లెక్కకు రాని బిగ్ బాస్ ఓటింగ్.. ఓట్లు ఎక్కువ పడిన కూడా డేంజర్‌లో ఇద్దరు.. ఈ వారం ఎలిమినేషన్ ఎవరంటే?-bigg boss 9 telugu this week nominations voting results suman rithu pawan flora in bigg boss telugu 9 elimination ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  లెక్కకు రాని బిగ్ బాస్ ఓటింగ్.. ఓట్లు ఎక్కువ పడిన కూడా డేంజర్‌లో ఇద్దరు.. ఈ వారం ఎలిమినేషన్ ఎవరంటే?

లెక్కకు రాని బిగ్ బాస్ ఓటింగ్.. ఓట్లు ఎక్కువ పడిన కూడా డేంజర్‌లో ఇద్దరు.. ఈ వారం ఎలిమినేషన్ ఎవరంటే?

Sanjiv Kumar HT Telugu

బిగ్ బాస్ తెలుగు 9 సీజన్ ఐదో వారం మిడ్ వీక్‌కు వచ్చేసింది. ఈ వారం నామినేషన్స్‌లో ఏకంగా పది మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. అయితే, ఈ వారం ఓటింగ్‌లో సత్తా చాటిన ఇద్దరు కంటెస్టెంట్స్ డేంజర్‌లో ఉన్నారు. ఆ నలుగురిలోనే ఈ వారం ఒకరు ఎలిమినేట్ కానున్నారు. మరి ఆ వివరాలపై లుక్కేద్దాం.

లెక్కకు రాని బిగ్ బాస్ ఓటింగ్.. ఓట్లు ఎక్కువ పడిన కూడా డేంజర్‌లో ఇద్దరు.. ఈ వారం ఎలిమినేషన్ ఎవరంటే?

బిగ్ బాస్ తెలుగు 9 సీజన్ ప్రారంభం నుంచి జోరు చూపిస్తోంది. అయితే, గొత కొన్నిరోజులుగా మాత్రం కాస్తా చప్పగా సాగుతోంది. ఇక మొత్తానికి బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ ఐదో వారం మిడ్ వీక్‌కు వచ్చేసింది. ఈ ఐదో వారం ఏకంగా పది మంది కంటెస్టెంట్స్ నామినేట్ అయ్యారు.

ఈ వారం నామినేషన్స్

బిగ్ బాస్ తెలుగు 9 ఈ వారం నామినేషన్స్‌లో సుమన్ శెట్టి, తనూజ గౌడ, భరణి, ఫ్లోరా సైని, రీతూ చౌదరి, డీమోన్ పవన్, శ్రీజ దమ్ము, కల్యాణ్ పడాల, సంజన గల్రాని, దివ్య నిఖితా పది మంది మొదటగా ఉన్నారు. అంటే, కెప్టెన్ రాము, ఇమ్యూనిటీ పొందిన ఇమ్మాన్యుయెల్ తప్పా మిగతా నామినేషన్స్‌కు వచ్చారు.

వీరందరికి టాస్క్‌లు నిర్వహించి ఎలిమినేషన్ నుంచి సేఫ్ అయ్యే ప్రక్రియ మొదలు పెట్టాడు బిగ్ బాస్. అలా ఇప్పటివరకు కల్యాణ్, భరణి, దివ్య మాత్రమే సేవ్ అయ్యారు. తాజాగా ఇవాళ్టీ ఎపిసోడ్‌లో తనూజ కూడా సేవ్ అయినట్లు సమాచారం. దాంతో మొత్తంగా పది మందిలో నలుగురు సేవ్ అయ్యారు.

ఓటింగ్ లెక్కలు మరోలా

ఇక మిగతా కంటెస్టెంట్స్ అయిన రీతూ చౌదరి, ఫ్లోరా సైని, సుమన్ శెట్టి, డిమోన్ పవన్, శ్రీజ, సంజన ఆరుగురు ఎలిమినేషన్‌కు సంబంధించిన నామినేషన్‌లో ఉన్నారు. కానీ, పది మందికి నిర్వహించిన బిగ్ బాస్ ఓటింగ్‌ లెక్కలు మాత్రం మరోలా ఉన్నాయి.

పది మంది బిగ్ బాస్ ఓటింగ్‌లో టాప్ 1లో 17.12 శాతం ఓట్లతో తనూజ, 15.38 శాతంతో కల్యాణ్ రెండో ప్లేసులో, 12.96 శాతం ఓట్లతో సుమన్ శెట్టి మూడో స్థానంలో, భరణి (8.44 శాతం ఓట్లు) నాలుగో ప్లేసులో, ఫ్లోరా సైని 8.17 శాతం ఓట్లతో ఐదో స్థానంలో ఉన్నారు.

ఎలిమినేషన్‌కు దగ్గరిగా

అలాగే, 8.15 శాతం ఓట్లతో సంజన ఆరో ప్లేసులో, 8.13 శాతం ఓట్లతో టాప్ 7లో శ్రీజ, 7.66 శాతం ఓట్లతో నిఖితా టాప్ 8, కేవలం 7 శాతం ఓట్లతో టాప్ 9లో రీతూ, 6.99 శాతం ఓట్లతో డిమోన్ పవన్ పదో స్థానంలో ఓటింగ్‌ను బట్టి ఉన్నారు. అయితే, వీరిలో ఓట్ల దృష్ట్యా చివరిలో పవన్, రీతూ చౌదరి ఇద్దరు ఎలిమినేషన్‌కు దగ్గరిగా ఉన్నారు.

అయితే, ఈసారి ఓటింగ్‌ను పక్కన పెట్టి ఇమ్యూనిటీ సాధించకుండా చివరి వరకు నామినేషన్స్‌లో ఎవరు ఉంటారో వారిని ఎలిమినేట్ చేయనున్నారని తెలుస్తోంది. చివరిగా నామినేషన్స్‌లో ఉన్నవారి ఓటింగ్‌ను బట్టి ఎలిమినేట్ చేసే ఛాన్స్ ఉంది. అలా చూసుకుంటే ఓటింగ్ ఎక్కువ ఉన్న సుమన్, ఫ్లోరా సైని కూడా డేంజర్ జోన్‌లో ఉన్నారు.

డేంజర్‌లో నలుగురు

ఇలా ఓటింగ్ చివరిలో ఉన్న ఇద్దరు, ఇమ్యూనిటీ సాధించని ఇద్దరితో మొత్తంగా నలుగురు డేంజర్ జోన్‌లో ఉన్నారని తెలుస్తోంది. ఈ వారం బిగ్ బాస్ ఎలిమినేషన్ సుమన్ శెట్టి, రీతూ చౌదరి, డిమోన్ పవన్, ఫ్లోరా సైని ఈ నలుగురిలో ఛాన్స్ ఉందని సమాచారం.

సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌, ఆస్ట్రాలజీ, హెల్త్‌కు సంబంధించిన కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం