బిగ్ బాస్ తెలుగు 9 సీజన్ మూడో వారానికి చేరుకుంది. ఇప్పటికీ హౌజ్ నుంచి ఇద్దరు ఎలిమినేట్ అయి వెళ్లిపోగా ప్రస్తుతం బిగ్ బాస్ తెలుగు 9లో 13 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. వారికి మూడో వారం బిగ్ బాస్ తెలుగు 9 నామినేషన్స్ ప్రక్రియ నిర్వహించారు. అందులో ఆరుగురు నామినేట్ అయ్యారు.
బిగ్ బాస్ 9 తెలుగు ఈ వారం నామినేషన్స్‌లో రీతూ చౌదరి, హరిత హరీష్, రాము రాథోడ్, ప్రియా శెట్టి, కల్యాణ్ పడాల, ఫ్లోరా సైని ఉన్నారు. వీరికి నామినేషన్స్ ప్రక్రియ ముగిసిన తర్వాతి నుంచి ఓటింగ్ నిర్వహించారు. అలా బిగ్ బాస్ తెలుగు 9 మూడో వారం నామినేషన్స్ ఓటింగ్ ఫలితాల్లో తెలుగు ఫోక్ సింగర్ రాము రాథోడ్ నెంబర్ వన్ ప్లేసులో దూసుకుపోతున్నాడు.
రాము రాథోడ్ 26.93 శాతం ఓటింగ్ (14, 216 ఓట్ల)తో టాప్ 1 స్థానంలో ఉన్నాడు. రెండో స్థానంలో ఫ్లోరా సైనికి 25.71 శాతం ఓటింగ్ (13,575 ఓట్లు) పడింది. 13.53 ఓటింగ్ (7,144)తో సోల్జర్ కల్యాణ్ పడాల టాప్ 3లో నిల్చున్నాడు. 13.3 శాతం ఓటింగ్ 7,024 ఓట్లతో నాలుగో స్థానాన్ని దక్కించుకున్నాడు మాస్క్ మ్యాన్ హరిత హరీష్.
ఇక చివరి రెండు స్థానాలు అయిన డేంజర్ జోన్‌లో జబర్దస్త్ ముద్దుగుమ్మ రీతూ చౌదరి 11.98 శాతం ఓటింగ్ (6,324 ఓట్లు)తో నాలుగో స్థానంలో 8.55 శాతం ఓటింగ్ (4,515 ఓట్లు)తో ఐదో ప్లేసులో కామనర్ ప్రియా శెట్టి ఉంది. ఇలా ఓటింగ్ ఉండగా.. చివరి రెండు స్థానాల్లో ఉన్న రీతూ చౌదరి, ప్రియా శెట్టి డేంజర్ జోన్‌లో ఉన్నారు.
వీరిలో ఒకరు బిగ్ బాస్ నుంచి ఈ వారం ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది. అయితే, రీతూ చౌదరి పర్సనల్ వీడియోలు, బిగ్ బాస్ హౌజ్‌లో ఇద్దరు పవన్‌లతో చేసే లవ్ డ్రామా ప్రేక్షకులకు నచ్చడం లేదు. దాంతో ఈ వారం కచ్చితంగా రీతూ చౌదరినే ఎలిమినేట్ అయి వెళ్లిపోయే ఛాన్స్ ఎక్కువగా ఉందని టాక్ వినిపిస్తుంది.
ఇదిలా ఉంటే, నామినేషన్స్‌లో ఉన్న ఫ్లోరా ఇమ్యునిటీ సాధించి ఎలిమినేషన్ నుంచి సేఫ్ అయింది. బిగ్ బాస్ తెలుగు 9 సెప్టెంబర్ 24న జరిగిన ఎపిసోడ్‌లో కంటెస్టెంట్స్‌కు టాస్క్ ఆడించగా అందులో హీరోయిన్ ఫ్లోరా సైని గెలిచింది. దాంతో ఆమెకు ఇమ్యునిటీ లభించి ఈ వారం ఎలిమినేషన్ నుంచి సేఫ్ అయింది. అందుకే నామినేషన్స్ జాబితాలో ఇప్పుడు ఆమె పేరు కనిపించట్లేదు.
సంబంధిత కథనం