బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ నిజంగానే రణరణంగా మారబోతుంది. ఫైర్ స్టార్మ్ ఎంటర్ కానుంది. హౌస్ లోకి వైల్డ్ కార్డులు అనే డేంజర్ రాబోతుందని కంటెస్టెంట్లకు బిగ్ బాస్ వార్నింగ్ కూడా ఇచ్చాడు. వాళ్ల వస్తే డేంజర్ జోన్లో ఉన్నవాళ్లకు ఇబ్బందులు తప్పవన్నాడు. మొత్తానికి ఈ వారం బిగ్ బాస్ లో వైల్డ్ కార్డు ముప్పు నుంచి తప్పించుకునేందుకు కంటెస్టెంట్లు కష్టపడనున్నారు.
ఇప్పటికే బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ రసవత్తరంగా సాగుతోంది. ఇక ఆ జోరు మరింత పెరగనుంది. ఇప్పటికే నాలుగు వారాలు పూర్తయ్యాయి. శ్రష్టి వర్మ, మర్యాద మనీష్, ప్రియా శెట్టి, మాస్క్ మ్యాన్ హరీష్ ఎలిమినేట్ అయ్యారు. ఇప్పుడు అయిదో వారంలోకి అడుగుపెట్టారు కంటెస్టెంట్లు. వాళ్లకు వైల్డ్ కార్డు రూపంలో ఫైర్ స్టార్మ్ ఎదురు కానుందని బిగ్ బాస్ చెప్పాడు.
బిగ్ బాస్ 9 తెలుగులో ఇవాళ (అక్టోబర్ 7) రిలీజ్ చేసిన ఫస్ట్ ప్రోమో ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఇల్లు రణరంగంగా మారబోతుందని బిగ్ బాస్ హెచ్చరించాడు. ఫైర్ స్టార్మ్ రాబోతుందన్నాడు. వైల్డ్ కార్డు ఎంట్రీలు ఉంటాయని చెప్పాడు. డేంజర్ జోన్లో ఉన్నవాళ్లకు ముప్పు తప్పదన్నాడు. ఆ తర్వాత లీడర్ బోర్డులో అందరి ఫొటోలు చూపించారు. టాస్క్ లు ఈ సారి భారీగానే ఉండబోతున్నట్లు కనిపించాయి. ఇసుక టాస్క్ లో విజయం కోసం కంటెస్టెంట్లు బాగానే పోరాడుతున్నారు.
బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ లో ఇప్పటికే కామనర్ దివ్య నిఖిత వైల్డ్ కార్డు ఎంట్రీగా వచ్చింది. ఇక ఇప్పుడు ఎవరు రాబోతున్నారనే ఉత్కంఠ కలుగుతోంది. సీరియల్ ఆర్టిస్ట్ లు సుహాసిని, కావ్యశ్రీ, ప్రియాంక జైన్ బాయ్ ఫ్రెండ్ శివకుమార్, అలేఖ్య చిట్టి పికిల్స్ రమ్య, దివ్వెల మాధురి పేర్లు వినిపిస్తున్నాయి. సెలబ్రిటీ వైల్డ్ కార్డు ఎంట్రీతో వీళ్లు హౌస్ లోకి అడుగుపెట్టే అవకాశముంది.
మరోవైపు బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్లను కూడా వైల్డ్ కార్డు ఎంట్రీలుగా పంపే ఛాన్స్ ఉంది. తనీష్, అమర్ దీప్ లు మరోసారి ఎంట్రీ ఇచ్చే అవకాశముంది. మరి ఈ వైల్డ్ కార్డు ఎంట్రీలను ఒకేసారి హౌస్ లోకి పంపిస్తారా? లేదా మిడ్ వీక్ లో ఇద్దరికి ఎంట్రీ ఇస్తారా? అన్నది చూడాలి. వైల్డ్ కార్డు ఎంట్రీలు రాబోతున్న నేపథ్యంలో ఈ సారి హౌస్ లో డబుల్ ఎలిమినేషన్ ఉండేందుకు ఎక్కువ అవకాశాలున్నాయి.
సంబంధిత కథనం
టాపిక్