికే 54 ఎపిసోడ్స్ పూర్తయ్యాయి.
ఫన్ రొమాన్స్...
సాఫ్ట్ వేర్ ఆఫీస్‌లో పనిచేసే కొందరు యువతీయువకుల జీవితాల నేపథ్యంలో ఈ వేర మారి ఆఫీస్ వెబ్‌సిరీస్ తెరకెక్కింది. ఫన్‌తో పాటు రొమాన్స్, హారర్, ఫ్యామిలీ ఎమోషన్స్‌తో పాటు సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు లైఫ్ స్టైల్‌ను ఈ సిరీస్‌లో చూపించారు మేకర్స్. వేరా మారి ఆఫీస్ వెబ్‌సిరీస్‌లో ఆర్‌జే విజయ్, సౌందర్య, జనని అశోక్ కుమార్, రోబో శంకర్ కీలక పాత్రల్లో నటించారు.
కళ్యాణి సీరియల్‌లో
కాగా గతంలో అఖిల్ తెలుగబ్బాయి, గుజరాతీ అమ్మాయి వెబ్ సిరీస్‌తో పాటు తెలుగులో మరొకొన్ని సినిమాలు వె బ్‌సిరీస్‌లు చేశాడు. కళ్యాణి అనే టీవీ సీరియల్‌లో కనిపించాడు.