బిగ్ బాస్ తెలుగు 9 సీజన్ ప్రారంభమైపోయింది. మొత్తం 15 మంది కంటెస్టెంట్స్‌గా హౌజ్‌లోకి అడుగుపెట్టారు. అయితే, ఒక్కో కంటెస్టెంట్ ఒక్కోలా ప్రవర్తిస్తున్నారు. బిగ్ బాస్ 9 తెలుగు హౌజ్‌లో అలకలు, గొడవలు, ప్రేమాయణాలు, నవ్వులు అన్ని సర్వసాధారణమే.
అయితే, తాజాగా బిగ్ బాస్ తెలుగు 9 ఇవాళ్టీ (సెప్టెంబర్ 11) ఎపిసోడ్ ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ ఎపిసోడ్ ప్రోమోలో జబర్దస్త్ బ్యూటీ రీతూ చౌదరి ఓ వ్యక్తితో ఫ్లర్టింగ్ చేయడం చూడొచ్చు. అతనెవరో కాదు సోల్జర్ కల్యాణ్. హౌజ్‌లో మొదటి నుంచి కల్యాణ్ పడాలతో రీతూ చౌదరి క్లోజ్‌గా మూవు అవుతుంది.
తాజాగా పాత్రలు శుభ్రం చేసిన రీతూ చౌదరి పక్కనే ఉన్న కల్యాణ్‌తో ఇందులో మీ మొహం కనిపిస్తుందంటూ ఏదో ఒకటి మాట్లాడింది. దానికి సోల్జర్ నవ్వి ఊరుకున్నాడు. ఇంతలో గుండు అంకుల్ అని కామెంట్స్ వచ్చిన హరిత హరీష్ వచ్చి ఫ్లోరా ఇచ్చిన పెన్సిల్ గురించి అడుగుతాడు. "ఐ బ్రో పెన్సిలా.. నేనైతే చూడలేదు" అని రీతూ చౌదరి రిప్లై ఇచ్చింది.
"చూశారా అని అడగట్లేదు. అంతం చేశారా అని అడుగుతున్నా" అని హరీష్ అన్నాడు. "అలాంటివి ఇంట వంట లేవు. మనం మనసుల్ని దొంగతనం చేస్తాం కానీ మనుషుల వస్తువులు కాదు" అని రీతూ చౌదరి కామెడీగా యాటిట్యూడ్‌తో డైలాగ్ కొట్టింది. "హా.. 15 సంవత్సరాలప్పుడు వాడేశాం ఇవన్నీ" అని రీతూకు హరీష్ కౌంటర్ ఇచ్చాడు.
తర్వాత విగ్గు పెట్టుకుని అమ్మాయి తరహాలో ఇమ్మాన్యుయెల్ వచ్చాడు. తనపేరు సు అని.. జుట్టుకు లెమన్ వాటర్ తీసుకుంటానని చెబుతాడు. ఇమ్మాన్యుయెల్ జుట్టును హీరోయిన్ సంజన ఊకే సర్దుతుంటే.. "ఎహే ఆగు.. ఇచ్చే పేమెంట్ కంటే ఎక్కువ చేస్తావ్ అని కౌంటర్ ఇచ్చాడు" జబర్దస్త్ ఇమ్ము. దాంతో అంతా నవ్వేశారు.
"మీ ఆయన ఏదో మాట్లాడతాడంటా. మాట్లాడని" అని శ్రీజ అంది. "మా ఆయన పెళ్లిరోజు కూడా నచ్చాడా అని అంటే.. ఉమ్.. అని అన్నాడు అంతే" అని ఇమ్ము అన్నాడు. దానికి అంతా నవ్వారు. తర్వాత ఇమ్మాన్యుయేల్ పక్కన ఉన్న సోల్జర్ కల్యాణ్ దగ్గరికి రీతూ చౌదరి వచ్చింది.
దాంతో ఏయ్.. అటు వెళ్లు. ఏమైనా నా కాఫీయే కావాలి, నా మొగుడే కావాలి నీకు అని ఇమ్మాన్యూయేల్ అన్నాడు. దానికి రీతూ చౌదరితోపాటు అంతా నవ్వేశారు. అలా మరోసారి కల్యాణ్ దగ్గరికి రీతూ చౌదరి వచ్చి కౌంటర్‌లు పడేలా చేసుకుంది.
సంబంధిత కథనం