బిగ్ బాస్ 9 తెలుగు: ఫౌల్ గేమ్‌-పైగా ఆర్గ్యుమెంట్‌-దెబ్బ‌కు ప‌డిపోయిన రీతు ఓటింగ్‌-జోడీగా ఉన్నందుకు ప‌వన్‌కూ ఎఫెక్ట్‌-bigg boss 9 telugu voting updates bigg boss live voting ritu chaudhary in danger zone demon pavan thanuja in top ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  బిగ్ బాస్ 9 తెలుగు: ఫౌల్ గేమ్‌-పైగా ఆర్గ్యుమెంట్‌-దెబ్బ‌కు ప‌డిపోయిన రీతు ఓటింగ్‌-జోడీగా ఉన్నందుకు ప‌వన్‌కూ ఎఫెక్ట్‌

బిగ్ బాస్ 9 తెలుగు: ఫౌల్ గేమ్‌-పైగా ఆర్గ్యుమెంట్‌-దెబ్బ‌కు ప‌డిపోయిన రీతు ఓటింగ్‌-జోడీగా ఉన్నందుకు ప‌వన్‌కూ ఎఫెక్ట్‌

బిగ్ బాస్ 9 తెలుగు అయిదో వారం హౌస్ లో టాస్క్ లు హోరాహోరీగా సాగుతున్నాయి. వైల్డ్ కార్డ్స్ ను అడ్డుకోవడానికి కంటెస్టెంట్లు జోడీలుగా విడిపోయి టాస్క్ లు ఆడుతున్నారు. ఈ క్రమంలో ఫౌల్ గేమ్ ఆడిన రీతు, పవన్ పై నెగెటివ్ ఎఫెక్ట్ బాగానే పడింది.

రీతు చౌదరి, డీమాన్ పవన్ (youtube)

బిగ్ బాస్ 9 తెలుగులో అయిదో వారం టాస్క్ లు హోరాహరీగా సాగుతున్నాయి. డేంజర్ జోన్లో ఉన్న కంటెస్టెంట్లు బయటకు వచ్చేందుకు గట్టిగానే ట్రై చేస్తున్నారు. బిగ్ బాస్ 9 తెలుగు అయిదో వారం ఇమ్మాన్యుయేల్, రాము రాథోడ్ మినహా అందరూ నామినేషన్లలో ఉన్నారు. ఓట్ల కోసం ఎవరికి తగ్గ ఆటతీరు వాళ్లు చూపిస్తున్నారు. మరి ప్రస్తుతం ఓటింగ్ ప్రకారం డేంజర్ జోన్లో ఎవరున్నారో చూసేద్దాం.

బిగ్ బాస్ 9 తెలుగు నామినేషన్స్

బిగ్ బాస్ 9 తెలుగులో అయిదో వారం నామినేషన్లలో 10 మంది కంటెస్టెంట్లున్నారు. వైల్డ్ కార్డ్స్ రాబోతున్నారని వార్నింగ్ ఇచ్చిన బిగ్ బాస్ డైరెక్ట్ గా 10 మందిని నామినేట్ చేశాడు. ఇందులో రీతు చౌదరి, డీమాన్ పవన్, తనుజ, కల్యాణ్, ఫ్లోరా సైని, సంజన గల్రానీ, సుమన్ శెట్టి, శ్రీజ, భరణి, దివ్య నిఖిత ఉన్నారు. కెప్టెన్ కావడం వల్ల రాము రాథోడ్ ను, గోల్డెన్ స్టార్ ఇమ్యునిటీ ఉండటంతో ఇమ్మాన్యుయేల్ నామినేషన్స్ నుంచి తప్పించుకున్నారు.

ఫౌల్ గేమ్

అయిదో వారం టాస్క్ లు రసవత్తరంగా సాగుతున్నాయి. నామినేషన్లలో ఉన్న 10 మందిని అయిదు జోడీలుగా విభజించారు. రీతు-పవన్, తనుజ-కల్యాణ్, ఫ్లోరా-సంజన, సుమన్-శ్రీజ, భరణి-దివ్య జంటలుగా టాస్క్ లు ఆడుతున్నారు. అయితే బెెలూన్ టాస్క్ లో సంజన-ఫ్లోరా మినహా అందరూ ఫౌల్ గేమ్ ఆడారు. అందరి కంటే ఎక్కువగా రీతు-పవన్ ఫౌల్ గేమ్ ఆడటంతో బిగ్ బాస్ సీరియస్ అయ్యాడు. వార్నింగ్ కూడా ఇచ్చాడు. ఇది రీతు-పవన్ ఓటింగ్ పై నెగెటివ్ ఎఫెక్ట్ చూపిస్తోంది.

బిగ్ బాస్ ఓటింగ్

బిగ్ బాస్ 9 తెలుగు అయిదో వారం హౌస్ నుంచి బయటకు వెళ్లేందుకు 10 మంది నామినేట్ అయ్యారు. వీళ్లలో రీతు, పవన్ మరింత డేంజర్ జోన్లో ఉన్నారు. ప్రస్తుతం ఓటింగ్ ప్రకారం లాస్ట్ రెండు స్థానాలు వీళ్లవే. పవన్ 6.34 శాతం ఓట్లతో తొమ్మిదో స్థానంలో, రీతు 6.22 శాతం ఓట్లతో పదో స్థానంలో ఉన్నారు.

ఎలాగైనా గెలవాలని రీతు, పవన్ అనుకుంటున్నారు. కానీ గెలిచే విధానం కూడా ముఖ్యమనే సంగతి మర్చిపోతున్నారు. పైగా ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు. దీంతో జనాలకు వీళ్లపై నెగెటివ్ ఫీల్ కలుగున్నట్లే కనిపిస్తోంది.

టాప్ లో హీరోయిన్

బిగ్ బాస్ 9 తెలుగు అయిదో వారం ఓటింగ్ లో ప్రస్తుతం సీరియల్ హీరోయిన్ తనుజ టాప్ ప్లేస్ లో కొనసాగుతోంది. 18.29 శాతం ఓట్లతో ఆమె టాప్ లో ఉంది. ఆమె పార్ట్ నర్ కల్యాణ్ పడాల ఏమో 15.46 శాతం ఓటింగ్ తో సెకండ్ ప్లేస్ లో ఉన్నాడు.

ఆ తర్వాత వరుసగా సుమన్ (13.28 శాతం), భరణి (9.18 శాతం), సంజన (8.77 శాతం), ఫ్లోరా (7.64 శాతం), శ్రీజ (7.59 శాతం), దివ్య నిఖిత (7.2 శాతం) ఉన్నారు. మరి ఇదే ట్రెండ్ కంటిన్యూ అయి రీతు చౌదరి ఈ వారం హౌస్ నుంచి ఎలిమినేట్ అవుతుందేమో చూడాలి.

చందు శనిగారపు హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా పని చేస్తున్నారు. ఈయనకు మీడియా రంగంలో ఏడేళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు లాంటి ప్రముఖ దినపత్రికలో పని చేశారు. ఫిబ్రవరి 6, 2025 నుంచి ఇక్కడ స్పోర్ట్స్, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ వార్తలు రాస్తున్నారు. వివిధ ర‌కాల క్రీడ‌ల‌పై అవ‌గాహ‌న ఉంది.

సంబంధిత కథనం