రసవత్తరంగా సాగుతున్న బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ ను మరింత ఇంట్రెస్టింగ్ గా మార్చేందుకు మిడ్ వీక్ ఎలిమినేషన్ అంటూ బాంబ్ వేశాడు బిగ్ బాస్. హౌస్ మేట్స్ లో ఎక్కువ శాతం మంది సంజన గల్రానీని బయటకు పంపించడానికి ఓటు వేశారు. దీంతో ఆమెను తీసుకెళ్లి సీక్రెట్ రూమ్ లో పెట్టారు. కానీ ఇవాళ (సెప్టెంబర్ 27) ఎపిసోడ్ లో మాత్రం ఆమెను ఎలిమినేట్ చేసి, బయటకు పంపిస్తున్నట్లు చూపించబోతున్నారు. తాజా ప్రోమోలో స్టేజ్ పై సంజన ఫైర్ అయింది.
ఇక బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ లోని హౌస్ మేట్స్ ఒక్కొక్కరి గురించి మాట్లాడుతూ సంజన గల్రానీ ఫైర్ అవుతుంది. సుమన్ దేనికీ స్టాండ్ తీసుకోడని చెప్తుంది. ఇక శ్రీజ 1000 పర్సెంట్ వరస్ట్ నుంచి 300 పర్సెంట్ వరస్ట్ కు వచ్చిందని సంజన అంటుంది. ప్రతి రోజు అన్నాచెల్లెలిలా ఉండాల్సిన అవసరం లేదు, సమస్య వచ్చినప్పుడు నిలబడాలని భరణితో అంటుంది.
బిగ్ బాస్ 9 తెలుగు కంటెస్టెంట్లలో హరిత హరీష్ గురించి మాట్లాడుతూ సంజన గల్రానీ సంచలన వ్యాఖ్యలు చేస్తుంది. ‘‘ఏం చెప్పినా గొడవకు వచ్చేస్తాడు. ఇలాంటి వ్యక్తితో కలిసి జీవించడం చాలా కష్టం. తనే గొప్ప అని, తనే ప్రధాన మంత్రి అని ఫీలవుతాడు. మనుషుల్ని తొక్కేస్తున్నాడు. అతడితో బతకలేం. ఒక్కసారి కూడా తప్పు ఒప్పుకోడు’’ అని ఫైర్ అవుతుంది సంజన.
ఇక రాము రాథోడ్ గురించి మాట్లాడుతూ మండిపడుతుంది సంజన. ‘‘నేను కొంతమందిని ఎక్కువగా, కొంతమందిని తక్కువగా ట్రీట్ చేస్తానని చెప్పాడు. నిన్నెప్పుడు తక్కువగా ట్రీట్ చేశాన్రా బిడ్డా. నేను చీప్ అమ్మాయినా?’’ అని ప్రశ్నిస్తుంది. చీప్ అన్లేదని రాము కవర్ చేసేందుకు ట్రై చేస్తే.. రికార్డింగ్ ఉందని, ఊరుకోమని సంజన గట్టిగానే చెప్తుంది.
సంజన, ఇమ్మాన్యుయేల్ ఇద్దరూ ఎమోషనల్ అయ్యారు. కన్నీళ్లు పెట్టుకున్నారు. తన ఒళ్లో పడుకుంటే మా అమ్మ గుర్తొచ్చేదని ఇమ్ము ఏడ్చేశాడు. ఇమ్ము స్వీట్ హార్ట్ అని సంజన చెప్పింది. మరి నిజంగానే సంజనను ఎలిమినేట్ పంపించారా? అనే ప్రశ్నకు కాదనే సమాధానాలే ఎక్కువ వస్తున్నాయి. సంజన లాంటి స్ట్రాంగ్ కంటెస్టెంట్ ను ఎలిమినేట్ చేసే ఛాన్స్ లేదని అంటున్నారు.
సంబంధిత కథనం