బిగ్ బాస్ తెలుగు హిస్టరీలోనే ఫస్ట్ టైమ్.. వైల్డ్ కార్డ్స్ తో ఎలిమినేషన్.. ఈ వారం ఇద్దరు ఔట్..ఫ్లోరాతో పాటు సుమన్ శెట్టి!-bigg boss 9 telugu updates this week double nominations flora saini suman shetty wild card entries ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  బిగ్ బాస్ తెలుగు హిస్టరీలోనే ఫస్ట్ టైమ్.. వైల్డ్ కార్డ్స్ తో ఎలిమినేషన్.. ఈ వారం ఇద్దరు ఔట్..ఫ్లోరాతో పాటు సుమన్ శెట్టి!

బిగ్ బాస్ తెలుగు హిస్టరీలోనే ఫస్ట్ టైమ్.. వైల్డ్ కార్డ్స్ తో ఎలిమినేషన్.. ఈ వారం ఇద్దరు ఔట్..ఫ్లోరాతో పాటు సుమన్ శెట్టి!

బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ లో బిగ్ ట్విస్ట్. బిగ్ బాస్ తెలుగు హిస్టరీలోనే ఫస్ట్ టైమ్ వైల్డ్ కార్డ్స్ ద్వారా ఓ ఎలిమినేషన్ జరగబోతుందని తెలిసింది.ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుంచి డబుల్ ఎలిమినేషన్ కన్ఫామ్ అని టాక్.

బిగ్ బాస్ 9 తెలుగు ఎలిమినేషన్ (youtube)

బిగ్ బాస్ 9 తెలుగులో ఊహించని ట్విస్ట్ జరగబోతుందని తెలిసింది. బిగ్ బాస్ ఈ సీజన్ అయిదో వారంలో డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని ఫస్ట్ నుంచే టాక్ వినిపిస్తోంది. ఇందులో నుంచి ఫ్లోరా సైనీ ఎలిమినేట్ కావడం పక్కా అని అంటున్నారు. ఆమె కాకుండా మరో ఎలిమినేషన్ బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చే వైల్డ్ కార్డ్స్ చేస్తారనేది సంచలనంగా మారింది.

బిగ్ బాస్ 9 తెలుగు నామినేషన్

బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ లోకి ఆరుగురు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా రావడం దాదాపుగా ఖాయమైంది. బిగ్ బాస్ అయిదో వారం ఇద్దరు ఎలిమినేట్ అవుతారన్నది కూడా నిజమేననే టాక్ బలంగా వినిపిస్తోంది. ఈ వారం ఇమ్మాన్యుయేల్, రాము రాథోడ్ మినహా అందరూ ఎలిమినేషన్లో ఉన్నారు. భరణి, సుమన్ శెట్టి, తనుజ, రీతు చౌదరి, డీమాన్ పవన్, కల్యాణ్, ఫ్లోరా సైనీ, సంజన, శ్రీజ దమ్ము, దివ్య నిఖిత నామినేషన్లలో ఉన్నారు.

డబుల్ ఎలిమినేషన్

బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ అయిదో వారంలో డబుల్ ఎలిమినేషన్ పక్కా అని టాక్. ఇందులో ఒకరు ఫ్లోరా సైని అని తెలిసింది. ఆమె ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుంచి వెళ్లిపోవడం ఖాయమని అంటున్నారు. ఈ వారం ఆమె ప్రదర్శన కూడా అంతంతమాత్రంగానే ఉంది. ముఖ్యంగా తెలుగు రాకపోవడంతో ఇబ్బంది పడుతున్నారు. ఇక నామినేషన్లలో ఉన్న మిగతా తొమ్మిది మంది నుంచి మరొకరు ఎలిమినేట్ కాబోతున్నారని తెలిసింది.

వైల్డ్ కార్డు చేతుల్లో

సాధారణంగా బిగ్ బాస్ లో ఆడియన్స్ ఓటింగ్ ప్రకారం ఎలిమినేషన్ ఉంటుంది. కానీ ఈ అయిదో వారం రెండో ఎలిమినేషన్ కు మాత్రం ఓట్లతో సంబంధం లేదని తెలిసింది. బిగ్ బాస్ తెలుగు హిస్టరీలోనే ఫస్ట్ టైమ్ హౌస్ లోకి వచ్చే వైల్డ్ కార్డు కంటెస్టెంట్ల ద్వారా ఓ ఎలిమినేషన్ జరగబోతుందని తెలిసింది. బిగ్ బాస్ లోకి ఆరుగురు వైల్డ్ కార్డు ద్వారా ఎంటర్ అవుతున్నారు. వీళ్లు డిస్కస్ చేసుకుని ఒకరిని ఎలిమినేట్ చేస్తారని తెలిసింది.

ఆ ముగ్గురిలో

బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ లో ఈ వారం ఎలిమినేట్ అయ్యే రెండో కంటెస్టెంట్ ఎవరనేది ఉత్కంఠగా మారింది. అది కూడా సుమన్ శెట్టి, శ్రీజ, డీమాన్ పవన్ లో ఒకరు ఇంటికి వెళ్లక తప్పదు అనే సమాచారం మరింత హాట్ టాపిక్ గా మారింది. ఈ ముగ్గురిలో చూసుకుంటే ఓట్లు పడ్డా కూడా సుమన్ శెట్టినే ఎలిమినేట్ చేసేందుకు ఎక్కువ అవకాశాలున్నాయి. మరి హౌస్ లోకి వచ్చే వైల్డ్ కార్డ్స్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? డబుల్ ఎలిమినేషన్ నిజంగానే ఉంటుందా? అన్నది వేచి చూడాలి.

చందు శనిగారపు హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా పని చేస్తున్నారు. ఈయనకు మీడియా రంగంలో ఏడేళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు లాంటి ప్రముఖ దినపత్రికలో పని చేశారు. ఫిబ్రవరి 6, 2025 నుంచి ఇక్కడ స్పోర్ట్స్, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ వార్తలు రాస్తున్నారు. వివిధ ర‌కాల క్రీడ‌ల‌పై అవ‌గాహ‌న ఉంది.

సంబంధిత కథనం